Rolls-Royce Unnati Scholarship for Women

 Rolls-Royce Unnati COVID Scholarship for Women


Rolls-Royce India, Rolls-Royce Unnati COVID Scholarship for Women ద్వారా కోవిడ్‌-19 వైరస్‌ వల్ల కుటుంబంలో సంపాదించే వ్యక్తి కోల్పొయిన బాలికా (గర్ల్‌స్టూడెంట్స్‌) విద్యార్థినీలకు స్కాలర్‌షిప్‌ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తుంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో డిగ్రీ (జనరల్‌ మరియు ప్రొఫేషనల్‌) సైన్స్‌, టెక్నాలజీ, ఇంజనీరింగ్‌ మరియు మ్యాథమెటిక్స్‌ కోర్సులు చదివే బాలికలు ఇట్టి స్కాలర్‌షిప్‌ ధరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. డిగ్రీ చదివే బాలికా విద్యార్థులకు 25000 రూపాయలు ఎటువంటి ఆటంకం లేకుండా  డిగ్రీ పూర్తి చేయడానికి ఏకమొత్తంలో ఆర్థిక సహాయం అందిస్తుంది. ఇట్టి స్కాలర్‌షిప్‌ కొరకు ఆన్‌లైన్‌ ద్వారా 31 జనవరి 2022 లోగా ధరఖాస్తు చేసుకోవాలి. ధరఖాస్తు చేసుకునే అభ్యర్థి కుటుంబ వార్షిక ఆదాయం 6 లక్షలకు మించరాదు. 

➨ Rolls-Royce Unnati COVID Scholarship for Women ప్రోగ్రామ్‌ ధరఖాస్తు చేసుకోవడానికి కావాల్సిన అర్హతలు :

1) భారతీయ విద్యార్థులు అయి ఉండాలి 

2) కోవిడ్‌-19 వల్ల తమ పేరేంట్స్‌ / ఎర్నింగ్‌ మెంబర్‌ కోల్పొయిన స్టూడెంట్స్‌ 

3) అభ్యర్థులు ఖచ్చితంగా సైన్స్‌, టెక్నాలజీ, ఇంజనీరింగ్‌ మరియు మ్యాథమెటిక్స్‌ కోర్సులలో డిగ్రీ చదువుతున్న వారై ఉండాలి. 

4) అభ్యర్థులు ప్రస్తుత విద్యా సంవత్సరం డిగ్రీలో ప్రవేశం పొంది ఉండాలి.

5) అభ్యర్థి యొక్క కుటుంబ వార్షిక ఆదాయం అన్ని మార్గాల ద్వారా 6 లక్షలకు మించరాదు. 

 ప్రోత్సాహకం / స్కాలర్‌షిప్‌ మొత్తం :

1) ఇట్టి స్కాలర్‌షిప్‌ కొరకు ఎంపికైన విద్యార్థులకు తమ డిగ్రీ కోర్సు పూర్తి చేయడానికి ఏకమొత్తంలో 25000 రూపాయలు అందించడం జరుగుతుంది. 

(ఇట్టి స్కాలర్‌షిప్‌ రూపాయలను తమ చదువును కొనసాగించడానికి అయ్యే ఖర్చులు అనగా ట్యూషన్‌ ఫీజు, హస్టల్‌ ఫీజు, ఇంటర్‌నెట్‌, ల్యాప్‌టాప్‌, బుక్స్‌, స్టేషనరీ, ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ వంటి వాటి కొరకు మాత్రమే వినియోగించాలి.)

 Rolls-Royce Unnati COVID Scholarship for Women ప్రోగ్రామ్‌కు కావాల్సిన ధృవీకరణ పత్రాలు : 

1) పాస్‌పోర్టు సైజు ఫోటో 

2) ఆధార్‌ కార్డు 

3) ఫ్యామిలీ ఇన్‌కమ్‌ ప్రూఫ్‌ (సాలరీ స్లిప్‌, ఫారం-16, ఆదాయం సర్టిఫికేట్‌, ఐటిఆర్‌)

4) గత సంవత్సరం మార్కుల మెమో 

5) ప్రస్తుత విద్యా సంవత్సరంలో అడ్మిషన్‌ పొందినట్లు ప్రూఫ్‌ ( ఫీజు రశీదు/ అడ్మిషన్‌ లెటర్‌/ సంస్థ ఐడి కార్డు, బోనఫైడ్‌ సర్టిఫికేట్‌) 

6) కోవిడ్‌-19 వల్ల మరణించిన వ్యక్తి యొక్క మరణ ధృవీకరణ పత్రము.

7) బ్యాంక్‌ అకౌంట్‌ పాస్‌బుక్‌ 

 ధరఖాస్తు విధానం :

అర్హులైన అభ్యర్థులను తమ ధరఖాస్తులను ఆన్‌లైన్‌ విధానంలో సమర్పించి నమోదు చేసుకోవాలి.

 ముఖ్యమైన తేదీలు :

తేది.31 జనవరి 2022 లోగా ఆన్‌లైన్‌ ద్వారా ధరఖాస్తు చేసుకోవాలి.

 ఆన్‌లైన్‌ ధరఖాస్తు కొరకు :

Click Here

 పూర్తి వివరాలకు :

Click Here

 Rolls-Royce Unnati COVID Scholarship for Women

ప్రోగ్రామ్పేరు

స్కాలర్షిప్‌ 


ఎవరి కోసం

కోవిడ్బాదితుల కోసం 


ఎవరు అర్హులు

 

కోవిడ్‌ - 19 వల్ల పేరేంట్స్‌ / ఎర్నింగ్‌  మెంబర్కోల్పొయిన స్టూడెంట్స్‌  


అర్హతలు

డిగ్రీ చదువుతున్న గర్ల్స్టూడెంట్స్‌ 


స్కాలర్షిప్ప్రోత్సాహకం

25000 రూపాయలు 


ఎంపిక విధానం

మెరిట్ఆధారంగా 


ధరఖాస్తు విధానం

ఆన్లైన్విధానం


చివరి తేది

31 జనవరి 2022


వెబ్సైట్

Click Here 


ఆన్లైన్కొరకు

Click Here


Post a Comment

0 Comments