Kalyanalaxmi / Shadi mubarak scheme in telugu || కళ్యాణలక్ష్మి / షాదిముబారక్‌ ( పేదింటి ఆడపిల్లల పెళ్లికి ఆర్థిక భరోసా ) || Telangana Gk in Telugu


KALYANALAXMI / SHADI MUBARAK
Telangana Schemes in Telugu

Gk in Telugu || General Knowledge in Telugu

 కళ్యాణలక్ష్మి / షాదిముబారక్‌ 
పేదింటి ఆడపిల్లల పెళ్లికి ఆర్థిక భరోసా 

 కళ్యాణలక్ష్మి / షాదిముబారక్‌ 

తెలంగాణ రాష్ట్రంలో నిరుపేద కుటుంబానికి చెందిన తల్లిదండ్రులు తమ కూతురు వివాహ ఖర్చుల కోసం ఇబ్బందులు పడకుండా ఆర్థిక సహాయం అందించే ఉద్దేశ్యంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు గారు 2014 సంవత్సరంలో ఇట్టి గొప్ప పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఇట్టి పథకం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది నిరుపేదలు లబ్దిపొందుతున్నారు. ప్రతి సంవత్సరం బడ్జెట్‌ దీనికి ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. 

    తెలంగాణ ప్రభుత్వం పేదింటి ఆడపిల్లల వివాహం కోసం 1,00,116 (ఒక లక్ష నూట పదహారు) రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందించే ఉన్నత లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు గారు ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పథకం ద్వారా దళిత, గిరిజన, బీసీ, ఓబిసీ, మైనార్టీ కులాలకు చెందిన యువతుల యొక్క వివాహాం కోసం చేయూతగా 1,00,116 రూపాయలు ఆర్థిక సహాయం రూపంలో అందిస్తుంది. ఇట్టి బృహత్తర పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు గారి చేతులమీదుగా 02, అక్టోబర్‌ 2014 రోజున ప్రారంభించడం జరిగింది. పెళ్లి సమయంలో వదువు పెళ్లి ఖర్చుల కోసం కుటుంబానికి 1,00,116 రూపాయలు అందించడం జరుగుతుంది. వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో 1,50,000/- రూపాయలకు మించకుండా, పట్టణ ప్రాంతాలలో 2,00,000/- రూపాయలు మించకుండా ఉన్నవారు ఈ పథకానికి ధరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అవుతారు. 

kalyana laxmi scheme in telugu
ఇట్టి పథకం ప్రారంభమైనప్పుడు 51 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. తర్వాత దీనిని 75 వేల 116 రూపాయలకు పెంచారు. 19 మార్చి 2018 నుండి ఇట్టి ఆర్థిక సహాయాన్ని 1,00,116/- రూపాయలకు పెంచి అందించడం జరుగుతుంది. 

➽ ఎవరు అర్హులు  :

  •  తెలంగాణ రాష్ట్రం నివాసులు అయి ఉండాలి 
  • ఆడపిల్ల వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
  •   వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో 1,50,000/- రూపాయలు, పట్టణ ప్రాంతాలలో 2,00,000/- రూపాయలు మించరాదు. 

 కావాల్సిన ధృవీకరణ పత్రాలు :

➦ వదువు :-

  •  ఆధార్‌ కార్డు
  •  రేషన్‌ కార్డు జిరాక్స్‌ (ఎఫ్‌.ఎస్‌.సి)
  • 10వ తరగతి మెమో / వయస్సు ధృవీకరణ పత్రము 
  •  కులం సర్టిఫికేట్‌ 
  •  ఆదాయం సర్టిఫికేట్‌ 
  •  నివాసం సర్టిఫికేట్‌ 
  •  పెళ్లికూతురు తల్లి అకౌంట్‌ బుక్‌ 
  •  పెళ్లి కూతురు అకౌంట్‌ బుక్‌ 
  •  పెళ్లి కూతురు తల్లి ఆధార్‌ కార్డు 
  •  పెళ్లి కార్డు 
  •  పెండ్లి ఫోటోలు 
  •  మ్యారేజ్‌ రిజిస్ట్రేషన్‌ సర్టిఫికేట్‌ 

 వరుడు :-

  •  ఆధార్‌ కార్డు
  •  రేషన్‌ కార్డు జిరాక్స్‌ (ఎఫ్‌.ఎస్‌.సి)
  •  10వ తరగతి మెమో / వయస్సు ధృవీకరణ పత్రము 
  •  కులం సర్టిఫికేట్‌ 
  •  ఆదాయం సర్టిఫికేట్‌ 
  •  నివాసం సర్టిఫికేట్‌ 
  •  పెండ్లి కార్డు 

➥ ధరఖాస్తు విధానం 

➠ స్టెప్‌ - 1 

మొదటగా https://telanganaepass.cgg.gov.in వెబ్‌సైట్‌ ఓపేన్‌ చేయాలి. మీకు కింది విధంగా వెబ్‌సైట్‌ ఓపేన్‌ కావడం జరుగుతుంది. 
kalayanalaxmi scheme

➠ స్టెప్‌ - 2

తర్వాత అందులో కళ్యాణలక్ష్మి / షాదిముబారక్‌ పై క్లిక్‌ చేయాలి. వెంటనే మీకు కింది విధంగా విండో ఓపేన్‌ కావడం జరుగుతుంది. 
kalayanalaxmi scheme

➠ స్టెప్‌ - 3

తర్వాత రిజిస్ట్రేషన్‌పై క్లిక్‌ చేయాలి. రిజిస్ట్రేషన్‌పై క్లిక్‌ చేసిన తర్వాత కళ్యాణలక్ష్మి ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ఫారం ఓపేన్‌ కావడం జరుగుతుంది. అందులో వదువు మరియు వరునికి సంబందించిన వివరాలు, కులం, ఆదాయం సర్టిఫికేట్‌ వివరాలు, బ్యాంక్‌ ఖాతా వివరాలు నమోదు చేయాలి. మరియు సంబందిత డాక్యుమెంట్‌లు అప్‌లోడ్‌ చేసిన తర్వాత సబ్మిట్‌ బటన్‌పై క్లిక్‌ చేయాలి. తర్వాత ఆన్‌లైన్‌ అప్టికేషన్‌ పూర్తి కావడం జరుగుతుంది. తర్వాత ఆన్‌లైన్‌ పూర్తి చేసిన వివరాలతో కూడిన ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ ఫారం డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. 
kalayanalaxmi scheme

kalayanalaxmi scheme

Post a Comment

0 Comments