KANTI VELUGU SCHEME IN TELUGU
Gk in Telugu || General Knowledge in Telugu

కంటి వెలుగు పథకం
కంటి వెలుగు పథకం తెలుగులో ..
సర్వేంద్రియాం నయనం ప్రధానం. మానవ శరీరంలో ఉన్న ఐదు ఇంద్రియాలలో కన్ను కీలకం. మనకు కళ్లు లేకపోతే ప్రపంచాన్ని చూడలేము. అటువంటి కంటిని మనం ఎల్లవేళలా కాపాడుకోవడం మనకు కీలకం. కంటికి కలిగే వ్యాదులు, పనిచేసే సమయంలో కళ్లకు రక్షణ వంటి విషయాల పట్ల మనం అవగాహన కల్గి ఉండడం ముఖ్యం.
అంధత్వ రహిత తెలంగాణ సాధించే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు కంటి వెలుగు అనే బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని పౌరులందరికి కంటి స్క్రీనింగ్ పరీక్ష, విజన్ పరీక్షలు నిర్వహించడం ద్వారా వారికి అవసరయ్యే కంటి అద్దాలను, సర్జరీలు, ఇతర చికిత్సలను ఉచితంగా అందించే లక్ష్యంతో తేది.15-08-2018 రోజున కంటి వెలుగు పథకం ప్రారంభించడం జరిగింది. తెలంగాణలోని అంధత్వానికి గురైన అన్ని ప్రాంతాల ప్రజలకు వారు ఎక్కడ నివసిస్తున్నా, ఏమి చేస్తున్నా, ఏ వయస్సు వారైనా, నివారణ మార్గాలను, అత్యున్నత నాణ్యత కలిగిన వైద్యం ఖర్చు లేకుండా ప్రజలందరికి అందుబాటులోకి తేవడం తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం.
ఇట్టి కంటి వెలుగు పథకం ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని 3,50,000 (మూడు కోట్ల యాబై లక్షల) మందికి కంటి పరీక్షలు నిర్వహించి వారికి నిర్వహించిన టెస్టుల ఆధారంగా కంటి అద్దాలు, సర్జరీలు, మందులు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా హనికరమైన కంటి వ్యాదుల పట్ల ప్రజలలో అవగాహన కార్యక్రమాలు రూపొందించి ప్రజలను చైతన్యవంతులను చేయడం జరుగుతుంది.
ఇట్టి కంటి వెలుగు పథకంలో భాగంగా వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాలలో పిహెచ్‌సిల వారీగా, వార్డుల వారీగా, శిబిరాలు ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహిస్తారు. ఇట్టి శిబిరాలను పాఠశాలలు / సామాజిక భవనాలు / జిపి భవనాలు / ఏదేని ఇతర ప్రభుత్వ భవనాలలో నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో, వార్డుల వారీగా, పిహెచ్‌సి సెంటర్‌ల వారీగా పరీక్షా శిబిరాలను నిర్వహించి కళ్లలో శుక్లము, మోతియ బిందువు, పొర, నల్ల గుడ్డు మీద పొర, నరం వల్ల అంధత్వం, నీటి కాసులు, చూపు లోపాలు, మెల్ల కన్ను పరీక్షలు వాటికి తగినట్లు చికిత్స అందిస్తారు.

- నేత్రదానం చేయడం
- నేత్ర సేకరణ
- నేత్రదానం ప్రోత్సహించడం
- నేత్ర బ్యాంకులను పెంచడం
- కార్నియా అంధత్వాన్ని నివారించడానికి కేంద్రీకృత సమాచార వ్యవస్థను ఏర్పాటు చేయడం
- ప్రభుత్వ, ప్రైవేటు ఆరోగ్య వ్యవస్థల మద్య అనుసంధానం పెంపొందించడం
- అంధత్వాన్ని తగ్గించడానికి సహాయపడే అన్ని రకాల ప్రయత్నాలకు తోడ్పాటు అందించడం
- నేత్ర చికిత్స విషయంలో సమాజ భాగస్వామ్యానికి జరుగుతున్న వ్యక్తిగత ప్రయత్నాలను సమన్వయ పరచడం.
- బీదరికంలో ఉన్న ప్రజలకు కూడా చాలా నాణ్యమైన, అత్యాధునికమైన చికిత్స అందించగల కేంద్రాల అభివృద్ది చేయడం.
➠ కంటి వెలుగు పథకం ముఖ్యాంశాలు :
- తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు నిర్వహించడం
- అత్యున్నత స్థాయి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా అద్దాలను పంపిణీ చేయడం
- క్యాటరాక్ట్, గ్లకోమా, రేటినోపతి కార్నిల్ మొదలగు వంటి వ్యాదులకు ఉచితంగా సర్జరీలు చేయడం
- అన్ని సేవలు పూర్తి ఉచితంగా అందించడం
- మందులు మరియు ఇతర పరికరాలు ఉచితంగా అందించడం
- హనికరమైన కంటి వ్యాదుల నివారణ పట్ల అవగాహన కల్పించడం
రాష్ట్రం | తెలంగాణ |
---|---|
ప్రారంభించిన వారు | శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుగారు |
దేని గురించి | కంటి గురించి |
ఎవరు అర్హులు | తెలంగాణ రాష్ట్ర నివాసులు |
లబ్ది పొందువారు | 3.5 కోట్ల మంది |
ఎంపిక విధానం | కంటి పరీక్ష ద్వారా |
లక్ష్యం | అంధత్వ నివారణ తెలంగాణ |
ప్రారంభించిన తేది | 15-08-2018 |
మందుల పంపిణీ | ఉచితం |
కంటి పరీక్ష విధానం | ఉచితం |
సర్జరీ | ఉచితం |
0 Comments