Asara Pension Scheme in telugu || ఆసరా పెన్షన్‌ పథకం || Telangana Gk in Telugu || General Knowledge in Telugu

asara pensions in telugu

ASARA PENSION SCHEME
Telangana Schemes in telugu

Gk in Telugu || General Knowledge in Telugu

ఆసరా పెన్షన్‌ పథకం 

2014 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలోని పేదలందరు గౌరవప్రదంగా, సురక్షితమైన జీవితాన్ని గడపాలనే మంచి లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు గారు ‘‘ ఆసరా ’’ పెన్షన్‌ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇట్టి ‘‘ ఆసరా ’’ పెన్షన్‌ పథకం తెలంగాణ రాష్ట్రంలోని బడుగు, బలహీన వర్గాలకు ఆర్థిక చేయూతనందించడం కోసం ప్రవేశపెట్టిన పథకం. తెలంగాణ రాష్ట్రంలోని వృద్దులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, హెచ్‌ఐవి/ఎయిడ్స్‌ బాదితులు, బోదకాలు బాదితులు, డయాలసిస్‌ బాదితులు, బీడి కార్మికులకు సామాజిక భద్రతతో కూడిన జీవితాన్ని గడపడానికి, రోజువారీ కనీస అవసరాలను తీర్చుకోవడానికి నెలవారీ పెన్షన్‌ అందించడం జరుగుతుంది. 

2014 సంవత్సరంలో నూతన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు గారి ప్రభుత్వం ‘‘ ఆసరా ’’ పెన్షన్‌ పథకం ప్రవేశపెట్టడం ద్వారా నెలవారీ పెన్షన్‌ను వృద్దులు, వితంతువులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, హెచ్‌ఐవి`ఎయిడ్స్‌ రోగులకు రూ.200 నుండి 1000 రూపాయలకు, వికలాంగులకు 1500 లకు పెంచి ఇవ్వడం జరిగింది. ఇట్టి మొత్తాన్ని 2019 సంవత్సరం  నుండి 1000 రూపాయల నుండి 2016 రూపాయలకు, వికలాంగులకు 3016 రూపాయలకు పెంచి ఇవ్వడం జరుగుతుంది. 

 తెలంగాణ ప్రభుత్వం 2019 ఏప్రిల్‌ 1వ తేది నుండి వృద్దులు, ఒంటరి మహిళలు, వితంతువులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, హెచ్‌ఐవి/ఎయిడ్స్‌ ఉన్నవారు, బోదకాలు బాదితులు, డయాలసిస్‌ బాదితులు, బీడి కార్మికులకు రూ.2016 అందిస్తుంది. వికలాంగులకు 3016 రూపాయలను నెలవారీ పెన్షన్‌గా అందిస్తుంది. భారతదేశంలో బీడి కార్మికులకు పెన్షన్‌ అందించే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. 

పెన్షన్‌కు తీసుకునే వయస్సు మొదట్లో 60 సంవత్సరాలు ఉండగా 08 మార్చి 2020 నుండి ఇట్టి ధరఖాస్తు వయస్సు 57 సంవత్సరాలకు తగ్గించింది.

➠ ఎవరు అర్హులు :

  • తెలంగాణ రాష్ట్రం నివాసులు అయి ఉండాలి. 

➤ వృద్దులు -

57 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉండే నిరుపేద కుటుంబానికి చెందిన వృద్దులు ధరఖాస్తు చేసుకోవచ్చు. 

కావాల్సిన పత్రాలు -

పుట్టిన తేది ధృవీకరణ పత్రము / ఆధార్‌ కార్డు / వయస్సు ధృవీకర పత్రం 

 చేనేత కార్మికులు -

50 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉండాలి. ఖచ్చితంగా చేనేత వృత్తి కొనసాగిస్తు ఉండాలి. 

 కల్లుగీత కార్మికులు -

50 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉండాలి. లబ్దిదారులు కల్లుగీత సహయక సంఘంలో సభ్యత్వం పొంది ఉండాలి. 

 హెచ్‌.ఐ.వి ఏయిడ్స్‌ / బోదకాలు / డయాలసిస్‌ బాదితులు -

వీరికి వయస్సుతో సంబందం లేదు. వ్యాదిని నిర్ధారించే ధృవీకరణ పత్రము కావాలి. 

➤ వికలాంగులు -

వీరికి వయస్సుతో సంబందం లేదు. వైకల్య శాతం 40 శాతం కంటే తక్కువ ఉండరాదు. వినికిడి లోపం ఉన్నవారికి 51 శాతం వైకల్యం ఉండాలి. ప్రభుత్వం వికలాంగులకు అందించే సదరన్‌ సర్టిఫికేట్‌ కల్గి ఉండాలి. 

➤ బీడికార్మికులు -

వీరు బీడి కార్మికులుగా జీవిస్తు ఉండాలి. వీరికి ఈపిఎఫ్‌వో ద్వారా ప్రతి నెల ఫిఎఫ్‌ కట్‌ అవుతూ ఉండాలి. 


Also Search For : 

Kalyanalaxmi Scheme



Post a Comment

0 Comments