
indian railway Gk questions in telugu
భారతీయ రైల్వే వ్యవస్థ క్విజ్ టెస్ట్
1) ప్రపంచంలో అతిపెద్ద రైల్వే వ్యవస్థలో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది ?
ఎ) 3వ స్థానం
బి) 6వ స్థానం
సి) 4వ స్థానం
డి) 1వ స్థానం
జవాబు ః సి (4వ స్థానం)
మొదటి మూడు స్థానాల్లో అమెరికా, రష్యా, చైనాలున్నాయి.
2) ప్రపంచంలో మొట్టమొదటి రైలును ఎప్పుడు ప్రారంభించారు ?
ఎ) 1875
బి) 1863
సి) 1830
డి) 1825
జవాబు ః డి (1825)
3) ప్రపంచంలో మొట్టమొదటి రైలును ఎక్కడి నుండి ఎక్కడి వరకు నడిపారు ?
ఎ) ట్రాన్స్ - సైబీరియన్
బి) స్టాక్‌టన్ - డార్లింగ్‌టన్
సి) లివర్‌పూల్`మాంజేస్టర్
డి) పైవేవీ కావు
జవాబు ః బి (స్టాక్‌టన్ నుండి డార్లింగ్‌టన్ వరకు)
ఇంగ్లాండ్‌లోని స్టాక్‌టన్ నుండి డార్లింగ్‌టన్ వరకు 1825 సంవత్సరంలో బొగ్గును రవాణా చేయడానికి నిర్మించారు. ఇది గుర్రపు రైలు మార్గంగా నిర్మించారు. తర్వాత లోకోమోటీవ్‌లుగా మార్చారు.
4) భారతదేశంలో మొట్టమొదటి రైలును ఎప్పుడు ప్రారంభించారు ?
ఎ) 1853
బి) 1863
సి) 1876
డి) 1890
జవాబు ః ఎ (1853)
5) భారతదేశంలో మొట్టమొదటి రైలును ఎక్కడి నుండి ఎక్కడి వరకు నడిపారు ?
ఎ) అహ్మదబాద్ - గాంధీనగర్
బి) న్యూ ఢిల్లీ - ఆగ్రా
సి) లక్నో - వారణాసి
డి) ముంబాయి - థానే
జవాబు ః డి (ముంబాయి - థానే )
తేది.16-04-1853 రోజున 34 కిలోమీటర్ల పొడవుతో ముంబాయి - థానే వరకు నిర్మించారు. దీనిని గ్రేట్ ఇండియన్ పెనిన్సులా నిర్మించింది.
6) బ్రాడ్‌గేజ్ ఎన్ని మీటర్ల పొడవు ఉంటుంది ?
ఎ) 1.576 మీటర్లు
బి) 1.776 మీటర్లు
సి) 1.676 మీటర్లు
డి) 1.967 మీటర్లు
జవాబు ః సి (1.676 మీటర్లు)
ఇండియాలో రైల్వే నెట్‌వర్క్ ఎక్కువభాగం బ్రాడ్‌గేజ్‌లో నడుస్తుంది. ఇది వేగవంతమైన భారీరైళ్లకకు దోహదపడుతుంది.
మీటర్‌గేజ్ 1మీటర్, నారోగేజ్ 0.762 మీటర్, లైట్ నారోగేజ్ 0.610 మీటర్, స్టాండర్డ్ గేజ్ 1.435 మీటర్లు ఉంటుంది.
7) భారతదేశంలో ఎన్ని రైల్వే జోన్‌లు ఉన్నాయి ?
ఎ) 10
బి) 17
సి) 9
డి) 11
జవాబు ః బి (17) భారతదేశంలో 17 రైల్వే జోన్‌లతో పాటు కేంద్ర ప్రభుత్వం కొత్తగా విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేను తేది.27-02-2019 రోజున ప్రకటించింది. గుంతకల్లు, గుంటూర్, విజయవాడ, డివిజన్లతో కలిపి కొత్త జోన్ ఏర్పాటు చేయనున్నారు.
8) భారతదేశంలోని రైల్వే జోన్‌లలో అతిపెద్ద రైల్వే జోన్ ఏది ?
ఎ) ఉత్తర రైల్వే జోన్
బి) తూర్పు రైల్వే జోన్
సి) దక్షిణ మద్య రైల్వే జోన్
డి) మద్య రైల్వే జోన్
జవాబు ః ఎ (ఉత్తర రైల్వే జోన్)
దీని ప్రధాన కేంద్రం న్యూ ఢిల్లీ
9) భారతదేశంలోని రైల్వే జోన్‌లలో అతిచిన్న రైల్వే జోన్ ఏది ?
ఎ) ఉత్తర రైల్వే జోన్
బి) తూర్పు రైల్వే జోన్
సి) దక్షిణ మద్య రైల్వే జోన్
డి) ఈశాన్య సరిహద్దు రైల్వే జోన్
జవాబు ః డి (ఈశాన్య సరిహద్దు రైల్వే జోన్ )
దీని ప్రధాన కేంద్రం మాలిగాం-గువహాతి (అస్సాం)లో కలదు.
10) భారతదేశంలోని మొట్టమొదటి సారిగా ఏర్పాటు చేసిన రైల్వే జోన్ ఏది ?
ఎ) దక్షిణ మద్య రైల్వే జోన్
బి) తూర్పు రైల్వే జోన్
సి) దక్షిణ రైల్వే జోన్
డి) మద్య రైల్వే జోన్
జవాబు ః సి (దక్షిణ రైల్వే జోన్)
దీని ప్రధాన కేంద్రం చెన్నై (తమిళనాడు) లో కలదు.
11) అత్యధిక రైల్వేస్టేషన్‌లలో నిలిచే రైలు ఏది ?
ఎ) మాతృభూమి ఎక్స్‌ప్రెస్
బి) హౌరా - అమృత్‌సర్ ఎక్స్‌ప్రెస్
సి) నవ్‌యుగ ఎక్స్‌ప్రెస్
డి) దక్కన్ క్వీన్ ఎక్స్‌ప్రెస్
జవాబు ః బి (హౌరా - అమృత్‌సర్ ఎక్స్‌ప్రెస్)
12) భారతదేశంలో అతితక్కువ దూరం ప్రయాణించే రైలు ఏది ?
ఎ) గోరఖ్‌పూర్ - లక్నో
బి) హౌరా - అమృత్‌సర్ ఎక్స్‌ప్రెస్
సి) ముంబాయి - థానే
డి) నాగ్‌పూర్ - అజ్ని
జవాబు ః డి (నాగ్‌పూర్ - అజ్ని)
ఈ రైలు 3 కి.మీలు ప్రయాణిస్తుంది.
13) ప్రపంచంలో అత్యంత పొడవైన రైల్వే ప్లాట్‌ఫామ్ ఏది ?
ఎ) గోరఖ్‌పూర్
బి) సికింద్రాబాద్
సి) ముంబాయి
డి) జబల్‌పూర్
జవాబు ః ఎ (గోరఖ్‌పూర్)
ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కలదు.
14) భారతదేశంలో ఎక్కువ రాష్ట్రాల గుండా ప్రయాణించే రైలు ఏది ?
ఎ) దక్కన్ క్వీన్
బి) నవ్‌యుగ ఎక్స్‌ప్రెస్
సి) త్రివేండ్రమ్ ఎక్స్‌ప్రెస్
డి) వివేక్ ఎక్స్‌ప్రెస్
జవాబు ః బి (నవ్‌యుగ ఎక్స్‌ప్రెస్)
15) భారతదేశంలో అత్యధిక దూరం ప్రయాణించే రైలు ఏది ?
ఎ) దక్కన్ క్వీన్
బి) నవ్‌యుగ ఎక్స్‌ప్రెస్
సి) త్రివేండ్రమ్ ఎక్స్‌ప్రెస్
డి) వివేక్ ఎక్స్‌ప్రెస్
జవాబు ః డి (వివేక్ ఎక్స్‌ప్రెస్)
16) భారతదేశంలో తొలి వైఫై రైల్వే స్టేషన్ ఏది ?
ఎ) సికింద్రాబాద్
బి) బెంగళూరు
సి) ముంబాయి
డి) అలహాబాద్
జవాబు ః బి (బెంగళూరు)
17) భారతదేశంలో మొట్టమొదటి మహిళా లోకోపైలట్ (ట్రైన్ డ్రైవర్) ఎవరు ?
ఎ) భూమి ఖురానా
బి) ఫాతిమా భీవి
సి) సురేఖ శంకర్ యాదవ్
డి) పైవేవి కావు
జవాబు ః సి (సురేఖ శంకర్ యాదవ్)
18) భారతదేశంలో రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?
ఎ) బెంగళూరు
బి) చెన్నై
సి) ముంబాయి
డి) న్యూ ఢిల్లీ
జవాబు ః డి (న్యూ ఢిల్లీ)
19) భారతదేశంలో మొట్టమొదటి రైల్వే సొరంగ మార్గం ఏది ?
ఎ) పార్శిక్ టన్నెల్
బి) దేవ్‌ప్రయాగ్ టన్నెల్
సి) పటల్‌పని టన్నె
డి) ఫిర్‌మంజల్ టన్నెల్
జవాబు ః ఎ (పార్శిక్ టన్నెల్)
20) భారతదేశంలో అత్యంత పొడవైన రైల్వే బ్రిడ్జి ఏది ?
ఎ) అంజిఖాడ్ రైల్వే వంతెన
బి) చీనాబ్ రైల్వే వంతెన
సి) పంబన్ రైల్వే వంతెన
డి) వెంబనాడ్ రైల్వే వంతెన
జవాబు ః డి (వెంబనాడ్ రైల్వే వంతెన)
కేరళలోని ఇడపల్లి నుండి వల్లర్‌పదమ్ మద్య వెంబనాడ్ సరస్సుపై కలదు. (4.62 కి.మీ)
Also Read :
21) భారతదేశంలో అత్యంత పొడవైన రైల్ కమ్ రహదారి బ్రిడ్జి ఏది ?
ఎ) దోలాసదియా వంతెన
బి) మహాత్మగాంధీ సేతు
సి) బోగిబీల్ వంతెన
డి) దిగాసోన్‌పూర్
జవాబు ః సి (బోగిబీల్ వంతెన)
బ్రహ్మపుత్ర నదిపై అసోంలోని దిబ్రూగర్, దెమాజీ జిల్లాలను కలిపే ఈ వంతెన తేది.25-12-2018 రోజున ప్రారంభించినారు. ఇది 4.94 కి.మీ ఉంటుంది.
22) దేశంలో ఎక్కడా ఆగకుండా అత్యధిక దూరం ప్రయాణించే రైలు ఏది ?
ఎ) త్రివేండ్రమ్ ఎక్స్‌ప్రెస్
బి) కర్మభూమి ఎక్స్‌ప్రెస్
సి) నవ్‌యుగ్ ఎక్స్‌ప్రెస్
డి) హౌరా - అమృత్‌సర్ ఎక్స్‌ప్రెస్
జవాబు ః ఎ (త్రివేండ్రమ్ ఎక్స్‌ప్రెస్)
23) దేశంలో మొట్టమొదటి వందేభారత్ రైలు ఎక్కడి నుండి ఎక్కడి వరకు ప్రారంభించారు ?
ఎ) బిలాస్‌పూర్ - నాగ్‌పూర్
బి) న్యూ ఢిల్లీ - వారణాసి
సి) చెన్నై - మైసూర్
డి) సికింద్రాబాద్ - విశాఖపట్నం
జవాబు ః బి (న్యూ ఢిల్లీ - వారణాసి) దీనిని తేది.15-02-2019 రోజున భారత ప్రధాని ప్రారంభించారు.
24) 8వ వందేభారత్ రైలును భారత ప్రధాని నరేంద్రమోడీ ఎక్కడి నుండి ఎక్కడి వరకు ప్రారంభించారు ?
ఎ) బిలాస్‌పూర్ - నాగ్‌పూర్
బి) న్యూ ఢిల్లీ - వారణాసి
సి) చెన్నై - మైసూర్
డి) సికింద్రాబాద్ - విశాఖపట్నం
జవాబు ః డి ( సికింద్రాబాద్ - విశాఖపట్నం)
25) వందేభారత్ రైలు గరిష్ట వేగం ఎంత ?
ఎ) 150 కి.మీ
బి) 200 కి.మీ
సి) 160 కి.మీ
డి) 180 కి.మీ
జవాబు ః డి (180 కి.మీ)
26) రైల్వే ఆధునిక కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది ?
ఎ) కపర్తాలా
బి) రాయ్‌బరేలి
సి) యలహంక
డి) పాటియాలా
జవాబు ః బి (రాయ్‌బరేలి)
27) దక్షిణ మద్య రైల్వే కేంద్రం ఎక్కడ ఉంది ?
ఎ) సికింద్రాబాద్
బి) గోరఖ్‌పూర్
సి) ముంబాయి
డి) కోల్‌కతా
జవాబు ః ఎ (సికింద్రాబాద్)
28) తూర్పు రైల్వే కేంద్రం ఎక్కడ ఉంది ?
ఎ) బిలాస్‌పూర్
బి) జబల్‌పూర్
సి) కోల్‌కతా
డి) హుబ్లి
జవాబు ః సి (కోల్‌కతా)
29) ఉత్తర మద్య రైల్వే కేంద్రం ఎక్కడ ఉంది ?
ఎ) జైపూర్
బి) అలహాబాద్
సి) భువనేశ్వర్
డి) హజీపూర్
జవాబు ః బి (అలహాబాద్)
30) ఉత్తర రైల్వే కేంద్రం ఎక్కడ ఉంది ?
ఎ) అలహాబాద్
బి) సికింద్రాబాద్
సి) గోరఖ్‌పూర్
డి) న్యూ ఢిల్లీ
జవాబు ః డి (న్యూ ఢిల్లీ )
31) తూర్పు మద్య రైల్వే కేంద్రం ఎక్కడ ఉంది ?
ఎ) న్యూఢల్లీి
బి) గోరఖ్‌పూర్
సి) హాజీపూర్
డి) న్యూ ఢిల్లీ
జవాబు ః సి (హజీపూర్)
32) క్రింది వానిలో సరైనది కానిది ఏది ?
ఎ) మద్యరైల్వే - ముంబాయి
బి) ఆగ్నేయయ మద్య రైల్వే `- బిలాస్‌పూర్
సి) తూర్పు రైల్వే - కోల్‌కతా
డి) తూర్పు కోస్తా రైల్వే - చెన్నై
జవాబు ః డి (తూర్పు కోస్తా రైల్వే - చెన్నై)
తూర్పు కోస్తా రైల్వే కేంద్రం భువనేశ్వర్ (ఒడిసా) లో కలదు.
33) ఇండియన్ రైల్వేస్‌ను ఎప్పుడు జాతీయకరణ(నేషనలైజేషన్) చేశారు ?
ఎ) 1985
బి) 1950
సి) 1970
డి) 1965
జవాబు ః బి (1950)
34) రైల్వే స్టాఫ్ కాలేజ్ ఎక్కడ ఉంది ?
ఎ) బెంగళూరు
బి) సికింద్రాబాద్
సి) వడోదర
డి) చెన్నై
జవాబు ః సి ( వడోదర)
35) క్రింది వానిలో ఏ నగరం మూడు జోనల్ కేంద్రాలను కల్గి ఉంది ?
ఎ) ముంబాయి
బి) సికింద్రాబాద్
సి) కోల్‌కతా
డి) గోరఖ్‌పూర్
జవాబు ః సి (కోల్‌కతా)
36) క్రింది వాటిని జతపర్చండి ?
ఎ) చిత్తరంజన్ లోకోమోటీవ్ వర్క్స్
బి) ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ
సి) వీల్ అండ్ ఆక్సల్ ఫ్యాక్టరీ
డి) రైల్ కోచ్ ప్యాక్టరీ
1) తమిళనాడు
2) పంజాబ్
3) పశ్చిమబెంగాల్
4) కర్ణాటక
ఎ) ఎ-3, బి-4, సి-1, డి-2
బి) ఎ-2, బి-1, సి-4, డి-3
సి) ఎ-3, బి-1, సి-4, డి-2
డి) ఎ-3, బి-1, సి-2, డి-4
సి ( ఎ-3, బి-1, సి-4, డి-2 )
37) అత్యధిక రైళ్లు ఆగే రైల్వేస్టేషన్ ఏది ?
ఎ) హజీపూర్
బి) సికింద్రాబాద్
సి) గోరఖ్‌పూర్
డి) ఛత్రపతి శివాజి
జవాబు ః డి (ఛత్రపతి శివాజి)
38) ప్రపంచంలో అత్యధిక ఉద్యోగులు కల్గి ఉన్న సంస్థలలో భారత రైల్వేది ఎన్నవ స్థానం ?
ఎ) 2వ స్థానం
బి) 3వ స్థానం
సి) 4వ స్థానం
డి) 1వ స్థానం
జవాబు ః ఎ (2వ స్థానం)
39) దక్షిణ భారతదేశంలో మొట్ట మొదటి రైలును ఎప్పుడు ప్రారంభించారు ?
ఎ) 1980
బి) 1986
సి) 1985
డి) 1978
జవాబు ః బి (1986)
దక్షిణ భారతదేశంలో మొదటి రైల్వేలైన్‌ను 01-07-1986 రోజున రాయపురం (చెన్నై) నుండి వాలాజా రోడ్ కలుపుతూ ప్రారంభించారు. ఈ మార్గాన్ని మద్రాస్ రైల్వే కంపెనీ నిర్మించింది.
40) దేశంలో మొట్టమొదటి మెట్రోరైలు ఏ రాష్ట్రంలో ప్రారంభించారు ?
ఎ) లక్నో
బి) ముంబాయి
సి) న్యూ ఢిల్లీ
డి) కోల్‌కతా
జవాబు ః డి (కోల్‌కతా)
0 Comments