భారత నదీజలాల లగ్జరీ నౌక గంగా విలాస్‌ (Indian river cruise ship in telugu) || Gk in Telugu || Indian Geography in telugu

 భారత నదీజలాల లగ్జరీ నౌక గంగా విలాస్‌ 

Indian river cruise ship in telugu

Gk in Telugu || General Knowledge in Telugu

ganga vilas ship in telugu

ప్రపంచంలో మనం అనేక విలాసవంతమైన క్రూయిజ్‌ షిప్‌లను చూసిఉంటాము. అవన్ని సముద్ర జలాల మీదుగా సాగే విలాసవంతమైన క్రూయిజ్‌ షిప్‌ ప్రయాణాలు. కానీ ప్రపంచంలో మొట్టమొదటి సారిగా భారతదేశంలోని నదీజలాల గుండా భారతీయ సంస్కృతిని చాటే విధంగా అత్యంత అరుదైన సుధీర్ఘమైన నౌక ప్రయాణం ప్రారంభమైంది. భారతదేశంలోని ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, పశ్చిమబెంగాల్‌, అస్సోం రాష్ట్రాల నదీ ప్రాంతాలే కాకుండా బంగ్లాదేశ్‌ గుండా సాగే ఈ నౌక పేరు ``గంగా విలాస్‌ ``. ఈ గంగా విలాస్‌ నౌకను భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు 13 జనవరి 2023 రోజున ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం వారణాసిలో ప్రారంభించినారు. 

ఈ గంగా విలాస్‌ నౌక ప్రపంచంలోనే అతిపెద్ద నదీ పర్యాటక ప్రాజేక్టుగా (రివర్‌ క్రూయిజ్‌) పేరుగాంచింది. భారతీయతను ప్రపంచానికి చాటి చెప్పే సరికొత్త మార్గంగా, భారతీయ సాంస్కృతిని, సుసంపన్నతను, ఆధ్యాత్మిక వైభవాన్ని మరొకసారి ప్రపంచానికి నూతనంగా చాటే విధంగా ఈ నౌక రూపుదిద్దుకుంది. ఈ నౌక ప్రయాణం భారతదేశంలోని ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని వారణాసి, బీహార్‌ రాష్ట్రంలోని పాట్నా, పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కటా మీదుగా బంగ్లాదేశ్‌ దేశం గుండా సాగుతుంది. ఈ నౌక భారతదేశంతో పాటు బంగ్లాదేశ్‌ దేశంలోని నదుల గుండా సాగుతుంది. ఈ గంగా విలాస్‌ నౌక మొత్తం 51 రోజుల పాటు రెండు దేశాలకు చెందిన 27 నదుల మీదుగా మొత్తం 3200 కిలోమీటర్లు ప్రయాణం కొనసాగిస్తుంది. ఈ ప్రయాణంలో యునెస్కో గుర్తింపు పొందిన వారసత్వ ప్రదేశాలతో పాటు సుందర్భన్‌ అడవులు, కజరంగా నేషనల్‌ పార్కు, బీహార్‌ స్కూల్‌ ఆఫ్‌ యోగా, విక్రమశిల యూనివర్సిటి, బెంగాల్‌ డెల్టా ప్రాంతాలతో పాటు అనే పర్యాటక ప్రాంతాలను వీక్షించవచ్చు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ప్రారంభమయ్యే ఈ యాత్ర వివిధ రాష్ట్రాల గుండా ప్రయాణిస్తు అసోంలోని దిబ్రుగడ్‌ చేరుకోవడం ద్వారా ముగుస్తుంది. 

ఈ గంగావిలాస్‌ నౌక లో మొత్తం మూడు అంతస్తులలో 18 అత్యంత లగ్జరీ సూట్స్‌ ఉన్నాయి. ప్రయాణికుల కోసం ఈ నౌకలో అత్యంత విలాసవంతమైన సకల ఏర్పాట్లు చేసారు. ఈ నౌకలోని ప్రతి గదిలో 24 గంటలు వైపై సదుపాయం, ఏసి, టివి బాల్కనీ సదుపాయాలు ఉంటాయి. ఈ నౌక సకల సదుపాయాలతో కదిలే ఇంధ్రభవనంలా ఉంటుంది.  మనం ప్రయాణించే సమయంలో సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వ్యక్తిగతంగా బట్లర్‌ సర్వీసు, నౌక పైకి వెళ్లి సూర్యోదయం, సూర్యాస్తమయాన్ని వీక్షించే అవకాశం ఉంది. ఈ గంగా విలాస్‌ నౌక ప్రయాణం ద్వారా భారతదేశ ఘనమైన సంస్కృతి సాంప్రదాయాలతో పాటు చరిత్రలను తెలుసుకునే వీలుకల్గుతుంది. మన దేశ వారసత్వ పరంపరని అవగాహన చేసుకుంటూ, జాతీయ ఉద్యానవనాలు, నదీ ఒడ్డున ఉండే పుణ్యక్షేత్రాలు, చారిత్రక ప్రాధాన్యం కల్గిన పట్టణాల అందాలను తిలకిస్తూ ఈ ప్రయాణం కొనసాగించవచ్చు. భారత్‌తో పాటు బంగ్లాదేశ్‌ చారిత్రక, సంస్కృతికి మూలాలను భావితరాలకు తెలిపే విధంగా ఈ నౌక ప్రయాణం కొనసాగుతుంది. 

అతిపెద్ద లగ్జరీ రివర్‌ క్రూయిజ్‌ అయిన ఈ గంగా విలాస్‌ నౌకలో ప్రతి సూట్‌కు అటాచ్‌ బాత్‌రూమ్‌, ఫ్రెంచ్‌ బాల్కనీ, టివి, స్మోక్‌ అలారమ్స్‌ ఇలా ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి. ఈ క్రూయిజ్‌ షిప్‌లో 40 మంది ఏకకాలంలో భోజనం చేసే విధంగా ఏర్పాట్లు చేసారు. ప్రతి భారతీయునికి భారతీయ వంటకాలు వడ్డీస్తారు. లేజర్‌ షోలు, మనం ఆగే ప్రతి ప్రాంతం యొక్క వివరాలతో కూడి బ్రోచర్లు అందిస్తారు. నదీవిహారం సాగుతున్నప్పుడు ఓపేన్‌ డెక్‌పై కూర్చుని నదీ సోయగాన్ని ఆస్వాదించవచ్చు. ఈ గంగా విలాస్‌ క్రూయిజ్‌ విహారయాత్రం కేవలం వినోదం కోసమే కాకుండా భారత సాంస్కృతి సాంప్రదాయాలు, చరిత్రను ప్రపంచానికి చాటిచెప్పే విధంగా రూపొందించారు. 

➱ గంగా విలాస్‌ క్రూయిజ్‌ షిప్‌ ప్రత్యేకతలు :

  • ఈ నౌకను 13 జనవరి 2023 రోజున ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రం వారణాసిలో భారత ప్రధాన నరేంద్రమోడీ ప్రారంభించారు. 
  • ఈ గంగా విలాస్‌ నౌక మొత్తం 51 రోజుల పాటు ప్రయాణం కొనసాగిస్తుంది. 
  • ఈ నౌక భారతదేశంతో పాటు బంగ్లాదేశ్‌ దేశంలో ప్రయాణిస్తుంది. 
  • ఈ నౌక ఉత్తర ప్రదేశ్‌ వారణాసి, బీహార్‌ పాట్నా, జార్ఖండ్‌లో సాహిబ్‌ గంజ్‌, పశ్చిమబెంగాల్‌లో కోలకతా, బంగ్లాదేశ్‌ డాకా, అసోంలో గౌహతి పట్టణాలను కవర్‌ చేస్తుంది. 
  • ఈ నౌక ప్రయాణం 27 నదుల మీదుగా సాగుతుంది. 
  • ఈ నౌక అత్యాధునిక లగ్జరీ సూట్స్‌తో పాటు వైపై, టివి, స్పాలు, ఓపేన్‌ డెక్‌లు ఉన్నాయి. 
  • ఈ నౌక ప్రయాణం ఉత్తరప్రదేశ్‌ వారణాసిలో ప్రారంభమై అసోం దిబ్రుగడ్‌లో ముగుస్తుంది. 
  • ఇది ప్రపంచంలోనే నదుల మీదుగా సాగే సుధీర్ఘమైన నౌకా ప్రయాణం .
  • ఇది భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు, చరిత్రను భారతీయులతో పాటు ప్రపంచానికి చాటే విధంగా రూపొందించారు. 

Post a Comment

0 Comments