లా స్కూల్‌ అడ్మిషన్‌ టెస్టు ఇండియా (ఎల్‌ శాట్‌)-2022



 లా స్కూల్‌ అడ్మిషన్‌ టెస్టు ఇండియా (ఎల్‌ శాట్‌)-2022

భారతదేశ వ్యాప్తంగా ఉన్న నేషనల్‌ లా యూనివర్సిటీల్లో ప్రవేశాలకు ప్రతి సంవత్సరం  కామన్‌ అడ్మిషన్‌ లా టెస్టు (క్లాట్‌)  క్లాట్‌తో సంబందం లేకుండా ఇతర లా కాలేజీల్లో అడ్మిషన్‌ పొందడానికి నేషనల్‌ స్థాయిలో నిర్వహించే పరీక్ష ‘‘ లా స్కూల్‌ అడ్మిషన్‌ టెస్టు ఇండియా ( ఎల్‌ శాట్‌` ఇండియా)".
    లా స్కూల్‌ అడ్మిషన్‌ కౌన్సిల్‌ ఈ పరీక్షను ప్రతి సంవత్సరం రెండుమార్లు నిర్వహిస్తుంది. 2022 జనవరి పరీక్షకు గాను నోటిఫికేషన్‌ జారీ చేసింది.
    భారతదేశంలోని వివిధ న్యాయ విద్యాసంస్థల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే పరీక్షనే ‘‘ ఎల్‌ శాట్‌. ఈ ప్రవేశ పరీక్షలో సాధించిన స్కోర్‌ ఆధారంగా లా కాలేజిల్లో ప్రవేశాలు పొందవచ్చు. ఇందులో చూపిన ప్రతిభ ఆధారంగా బ్యాచిలర్‌ ఆఫ్‌ లా, పీజీ లా కోర్సులలో ప్రవేశం లభిస్తుంది.

➺ కోర్సులు :
ఎల్‌శాట్‌లో సాధించిన స్కోర్‌ ఆధారంగా
1)    లా ఇనిస్టిట్యూట్స్‌లో 5 సంవత్సరాల బీఏ ఎల్‌ఎల్‌బీ, బీబీఏ ఎల్‌ఎల్‌బీ, బీకామ్‌ ఎల్‌ఎల్‌బీ, బీఎస్సీ ఎల్‌ఎల్‌బీ
2)    3 సంవత్సరాల ఎల్‌ఎల్‌బీ
3)    2 సంవత్సరాల ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశం సాధించవచ్చు.


అర్హత :

  •    5 సంవత్సరాల ఇంటిగ్రేటేడ్‌ కోర్సులకు         -    ఇంటర్‌ / తత్సమాన పరీక్షలో 45 శాతం మార్కులు సాధించాలి.
  •   3 సంవత్సరాల ఎల్‌ఎల్‌బీ ప్రవేశం కొరకు ఏదేని డిగ్రీ ఉండాలి.
  •   2 సంవత్సరాల ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశం పొందాలంటే ఎల్‌ఎల్‌బీ పూర్తి చేయాల్సి ఉంటుంది.


ప్రవేశ విధానం :
ఎల్‌శాట్‌ ఇండియా ప్రవేశ పరీక్షలో సాధించిన స్కోరు ఆధారంగా ఆయా ఇనిస్టిట్యూట్‌లు అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. సదరు విద్యా సంస్థల నిబంధనల ప్రకారం ఎంపిక ప్రక్రయ కొనసాగుతుంది. కోర్సుల ప్రభావాన్ని బట్టి ఇతర అర్హతలు కూడా ఉంటేనే ప్రవేశానికి అవకాశం ఉంటుంది.

పరీక్షా పద్దతి :
ఎల్‌ శాట్‌ పరీక్ష రెండు విధానాల్లో జరుగుతుంది. 1) ఆన్‌లైన్‌ 2) రిమోట్‌ ప్రోక్టార్డ్‌ విధానం
రిమోట్‌ ప్రోక్టార్డ్‌ విధానం ద్వారా విద్యార్థులు తమ ఇంటి నుండే పరీక్ష వ్రాసుకునే సౌలభ్యం ఉంటుంది.

పరీక్షా సమయం :
2.20 గంటలు

ప్రశ్నాపత్రం విధానం :

మల్టిపుల్‌ ఛాయిస్‌లో ఉంటుంది.

ధరఖాస్తు విధానం :
ఆన్‌లైన్‌ ద్వారా

ముఖ్యమైన తేదిలు :

ఆన్‌లైన్‌ ధరఖాస్తులకు చివరి తేది     -    03-01-2021
ప్రవేశ పరీక్ష తేది.                                -     15-01-2021


పూర్తి వివరాలకు :

ఇక్కడ క్లిక్‌ చేయండి 




Post a Comment

0 Comments