కోవిడ్-19 వ్యాక్సిన్ కోసం ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎలా ?
భారతదేశంలో కరోనా యొక్క వ్యాప్తిని తగ్గించే ప్రయత్నంలో భాగంగా 18 సంవత్సరాల పైబడిన ప్రజందరికి కోవిడ్-19 టీకాను పొందడం కోసం నమోదు కార్యక్రమం ప్రారంభించింది.18 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి ఒక్కరు టీకా కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇట్టి రిజిస్ట్రేషన్ కోవిన్ పోర్టల్ (www.cowin.gov.in)లో గాని,ఉమాంగ్(umang), ఆరోగ్యసేతు (aarogya setu) ఆప్‌లో గాని చేసుకోవచ్చు.
కోవిన్ పోర్టల్ (www.cowin.gov.in) ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎలా ?
స్టెప్ 1 : మీరు కోవిన్ వెబ్‌సైట్ లేదా www.cowin.gov.in కు వెళ్లి అందులో గల ‘‘ రిజిస్ట్రర్/సైన్ ఇన్ యువర్‌సెల్ఫ్‌పై" క్లిక్ చేయండి
స్టెప్ 2 : తర్వాత మీ యొక్క మోబైల్ నెంబర్ అడగడం జరుగుతుంది. అందులో మీ యొక్క పర్మినెంట్ మోబైల్ నెంబర్‌ని ఎంటర్ చేయండి
స్టెప్ 3 : మీ యొక్క మోబైల్ నెంబర్‌కు ‘‘ ఓటిపి ’’ వస్తుంది. దానికి అక్కడ ఎంటర్ చేయండి.
స్టెప్ 4 : తర్వాత రిజిస్ర్టర్ మెంబర్ అని వస్తుంది దానిపై క్లిక్ చేయండిస్టెప్ 5 : రిజిస్ట్రేషన్ కోసం ఒక పేజి ఓపేన్ కావడం జరుగుతుంది. అందులో మీ యొక్క ఫోటో ఐడి గుర్తింపుకార్డు(ఆధార్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్‌కార్డు, పాస్‌పోర్టు, పెన్షన్ పాస్‌బుక్, ఎన్‌ఆర్‌ఆర్ స్మార్ట్ కార్డు, ఓటరు ఐడి వంటివి), ఐడి కార్డు నెంబర్, పేరు, డేట్ ఆఫ్ బర్త్ లింగం వంటి వివరాలు ఎంటర్ చేయాలి.స్టెప్ 6 : తర్వాత రిజిస్ట్రర్ బటన్ పై క్లిక్ చేయాలి
స్టెప్ 7 : తర్వాత వెబ్‌సైట్ పిన్‌కోడ్‌లోని కేంద్రాలను చూపుతుంది. మీ దగ్గరలోని పిన్‌కోడ్‌ను ఎంటర్ చేయాలి
స్టెప్ 8 : తేది మరియు సమయాన్ని ఎంచుకొని కన్మార్మ్ బటన్‌పై క్లిక్ చేయాలి. మీ యొక్క లాగిన్ ఐడి ద్వారా మీ యొక్క నలుగురు కుటుంబ సభ్యులను రిజిస్ట్రర్ చేసుకోవడానికి వీలు ఉంటుంది.
ఉమాంగ్(umang) యాప్ ద్వారా కోవిడ్-19 వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎలా ?
స్టెప్ 1 : మీరు ఉమాంగ్ యాప్ ఓపేన్ చేయాలి. అందులో ‘‘ హెల్త్ ’’ బటన్‌పై క్లిక్ చేయాలి. అక్కడ మీరు కోవిన్ ను ఎంచుకోవాలి.స్టెప్ 2 : తర్వాత రిజిస్టర్ లేదా లాగిన్ ఫర్ వాక్సినేషన్ క్లిక్ చేయాలి.
స్టెప్ 2 : తర్వాత మీ యొక్క మోబైల్ నెంబర్ అడగడం జరుగుతుంది. అందులో మీ యొక్క పర్మినెంట్ మోబైల్ నెంబర్‌ని ఎంటర్ చేయండి
స్టెప్ 3 : మీ యొక్క మోబైల్ నెంబర్‌కు ‘‘ ఓటిపి ’’ వస్తుంది. దానికి అక్కడ ఎంటర్ చేయండి.
స్టెప్ 4 : రిజిస్ట్రేషన్ కోసం ఒక పేజి ఓపేన్ కావడం జరుగుతుంది. అందులో మీ యొక్క ఫోటో ఐడి గుర్తింపుకార్డు(ఆధార్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్‌కార్డు, పాస్‌పోర్టు, పెన్షన్ పాస్‌బుక్, ఎన్‌ఆర్‌ఆర్ స్మార్ట్ కార్డు, ఓటరు ఐడి వంటివి) ఐడి కార్డు నెంబర్, పేరు, డేట్ ఆఫ్ బర్త్ లింగం వంటి వివరాు ఎంటర్ చేయాలి.స్టెప్ 5 : తర్వాత సబ్‌మిట్ బటన్ పై క్లిక్ చేయాలి
స్టెప్ 6 : దీని తర్వాత లబ్దిదారుని యాడ్ చేసిన పాప్-ఆప్ పొందుతారు. ‘‘ఓకే’’ బటన్ మీద క్లిక్ చేయండి.
స్టెప్ 7 : కొత్తపేజిలో ‘‘ యాడ్‌మోర్ ’’ బటన్‌ను నొక్కడం ద్వారా మరో నలుగురు కుటుంబ సభ్యులను ఎంపిక చేసుకోవచ్చు
స్టెప్ 8 : మీ యొక్క లబ్దిదారులను చేర్చడం కోసం మీరు లబ్దిదారుందరిని ఎన్నుకోవాలి మరియుషెడ్యూల్ అపాయింట్‌మెంట్ ఎంపికపై క్లిక్ చేయాలి.
స్టెప్ 9 : మీ పిన్‌కోడ్‌ను వెతికి ఆపై తేది మరియు వ్యాక్సిన్ ను ఎంచుకోవాలి
స్టెప్ 10: మీరు టీకాలు వేస్తున్న కేంద్రాల జాబితాను చూస్తారు. మీకు దగ్గరలో ఉన్న కేంద్రంలో సమయాన్ని ఎంచుకొని సబ్‌మిట్ పై క్లిక్ చేయాలి.
స్టెప్ 11 : దీని తర్వాత టీకా నిర్ధారణ కోసం మీ రిజిస్టర్ మోబైల్ నంబర్‌లో కన్మార్మ్ మెస్సెజ్ మీకు వస్తుంది.
ఆరోగ్య సేతు(aarogya setu) యాప్ ద్వారా కోవిడ్-19 వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎలా ?
స్టెప్ 1 : మీరు ఆరోగ్యసేతు యాప్ ఓపేన్ చేయాలి. అందులో ‘‘ వ్యాక్సినేషన్ ’’ బటన్‌పై క్లిక్ చేయాలి. అక్కడ మీరు కోవిన్ ను ఎంచుకోవాలి.
స్టెప్ 2 : తర్వాత మీ యొక్క మోబైల్ నెంబర్ అడగడం జరుగుతుంది. అందులో మీ యొక్క పర్మినెంట్ మోబైల్ నెంబర్‌ని ఎంటర్ చేయండి
స్టెప్ 3 : మీ యొక్క మోబైల్ నెంబర్‌కు ‘‘ ఓటిపి ’’ వస్తుంది. దానికి అక్కడ ఎంటర్ చేయండి.
స్టెప్ 4 : రిజిస్ట్రేషన్ కోసం ఒక పేజి ఓపేన్ కావడం జరుగుతుంది. అందులో మీ యొక్క ఫోటో ఐడి గుర్తింపుకార్డు(ఆధార్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్‌కార్డు, పాస్‌పోర్టు, పెన్షన్ పాస్‌బుక్, ఎన్‌ఆర్‌ఆర్ స్మార్ట్ కార్డు, ఓటరు ఐడి వంటివి) ఐడి కార్డు నెంబర్, పేరు, డేట్ ఆఫ్ బర్త్ లింగం వంటి వివరాలు ఎంటర్ చేయాలి.
స్టెప్ 5 : తర్వాత సబ్‌మిట్ బటన్ పై క్లిక్ చేయాలి
స్టెప్ 6 : తర్వాత పిన్‌కోడ్‌లోని కేంద్రాలను చూపుతుంది. మీ దగ్గరలోని పిన్‌కోడ్‌ను ఎంటర్ చేయాలి
స్టెప్ 7 : తేది మరియు సమయాన్ని ఎంచుకొని కన్మార్మ్ బటన్‌పై క్లిక్ చేయాలి. మీ యొక్క లాగిన్ ఐడి ద్వారా మీ యొక్క నలుగురు కుటుంబ సభ్యులను రిజిస్ట్రర్ చేసుకోవడానికి వీలు ఉంటుంది.
0 Comments