
SBI ఫౌండేషన్ స్కాలర్‌షిప్
SBI ఫౌండేషన్ తన ఎడ్యుకేషన్ వర్టికల్ - ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ మిషన్ (ILM) కింద SBIF ఆశా స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ 2023 ద్వారా నిరుపేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను అందిస్తుంది. దీనిలో భాగంగా భారతదేశంలోని తక్కువ-ఆదాయ కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులు తమ యొక్క విద్యను ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగించడానికి SBI ఫౌండేషన్ స్కాలర్‌షిప్ రూపంలో ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ ద్వారా భారతదేశంలోని అగ్రశ్రేణి NIRF విశ్వవిద్యాలయాలు/కళాశాలలు మరియు ఐఐటి నుండి మొదటి సంవత్సరం అండర్ గ్రాడ్యుయేట్ చదువుతున్న కళాశాల విద్యార్థులు, ఐఐఎంల నుండి ఎంబిఏ/పిజిడిఎం మరియు ప్రీమియర్ సంస్థల నుండి పిహెచ్‌డి 1 సంవత్సరానికి 5 లక్షల వరకు స్కాలర్‌షిప్ పొందేందుకు అర్హులు.
SBI ఫౌండేషన్ ఈ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ ద్వారా భారతదేశంలోని ప్రతిభ కల్గిన నిరుపేద అండర్ గ్రాడ్యువేట్ / ఐఐటి / ఐఐఎం / పిహెచ్‌డి చదివే విద్యార్థులకు ప్రతి సంవత్సరం 5 లక్షల వరకు స్కాలర్‌షిప్ అందిస్తుంది.
1) SBIF ఆశా స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ 2023 అండర్ గ్రాడ్యువేట్ విద్యార్థుల కోసం :
➙ అర్హతలు :
- విద్యార్థులు అండర్ గ్రాడ్యువేషన్‌లో మొదటి సంవత్సరం చదువుతూ ఉండాలి
- 12వ తరగతిలో కనీసం 75 శాతం మార్కులు సాధించి ఉండాలి
- కుటుంబ వార్షిక ఆదాయం 3 లక్షలకు మించరాదు
- భారత విద్యార్థులు అయి ఉండాలి
➙ స్కాలర్‌షిప్ మొత్తం :
- సంవత్సరానికి రూ॥ 50,000 వరకు స్కాలర్‌షిప్ అందిస్తుంది.
➙ కావాల్సిన ధృవీకరణ పత్రాలు :
- గత సంవత్సరం మార్కుల మెమో
- ఏదేని గుర్తింపు కార్డు
- ప్రస్తుతం చదువుతున్నట్లు ధృవీకరణ పత్రము
- అభ్యర్థి లేదా తల్లిదండ్రుల బ్యాంక్ ఖాతా
- ఆదాయం సర్టిఫికేట్
- అభ్యర్థి పాస్‌పోర్టు సైజు ఫోటో
➙ ధరఖాస్తు విధానం :
ఆన్‌లైన్
2) SBIF ఆశా స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ 2023 ఐఐటి విద్యార్థుల కోసం
➙ అర్హతలు :
- 2022-23 విద్యా సంవత్సరంలో టాప్ ఐఐటిలలో అండర్ గ్రాడ్యుయేట్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు
- 12వ తరగతిలో కనీసం 75 శాతం మార్కులు సాధించి ఉండాలి
- కుటుంబ వార్షిక ఆదాయం 3 లక్షలకు మించరాదు
- భారత విద్యార్థులు అయి ఉండాలి
➙ స్కాలర్‌షిప్ మొత్తం :
- సంవత్సరానికి రూ॥ 3,40,000 వరకు స్కాలర్‌షిప్ అందిస్తుంది.
➙ కావాల్సిన ధృవీకరణ పత్రాలు :
- గత సంవత్సరం మార్కుల మెమో
- ఏదేని గుర్తింపు కార్డు
- ప్రస్తుతం చదువుతున్నట్లు ధృవీకరణ పత్రము
- అభ్యర్థి లేదా తల్లిదండ్రుల బ్యాంక్ ఖాతా
- ఆదాయం సర్టిఫికేట్
- అభ్యర్థి పాస్‌పోర్టు సైజు ఫోటో
➙ ధరఖాస్తు విధానం
ఆన్‌లైన్
3) SBIF ఆశా స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ 2023 ఐఐఎం విద్యార్థుల కోసం
➙ అర్హతలు :
- 2022-23 విద్యా సంవత్సరంలో టాప్ ఐఐఎంలలో మొదటి సంవత్సరం ఎంబీఏ/పిజిడిఎం కోర్సులను చదువుతున్న విద్యార్థులు
- గ్రాడ్యువేషన్‌లో కనీసం 75 శాతం మార్కులు సాధించి ఉండాలి
- కుటుంబ వార్షిక ఆదాయం 3 లక్షలకు మించరాదు
- భారత విద్యార్థులు అయి ఉండాలి
➙ స్కాలర్‌షిప్ మొత్తం :
- సంవత్సరానికి రూ॥ 5,00,000 వరకు స్కాలర్‌షిప్ అందిస్తుంది.
➙ కావాల్సిన ధృవీకరణ పత్రాలు :
- గత సంవత్సరం మార్కుల మెమో
- ఏదేని గుర్తింపు కార్డు
- ప్రస్తుతం చదువుతున్నట్లు ధృవీకరణ పత్రము
- అభ్యర్థి లేదా తల్లిదండ్రుల బ్యాంక్ ఖాతా
- ఆదాయం సర్టిఫికేట్
- అభ్యర్థి పాస్‌పోర్టు సైజు ఫోటో
➙ ధరఖాస్తు విధానం :
ఆన్‌లైన్
4) SBIF ఆశా స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ 2023 పిహెచ్‌డి విద్యార్థుల కోసం
➙ అర్హతలు :
- 2022-23 విద్యా సంవత్సరంలో ప్రఖ్యాత విద్యాసంస్థలలో మొదటి సంవత్సరం పిహెచ్‌డి ప్రోగ్రామ్‌లో (ఏదైనా స్ట్రీమ్) నమోదు చేసుకున్న విద్యార్థులు
- పోస్టు గ్రాడ్యువేషన్‌లో కనీసం 75 శాతం మార్కులు సాధించి ఉండాలి
- కుటుంబ వార్షిక ఆదాయం 3 లక్షలకు మించరాదు
- భారత విద్యార్థులు అయి ఉండాలి
➙ స్కాలర్‌షిప్ మొత్తం :
- సంవత్సరానికి రూ॥ 2,00,000 వరకు స్కాలర్‌షిప్ అందిస్తుంది.
➙ కావాల్సిన ధృవీకరణ పత్రాలు :
- గత సంవత్సరం మార్కుల మెమో
- ఏదేని గుర్తింపు కార్డు
- ప్రస్తుతం చదువుతున్నట్లు ధృవీకరణ పత్రము
- అభ్యర్థి లేదా తల్లిదండ్రుల బ్యాంక్ ఖాతా
- ఆదాయం సర్టిఫికేట్
- అభ్యర్థి పాస్‌పోర్టు సైజు ఫోటో
➙ ధరఖాస్తు విధానం :
ఆన్‌లైన్
సందేహాలు - నివృతి
1) ఈ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌లో ఎంపిక ప్రక్రియ ?
‘SBIF ఆశా స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ 2023’ కోసం స్కాలర్‌ల ఎంపిక ప్రక్రియ అనేది వారి అకడమిక్ మెరిట్ మరియు ఆర్థిక నేపథ్యం ఆధారంగా చేయబడుతుంది. దిగువ సూచించిన ప్రకారం ఎంపిక జరుగుతుంది.
- వారి అకడమిక్ మెరిట్ మరియు ఆర్థిక నేపథ్యం ఆధారంగా దరఖాస్తుల ప్రారంభ షార్ట్‌లిస్ట్
- షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల టెలిఫోనిక్ ఇంటర్వ్యూ తర్వాత తుది ఎంపిక కోసం డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తుంది.
2) ఒకవేళ నేను ఈ ప్రోగ్రామ్ ద్వారా స్కాలర్‌షిప్ కొరకు ఎంపిక చేయబడితే, నేను స్కాలర్‌షిప్ ఫండ్‌ను ఎలా అందుకుంటాను?
ఎంపికైన తర్వాత, స్కాలర్‌షిప్ మొత్తం నేరుగా బ్యాంక్ ఖాతాలోకి జమ చేయడం జరుగుతుంది.
3) ఈ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ ద్వారా నేను ఎన్ని పర్యాయాలు స్కాలర్‌షిప్ పొందవచ్చు ?
కేవం ఒకసారి మాత్రమే పొందవచ్చు.
ఎలా ధరఖాస్తు చేసుకోవాలి ?
1) తమ రిజిస్ట్రేషన్ ఐడితో www.buddy4study.com లోకి లాగిన్ అవ్వాలి, (ఒకవేళ మీకు రిజిస్ట్రేషన్ ఐడి లేకపోతే రిజిస్ట్రేషన్ బటన్ నొక్కి ఈమేయిల్/మోబైల్/ఫేస్‌బుక్/జిమేయిట్ అకౌంట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.)
2) లాగిన్ అయిన తర్వాత మీరు SBIF ఆశా స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ అప్టికేషన్‌కు రిడైరెక్ట్ అవుతారు.
3) తర్వాత స్టార్ట్ అప్లికేషన్ బటన్‌పై క్లిక్ చేయాలి. (స్టార్ట్ అప్లికేషన్ నొక్కే ముందు స్కాలర్‌షిక్‌కు సంబందించిన వివరాలు పూర్తిగా చదువుకోవాలి)
4) ఆన్‌లైన్ స్కాలర్‌షిప్ అప్లికేషన్ ఫారంలో అడిగిన సమాచారంను పూర్తి చేయాలి.
5) కావాల్సిన ధృవీకరణ పత్రాలను అఫ్‌లోడ్ చేయాలి.
6) నియమనిబంధనలను అంగీకరించిన తర్వాత ప్రివ్యూ బటన్‌పై క్లిక్ చేయాలి.
7) ప్రివ్యూలో మీరు నింపిన వివరాలు మరోకసారి సరిచూసుకొని చివరగా సబ్‌మిట్ బటన్ నొక్కిన తర్వాత మీ ధరఖాస్తు పూర్తి అవడం జరుగుతుంది.
స్కాలర్‌షిప్ పేరు | SBIF ఆశా స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ 2023 |
ఎవరు అర్హులు | అండర్‌గ్రాడ్యువేట్ / ఐఐటి / ఐఐఎం / పిహెచ్‌డి విద్యార్థులు |
స్కాలర్‌షిప్ మొత్తం | 5 లక్షల వరకు |
ధరఖాస్తు ప్రక్రియ | ఆన్‌లైన్ విధానం |
ఏ విద్యార్థులు అర్హులు | భారతదేశ విద్యార్థులు |
చివరి తేది | 30-04-2023 |
ఎంపిక విధానం | ప్రతిభ ఆధారంగా |
ఆన్‌లైన్ కొరకు | Click Here |
0 Comments