INTERNATIONAL AWARDS IN TELUGU
Gk in Telugu || General Knowledge in Telugu
అంతర్జాతీయ అవార్డులు /పురస్కారాలు
➩ నోబెల్ బహుమతులు :
ఇది ప్రపంచంలో అందించే అత్యున్నత పురస్కారాలు ఈ అవార్డును 1901 సంవత్సరం నుండి ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ జ్ఞాపకార్థం ఇస్తున్నారు. ఈ అవార్డును ప్రతి సంవత్సరం నోబెల్ వర్ధంతి అయిన డిసెంబర్ 10న నార్వే రాజధాని ఓస్లోలో ప్రధానం చేస్తారు. ఇట్టి అవార్డును 1) సాహిత్యం 2) శాంతి 3) భౌతికశాస్త్రం 4) రసాయన శాస్త్రం 5) వైద్య శాస్త్రం 6) ఆర్థిక శాస్త్రం వంటి ఆరు రంగాలలో విశేష ప్రతిభ కనబర్చిన వారికి ఇట్టి అవార్డు బహుకరిస్తారు.
2022 సంవత్సరంలో నోబెల్ అవార్డు పొందినవారు
1) ఫిజిక్స్
ఎ) అలేన్ ఆస్పెక్ట్
బి) జాన్ ఎఫ్ క్లాసర్
సి) ఆంటోన్ జైలింగర్
2) కెమిస్ట్రీ
ఎ) రోలిన్ ఆర్ బెర్టోజీ
బి) మార్టెన్ మెల్డల్
సి) కే బ్యారీ షార్ప్‌లెస్
3) శాంతి
పౌర హక్కుల కోసం కృషి చేస్తోన్న బెలారస్‌కు చెందిన మానవ హక్కుల న్యాయవాది అలెస్ బియాలియాత్‌స్కీతో పాటు రష్యా, ఉక్రెయిన్‌లకు చెందిన మానవ హక్కుల సంస్థలు ‘మెమోరియల్’, ‘సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్’కు ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి దక్కింది.
4) సాహిత్యం
ఫ్రెంచ్ రచయిత్రి అన్నే ఎర్నాక్స్‌కు సాహిత్యంలో నోబెల్ బహుమతి లభించింది.
5) ఆర్థిక శాస్త్రం
ఎ) బెన్ షాలోమ్ బెర్నాంకే
బి) డాగ్లస్ డబ్ల్యూ. డైమండ్
సి) ఫిలిప్ హెచ్.డైబ్‌విగ్
6) మెడిసిన్
ప్రొపెసర్ స్వాంటే ఫాబో
➩ గాంధీ అంతర్జాతీయ శాంతి బహుమతి :
ఈ అవార్డును భారత ప్రభుత్వం 1995 సంవత్సరంలో ప్రారంభించింది. ఏదైనా రంగంలో విశేషకృషి చేసిన వ్యక్తులకు, అహింసాయుత మార్గంలో పోరాటం చేసిన వ్యక్తులకు ఈ అవార్డు అందిస్తారు. ఈ అవార్డు కింద 1 కోటి రూపాయలు నగదు, అవార్డు ఫలకం, లిఖిత పత్రం అందిస్తారు.
➩ రామన్ మెగసెసె అవార్డు :
ఈ అవార్డును ఆసియా నోబెల్ అని కూడా పిలుస్తారు. ఈ అవార్డులను కేవలం ఆసియాలో నివసించే వారికి మాత్రమే అందిస్తారు. ఈ అవార్డును ఫిలిప్పైన్స్ మాజి అధ్యక్షుడు రామన్‌మెగసెసె పేరుమీద ఫిలిప్పైన్ ప్రభుత్వం 1957 సంవత్సరం నుండి అందిస్తుంది. ఈ అవార్డును ప్రతి సంవత్సరం రామన్ మెగసెసె జన్మదినం అగస్టు 31 రోజున అందిస్తారు. ఇట్టి అవార్డు ఆరు రంగాలలో అందిస్తారు 1) అంతర్జాతీయ అవగాహన 2) ప్రజాసేవ 3) ప్రభుత్వ సేవ 4) జర్నలిజం, సాహిత్యం, సృజనాత్మకత 5) సామాజిక నాయకత్వం 6) ఎమర్జెంట్ లీడర్‌షిప్ వంటి ఆరు రంగాలలో విశేష ప్రతిభ కనబర్చిన వారికి అందిస్తారు.
➩ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ :
ఈ అవార్డును యుకేకు చెందిన మ్యాన్‌గ్రూప్ 2004 సంవత్సరంలో ఏర్పాటు చేసి 2005 నుండి అమలు చేస్తుంది. ఈ అవార్డును జీవనసాఫల్య పురస్కారంగా కాకుండా ఏదైన భాషలో ప్రచురించిన ఒక పుస్తకానికి ఏటా ఇవ్వాలని నిర్ణయించారు. ఈ పుస్తకం ఆంగ్లంలోకి అనువాదమై ఉండాలి. ఈ అవార్డు కింద వచ్చే 50,000 పౌండ్ల నగదు బహుమతిని రచయిత, అనువాదకుడు సమానం పంచుకుంటారు.
➩ బుకర్ ప్రైజ్ :
మ్యాన్ బుకర్ ప్రైజ్‌ను 1968 సంవత్సరంలో బుకర్ అనే కంపెనీ (లండన్) పబ్లిషర్స్ అసోసియేషన్ నెలకొల్పి 1969 నుండి అందిస్తుంది. ఈ అవార్డును ఇంగ్లీష్ మాట్లాడే కామన్‌వెల్త్ దేశాలకు చెందిన రచయితలకు మాత్రమే ప్రధానం చేసేవారు. 2013 సెప్టెంబర్ నుండి ఏ దేశ రచయిత అయినా బుకర్ కోసం పోటీపడోచ్చు. కానీ ఆ పుస్తకం మాత్రం యుకేలో ప్రచురితమై ఉండాలి.
➩ వరల్డ్‌ఫుడ్ ప్రైజ్ :
ఈ అవార్డును నార్మన్‌బోర్లాగ్ 1986 సంవత్సరంలో స్థాపించి 1987 నుండి ఇస్తున్నారు. ఈ అవార్డును ఆహార, వ్యవసాయ నోబెల్ గా అభివర్ణిస్తారు. ఇట్టి అవార్డును ప్రపంచ ఆహార దినోత్సవం అక్టోబర్ 16న 2.50 లక్షల డాలర్లతో అందిస్తారు.
➩ టెంపుల్టన్ అవార్డు :
ఈ అవార్డును 1972 సంవత్సరంలో స్థాపించి 1973 సంవత్సరం నుండి అందిస్తున్నారు. మతం, ఆధ్యాత్మికపరమైన చింతన పెంపొందించే వారికి 12,00,000 పౌండ్ల నగదుతో ఈ అవార్డును అందిస్తుంది.
➩ పులిట్జర్ అవార్డు :
జోసఫ్ పులిట్జర్ ఫౌండేషన్ (అమెరికా) సాహిత్యం, సంగీతం, నాటకం, పత్రికారంగాల్లో కృషిచేసిన వారికి ఇస్తారు.
0 Comments