NATIONAL AWARDS IN TELUGU (జాతీయ అవార్డులు / పురస్కారాలు ) || Gk in Telugu || General Knowledge in Telugu

NATIONAL AWARDS  IN TELUGU

Gk in Telugu || General Knowledge in Telugu

జాతీయ అవార్డులు / పురస్కారాలు 

➩ భారతరత్న (Bharatha Rathna) అత్యున్నత పురస్కారం :

భారతదేశంలో అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న పురస్కారం. ఇట్టి భారతరత్న అవార్డు 1954 సంవత్సరం నుండి ఇవ్వడం ప్రారంభించారు. భారత ప్రభుత్వం చేత భారత గణతంత్ర దినోత్సమైన జనవరి 26 తేదిన కళలు, సాహిత్యం, శాస్త్ర సాంకేతిక, ప్రజాసేవ, క్రీడా వంటి రంగాలలో అశేష కృషి చేసిన వారికి భారతరత్న పురస్కారాన్ని అందిస్తుంది. అయితే ఇట్టి భారతరత్న అవార్డు పొందిన వారు వారియొక్క పేరుకు ముందుగాని, తర్వాత గాని భారతరత్న అనే పేరును ప్రస్తావించరాదు. భారత ప్రభుత్వం అందించే భారతరత్న పురస్కారంలో రాష్ట్రపతి సంతకంతో కూడిన రాగి ఆకు పై ఒకవైపు భారతదేశ చిహ్నం, మరోవైపు దేవనాగరి లిపిలో రాయబడిన సత్యమేవజయతే అనే వ్యాక్యాల మద్యలో వెలుగు విరజిమ్మే సూర్యుడు ఉంటాడు. 

➩ పద్మవిభూషణ్‌ (Padma Vibhushan) :

పద్మవిభూషణ్‌ అనేది భారత ప్రభుత్వం అందించే రెండవ అత్యున్నత పురస్కారం. భారతదేశంలో వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన పౌరులకు ఈ అవార్డును ఇచ్చి సత్కరిస్తుంది. ఇట్టి పద్మవిభూషణ్‌ పురస్కారంలో తామరపువ్వు మద్యలో ఉండి దానిపైన పద్మ అనే పదం, కింద విభూషణ్‌ అనే పదాలు వ్రాసి ఉంటాయి. మరోవైపు జాతీయ చిహ్నం ఉంటుంది. ఇట్టి అవార్డును 1954 సంవత్సరం నుండి ఇస్తుంది. 

2022 సంవత్సరంలో పద్మవిభూషణ్‌ అవార్డులు పొందినవారు 

  • ప్రభా ఆత్రే - కళలు - మహారాష్ట్ర
  • రాధే శ్యామ్‌ ఖేమ్కా (మరణానంతరం) -  సాహిత్యం మరియు విద్య -  ఉత్తర ప్రదేశ్‌
  • జనరల్‌ బిపిన్‌ రావత్‌ (మరణానంతరం) -  పౌర సేవలు  - ఉత్తరాఖండ్‌
  • కళ్యాణ్‌ సింగ్‌ (మరణానంతరం) -  ప్రజా వ్యవహారాల  - ఉత్తర ప్రదేశ్‌

➩ పద్మభూషణ్‌ (Padma Bhushan) :

పద్మభూషణ్‌ అనేది భారత ప్రభుత్వం అందించే మూడవ అత్యున్నత పురస్కారం.భారతదేశంలో వివిధ రంగాలలో ఉన్నత సేవలు అందించిన పౌరులకు ఈ అవార్డును ఇచ్చి సత్కరిస్తుంది. ఇట్టి పద్మభూషణ్‌ అవార్డు కాంస్యంతో తయారై బంగారంతో మెరుగుపెడతారు. ఇట్టి అవార్డును 1954 నుండి ఇస్తున్నారు.

➩ పద్మశ్రీ (Padma Sri)  :

పద్మశ్రీ అనేది భారత ప్రభుత్వం అందించే నాల్గవ అత్యున్నత పురస్కారం.  భారతదేశంలో కళలు, విద్య, పరిశ్రమలు, సాహిత్యం, శాస్త్రం, క్రీడలు, సామాజిక సేవ మొదలగు వాటిలో సేవ చేసిన వారికి ప్రాథమికంగా ఇచ్చే పౌరపురస్కారం. ఈ పద్మశ్రీ పురస్కారం పతకం రూపంలో ఉంటుంది.  దీనిపై దేవనాగరి లిపిలో ‘‘పద్మ’’ మరియు ‘‘శ్రీ’’ అనే అక్షరాలు వ్రాయబడి వుంటాయి. ఈ పతకాన్ని 1954 సంవత్సరం నుండి ఇస్తున్నారు. 

➩ ఇందిరాగాంధీ శాంతి పురస్కారం :

ఇట్టి ఇందిరాగాంధీ శాంతిపురస్కారాన్ని అంతర్జాతీయ అభివృద్ది, శాంతి, నిరాయుధీకరణ వంటి రంగాలలో విశేష కృషి చేసిన వారికి 1986 సంవత్సరం నుండి అందిస్తున్నారు. ఇట్టి పురాస్కరంతో పాటు 25 లక్షల నగదు అందిస్తుంది. 

➩ భారత జ్ఞానఫీఠ్‌ అవార్డు :

ఇది భారతదేశంలో అత్యున్నత సాహితీ పురస్కారం. ఇట్టి అవార్డు 1964 ఏర్పాటు చేసి 1965 సంవత్సరం నుండి అందిస్తున్నారు. ఇట్టి అవార్డును శాంతిప్రసాద్‌జైన్‌, అతని భార్య శ్రీమతి రోమాజైన్‌ నెలకొల్పినారు. ఇట్టి అవార్డును కేంద్ర సాహిత్య అకాడమీ సమక్షంలో 11 లక్షల నగదుతో పాటు కంచు వాగ్దేవి విగ్రహం అందిస్తారు.

➠ క్రీడారంగంలో అందించే అవార్డులు :

➩ ఖేల్‌రత్న అవార్డు :

భారతదేశంలో క్రీడారంగంలో అందించే అత్యున్నత అవార్డు. ఇట్టి అవార్డును కేంద్ర క్రీడలు మరియు యువజన శాఖ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం క్రీడల్లో విశేష కృషి చేసిన క్రీడాకారులకు జాతీయ క్రీడా దినోత్సవం అగస్టు 29న (ద్యాన్‌ చంద్‌ పుట్టినరోజు) 25 లక్షల నగదుతో అవార్డు అందిస్తారు. 

➩ ద్రోణాచార్య అవార్డు :

ఈ అవార్డును 1985 నుండి కేంద్ర క్రీడలు మరియు యువజన శాఖ ఆధ్వర్యంలో అందిస్తున్నారు. వివిధ క్రీడాకారులకు విజయవంతమైన శిక్షణ ఇచ్చిన క్రీడా గురువులకు ప్రతి సంవత్సరం ఈ అవార్డును బహుకరిస్తారు. ఇది క్రీడాకారులకు శిక్షణ అందించే వ్యక్తులకు ఇచ్చే అత్యున్నత పురస్కారము. 

 అర్జున అవార్డు :

ఈ అవార్డును 1961 నుండి కేంద్ర క్రీడలు మరియు యువజన శాఖ ఆధ్వర్యంలో అందిస్తున్నారు.వివిధ క్రీడల్లో విశేష ప్రతిభకనబర్చిన వారికి ఇస్తారు. ఇట్టి అవార్డు కింద 15 లక్షల నగదుతో పాటు లిఖిత శాసనం, స్క్రాల్‌ హ్యార్‌ అందజేస్తారు.  

 ➠ శౌర్య / మిలిటరీ / గాలంట్రీ అవార్డులు :

భారత ప్రభుత్వం ఇట్టి శౌర్య పురస్కారాలు, మిలిటరీ అవార్డులను సంవత్సరంలో రెండు సార్లు అనగా స్వాతంత్ర దినోత్సవం (అగస్టు 15), గణతంత్ర దినోత్సవం(జనవరి 26) రోజున అందిస్తుంది. 

శౌర్య పురస్కారాలు రెండు విధాలుగా అందిస్తుంది. 

1) మొదటి రకం 

ఎ) పరమ్‌వీర్‌ చక్ర

బి) మహావీర్‌ చక్ర

సి) వీర్‌ చక్ర

2) రెండవ రకం 

ఎ) అశోక్‌ చక్ర

బి) కీర్తి చక్ర 

సి) శౌర్య చక్ర 

➩ పరమ్‌వీర్‌చక్ర :

ఈ అవార్డును భారతదేశ సైనికులకు ఇచ్చే అత్యున్నత అవార్డు. ఈ అవార్డును యుద్దసమయంలో అత్యధిక ధైర్యసాహసాలు ప్రదర్శించిన సైనికులకు ఇస్తారు. ఇట్టి అవార్డును మరణించిన తర్వాత అందిస్తారు. ఇంద్రుడి వజ్రాయుధాన్ని పోలిన ఆయుధాలు 4 వైపులా ఉండి మద్యలో జాతీయ చిహ్నాన్ని కల్గి ఉంటుంది ఈ అవార్డు. 

➩ మహావీర్‌చక్ర :

భారతదేశ సైనికులకు ఇచ్చే రెండవ అత్యున్నత పురస్కారం ఈ అవార్డు. ఈ అవార్డును వెండితో తయారు చేస్తారు. సగం తెలుపు, సగం నారింజరంగు గల రిబ్బన్‌తో అలంకరిస్తారు. అవార్డులో నక్షత్రాకారం ఉండి మద్యలో వృత్తాకారం ఉండి జాతీయ చిహ్నన్ని కల్గి ఉంటుంది. 

➩ వీర్‌చక్ర :

భారతదేశ సైనికులకు ఇచ్చే మూడవ అత్యున్నత పురస్కారం ఈ అవార్డు.ఈ అవార్డును వెండితో తయారు చేస్తారు. ఈ అవార్డును సగం ముదురు నీలం రంగు, సగం ఆరెంజ్‌ రంగు గల రిబ్బన్‌తో అలంకరిస్తారు. 

➩ అశోక చక్ర :

యుద్దం జరగని సమయంలో, శాంతి సమయంలో అత్యున్నత ధైర్యసాహసాలు ప్రదర్శించిన వ్యక్తులు/సైనికులకు ఇచ్చే అవార్డులలో మొదటిది. గిల్టు బంగారంతో చేసిన జ్ఞాపిక మద్యలో అశోకచక్రం ఉంటుంది. ఈ అవార్డును ముదురుపచ్చ సిల్కు రిబ్బన్‌ మద్యలో సన్నని కాషాయరంగు గీత గల రిబ్బన్‌తో అలంకరిస్తారు. సైనిక లేదా పౌర సిబ్బందికి మరణానంతరం ఇట్టి అవార్డును అందిస్తారు. 

➩ కీర్తి చక్ర :

ఇది యుద్దభూమికి దూరంగా ఉన్న శౌర్యం, సాహసోపేతమైన చర్య లేదా ఆత్మబలిదానానికి భారతీయ సైనిక అలంకరణ. శాంతికాల శౌర్య పురస్కారాలలో ఇది రెండవ స్థానం. 

➩ శౌర్య చక్ర :

ఇది శత్రువులతో ప్రత్యక్ష చర్యలో పాల్గొనకపోయినా శౌర్యం, సాహసోపేతమైన చర్య లేదా ఆత్మబలిదానికి ఇవ్వబడిన భారతీయ సైనిక అలంకరణ. శాంతికాలశౌర్య పురస్కారాలలో ఇది మూడవ స్థానం. 

➩ దాదాసాహేబ్‌ ఫాల్కె అవార్డు :

ఈ అవార్డును భారతదేశ చలనచిత్ర పరిశ్రమలో సినిమా పరిశ్రమకు విశిష్ట సేవ చేసిన వ్యక్తులకు అందించే అత్యున్నత పురస్కారం. 1969 నుండి భారత సమాచార ప్రసాద మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ అవార్డును అందిస్తున్నారు. ఈ అవార్డు కింద 10 లక్షల నగదు, స్వర్ణకమలం, శాలువా అందిస్తారు. 

➩ మూర్తిదేవి అవార్డు
➩ సరస్వతి సమ్మాన్‌ అవార్డు
➩ రాజీవ్‌గాంధీ సద్భావన అవార్డు
➩ ఆరెంజ్‌ ప్రైజ్‌ 
➩ సాహిత్య అకాడమీ అవార్డు 

➩ సికే నాయుడు అవార్డు           -     క్రికెట్‌ 

➩ వాచస్పతి అవార్డు            -    సంస్కృతం 


Post a Comment

0 Comments