వావ్‌ ... ! అనిపించే వందేభారత్‌ రైల్‌ || Vande Bharat Express in telugu || Gk in Telugu || General Knowledge in Telugu

వావ్‌ ... ! అనిపించే వందేభారత్‌ రైల్‌ 

Vande Bharat Express in telugu

Gk in Telugu || General Knowledge in Telugu

వందే భారత్‌ రైలు .. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకుంది. ప్రధాని మోడి మేక్‌ ఇన్‌ ఇండియాలో భాగంగా తయారు చేసి వందేభారత్‌ రైలు విదేశాలతో పోటీపడుతూ సెమీ బుల్లెట్‌ రైలుగా పట్టాలెక్కింది. దేశంలో ఇప్పటివరకు 8 వందేభారత్‌ రైల్లు ప్రారంభమయ్యాయి. 8వ వందేభారత్‌ రైలును సికింద్రాబాద్‌ నుండి విజయవాడ వరకు తేది.15-01-2023 రోజున వర్చువల్‌ పద్దతిలో ప్రధాని నరేంద్ర మోడి ప్రారంభించినారు. తొలి వందేభారత్‌ రైలును 15-02-2019 రోజున ఢల్లీి నుండి వారణాసి మద్య ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. 

ఈ వందేభారత్‌ రైలులో ఎన్నో ఆశ్యర్చపరిచే ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ రైలు గంటకు గరిష్టంగా 180 కిలో మీటర్ల వేగంతో పరుగెడుతుంది. ప్రస్తుతం వేగ పరిమితి 160 కిలోమీటర్లకు కుదించారు.  చూడగానే మన దృష్టిమరల్చుకోని విధంగా అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో ఈ రైలు రూపొందించారు. ఈ రైలులో అత్యాధునిక రక్షణ పద్దతులు వాడారు. ఎదురెదురుగా వచ్చే రెండు రైళ్లు పరస్పరం ఢీకొట్టుకోకుండా కవచ్‌ అనే దేశీయంగా తయారుచేసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించినారు. ఒకవేళ అనుకోని పరిస్థితులలో రెండు రైళ్లు ఒకే ట్రాక్‌పై ప్రయాణిస్తుంటే ఈ కవచ్‌ అనే టెక్నాలజీ వల్ల ఒక కిలోమీటరు ముందే హెచ్చరికలు జారీచేసి రైలు వేగాన్ని తగ్గిస్తుంది. ఈ రైలు కేవలం 140 సెకన్లలోనే 160 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీంతో మనం మనం చేరాల్సిన గమ్యాన్ని తొందరగా చేరుకొని సమయాన్ని ఆదా చేసుకునే  అవకాశం ఉంది. ఇంతటి వేగంలో ప్రయాణించిన మనకు సాధారణ రైళ్లలో కనిపించే కుదుపులు ఏమాత్రం ఇందులో కనపించవు. విమానంలో ప్రయాణించిన విధంగా హాయిగా ప్రయాణాన్ని కొనసాగించవచ్చు.  ప్రయాణికులకు ఎప్పటికిప్పుడు సామాచారాన్ని అందించే డిజిటల్‌ స్క్రీన్‌లు ఉంటాయి. మనం ఎక్కడ ఎక్కాము, ఎక్కడ దిగాలి, ఇంకా ఎంత టైమ్‌ పడుతుంది, రైలు ఎంత వేగంతో వెళుతుంది వంటి అన్ని విషయాలు డిజిటల్‌ స్క్రీన్‌లో ప్రదర్శించబడతాయి. 

ఈ రైలు యొక్క డోర్లు పూర్తి ఆటోమేటేడ్‌ సిస్టమ్‌గా ఉంటాయి. ఒక్కసారి మనం రైలులోపలికి వెళ్లిన తర్వాత మనం డోర్లు తెరవడానికి వీలుఉండదు. రైలు ప్రారంభం అయ్యే, రైలు ఆగే  కొన్ని క్షణాల ముందు మాత్రమే డోర్లు తెరుచుకుంటాయి. మనం కావాలనుకున్నప్పుడు తలుపులు తెరిచే అవకాశం లేదు. ఈ తలుపుల పూర్తి  నియంత్రణ లోకోపైలట్‌ వద్ద ఉంటుంది. మనం కూర్చున్న సీట్లు 180 డిగ్రీల కోణంలో తిరుగుతాయి. దీంతో మనం ఏ వైపు కావాలంటే ఆ వైపుకు సీటును తిప్పుకొని ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు. మనం కుటుంబ సభ్యులతో వెళ్లే సమయంలో ఎదురెదురుగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ప్రయాణం చేయవచ్చు. ఈ రైలులో పెద్ద పెద్ద కిటికి అద్దాలు ఉంటాయి. దీంతో ప్రయాణ సమయంలో ఈ వెడల్పాటి అద్దాల నుండి ప్రకృతి అందాలను తిలకిస్తు పులకరిస్తు ప్రయాణం చేయవచ్చు. అంధుల కోసం బ్రెయిలీ లిపిలో సమాచారం, వరదలు వచ్చే సమయంలో ప్రత్యేక రక్షణ ఏర్పాటు ఈ రైలులో ఉన్నాయి. 

ఈ రైలుకు లోకోమోటివ్‌ను జతచేసే అవసరం లేకుండా రైలు అంతర్భాగంగానే ఇంజిన్‌ ఉంటుంది. రైలు రెండు చివర్లలలో లోకోపైలట్‌ కేబిన్‌లు ఉంటాయి. ఈ రైలులో గల మొత్తం 16 బోగీలు పూర్తిగా ఏసి బోగిలే ఉంటాయి. 24 గంటలు వైఫై సదుపాయం ఉంటుంది. రైలు వెలుపల మరియు లోపల సీసీ కెమెరాలు ఉంటాయి. దీంతో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరిగినా ముందే అప్రమత్తమయ్యే అవకాశం ఉంటుంది. ప్రతి కోచ్‌లో 32 ఇంచుల డిజిటల్‌ స్క్రీన్‌ ఉంటుంది. దీంతో ప్రయాణికులు రైలు వేగంతో సహా రైలుకు సంబందించిన అన్ని రకాల వివరాలు ప్రదర్శింపబడతాయి. హెచ్చరికలు కూడా ఉంటాయి. ఈ రైలు వెలుపలి భాగం ఏరోడైనమిక్‌ విధానంలో రూపొందించారు. ప్రతి కోచ్‌లో 4 ఎమర్జెన్సీ లైట్లు ఉంటాయి. కరెంటు సరఫరాలో ఎటువంటి అంతరాయం కల్గినా వెంటనే ఇవి వెలుగుతాయి. ఈ రైలును పుల్లీ సస్పెండెడ్‌ ట్రాక్షన్‌ మోటార్‌తో ఆధునిక బోగిలు తయారు చేసారు. ఈ రైళ్లలో ప్రస్తుతానికి చైర్‌కార్‌ మాత్రమే అందుబాటులో ఉంది. సాధారణ రైళ్లలో కనిపించి స్లీపర్‌ బెర్తులు ఈ  రైళ్లలో  మనకు కనిపించవు. 

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 8 రైళ్లనే ప్రారంభించడం జరిగింది. భవిష్యత్తులో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఈ వందేభారత్‌ రైళ్లను తీసుకువచ్చే అవకాశం ఉంది.

వందేభారత్‌ రైలు ప్రత్యేకతలు 

  • పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించింది 
  • ఎదురెదురుగా రెండు రైళ్లు వచ్చిన కవచ్‌ అనే సాంకేతిపరిజ్ఞానంతో రైలు వెంటనే ఆగిపోతుంది. 
  • ఇందులో ఉన్న సీట్లు 180 డిగ్రీలు తిరుగుతాయి. 
  • 24 గంటలు పూర్తి ఉచిత వైఫై అందుబాటులో ఉంటుంది. 
  • డోర్లు పూర్తిగా ఆటోమోటివ్‌గా ఉంటాయి. మన ప్రమేయం ఉండదు. 
  • వెలుపరి భాగం ఏరోడైనమిక్‌ డిజైన్‌తో రూపొందింది 
  • గరిష్ట వేగం 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. 
  • ఎప్పటికప్పుడు డిజిటల్‌ స్క్రీన్‌లపై సమాచారం అందిస్తుంది. 
  • రైలు వెలుపల, లోపల సీసీ కెమెరాలు ఉంటాయి. 
  • ఎమర్జెన్సి రక్షణ పరికరాలు, లైట్లు ఉంటాయి. 
  • ప్రకృతిని ఆస్వాదించేందుకు పెద్ద పెద్ద కిటికి అద్దాలు ఉంటాయి. 
  • 160 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 140 సెకన్లలోనే అందుకుంటుంది. 
  • మొదటి రైలు 15-02-2019 రోజున ఢల్లీి నుండి వారణాసి మద్య ప్రారంభించినారు. 

Post a Comment

0 Comments