
ఇంజినీరింగ్ రంగంలో గొప్ప ఆసక్తి ఉన్న చాలా మంది మహిళలు ఉన్నారు, కానీ వారి బలహీనమైన ఆర్థిక పరిస్థితుల కారణంగా, వారు తమ చదువును కొనసాగించలేకపోతున్నారు. ఇంజినీరింగ్‌లో విద్యను కొనసాగించాలనే వారి కల అసంపూర్తిగా మిగిలిపోయింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని రోల్స్ రాయిస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రోల్స్ రాయిస్ ఉన్నతి స్కాలర్‌షిప్ 2023 -24 అనే కొత్త పథకాన్ని రూపొందించింది. ఈ పథకం కింద, సైన్స్, టెక్నాలజీ మరియు ఇంజనీరింగ్ రంగంలో ఉన్నత విద్యను అభ్యసించడానికి అర్హులైన మహిళా అభ్యర్థులకు ఆర్థిక సహాయం అందించబడుతుంది. ఈ స్కాలర్‌షిప్ పథకం యొక్క ప్రధాన లక్ష్యం STEMలోని మహిళల జీవితాల్లో ప్రోత్సాహాన్ని అందించడం.
ఇంజనీరింగ్ కోర్సులను అభ్యసిస్తున్న ప్రతిభావంతులైన బాలికలకు విద్యావకాశాలను పెంపొందించడానికి రోల్స్ రాయిస్ ఉన్నతి స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ (2023-24) ద్వారా స్కాలర్‌షిప్ అందిస్తుంది. ఈ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ ద్వారా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ మరియు మ్యాథమెటిక్స్‌పై ఆసక్తి ఉన్న బాలిక విద్యార్థులను ప్రోత్సహిస్తుంది.
సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ చదివే నిరుపేద బాలికల విద్యార్థులకు సహాయం అందించి వారి యొక్క బంగారు భవిష్యత్తుకు తోడ్పాడు అందించడం కోసం తమ వంతు కృషిగా రోల్స్ రాయిస్ ఇండియా కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఈ స్కాలర్‌షిప్ అందిస్తుంది.. బాలిక విద్యార్థులు ఇంజినీరింగ్ కోర్సులు పూర్తి చేసే క్రమంలో వారి యొక్క ఆర్థిక ఇబ్బందులను తగ్గించేందుకు, వారి యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగు పరిచేందుకు, ఆర్థికంగా ఎటువంటి అంతరాయం లేకుండా చదువును కొనసాగించడానికి స్కాలర్‌షిప్ రూపంలో ఆర్థిక సహాయం అందిస్తుంది. దీని ద్వారా బాలిక విద్యార్థులు తమ యొక్క ఇంజనీరింగ్ కోర్సును ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తి చేయవచ్చు.
➠ స్కాలర్‌సిఫ్ ధరఖాస్తుకు కావాల్సిన అర్హతలు :
- సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ మరియు మ్యాథమెటిక్స్ సబ్జెక్టులలో ఏదైనా సంవత్సరం గ్రాడ్యుయేషన్ (జనరల్ ప్రొఫెషనల్) కోర్సులలో చదువుతున్న బాలిక విద్యార్థులు అర్హులు.
- గత సంవత్సరం/సెమిస్టర్‌లో కనీసం 55% మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి.
- కుటుంబ వార్షిక ఆదాయం 4 లక్షల కంటే మించరాదు.
- భారత విద్యార్థులై ఉండాలి.
➠ స్కాలర్‌షిప్ మొత్తం :
ఎంపిక విద్యార్థులకు రూ॥25,000 స్కాలర్‌షిప్ అందిస్తుంది.
➠ ఆన్‌లైన్ ధరఖాస్తుకు కావాల్సిన ధృవీకరణ పత్రాలు :
- పాస్‌పోర్ట్ సైజు ఫోటో
- ఆధార్ కార్డు
- ఆదాయ ధృవీకరణ పత్రం
- గత సంవత్సరం మార్కుల మెమో
- ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రవేశ రుజువు
- స్కాలర్‌షిప్ దరఖాస్తుదారు లేదా తల్లిదండ్రుల బ్యాంక్ ఖాతా వివరాలు (రద్దు చేయబడిన చెక్కు/పాస్‌బుక్ కాపీ)
➠ ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
➠ ఆన్‌లైన్ ధరఖాస్తుకు చివరి తేది :
- 15 మే 2023
సందేహాలు - నివృతి
1) రోల్స్ రాయిస్ ఉన్నతి స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ 2023-24 కోరకు విద్యార్థులకు ఎలా ఎంపిక చేస్తారు?
‘రోల్స్-రాయిస్ ఉన్నతి స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ కోసం స్కాలర్‌షిప్ కోసం ఎంపిక మెరిట్ మరియు అవసరాల ఆధారితంగా ఉంటుంది. దిగువ వివరించిన విధంగా ఇది బహుళ-దశల ప్రక్రియను కలిగి ఉంటుంది -
- దరఖాస్తుదారుల అకడమిక్ మెరిట్ మరియు ఆర్థిక అవసరాల ఆధారంగా వారి ప్రారంభ షార్ట్‌లిస్ట్.
- తుది ఎంపిక కోసం పత్ర ధృవీకరణ తర్వాత షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులతో టెలిఫోనిక్ ఇంటరాక్షన్.
2) ఈ ప్రోగ్రామ్ కోసం ఎంపిక చేయబడితే, నేను స్కాలర్‌షిప్ మొత్తాన్ని ఎలా అందుకుంటాను?
ఎంపిక చేసిన తర్వాత, స్కాలర్‌షిప్ మొత్తం నేరుగా బ్యాంక్ ఖాతాలోకి బదిలీ చేయబడుతుంది.
3) నేను ఎన్నిసార్లు ఈ స్కాలర్‌షిప్ పొందే అవకాశం ఉంది ?
ఇది వన్-టైమ్ స్కాలర్‌షిప్.
4) నేను ప్రస్తుతం చివరి సంవత్సరం బిటెక్ చదువుతున్నాును. నేను ఈ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేయవచ్చా?
అవును. మీరు ఇతర అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఈ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎలా ధరఖాస్తు చేసుకోవాలి ?
1) తమ రిజిస్ట్రేషన్ ఐడితో www.buddy4study.com లోకి లాగిన్ అవ్వాలి, (ఒకవేళ మీకు రిజిస్ట్రేషన్ ఐడి లేకపోతే రిజిస్ట్రేషన్ బటన్ నొక్కి ఈమేయిల్/మోబైల్/ఫేస్‌బుక్/జిమేయిట్ అకౌంట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.)
2) లాగిన్ అయిన తర్వాత మీరు రోల్స్ రాయిస్ ఉన్నతి స్కాలర్‌షిప్ అప్టికేషన్‌కు రిడైరెక్ట్ అవుతారు.
3) తర్వాత స్టార్ట్ అప్లికేషన్ బటన్‌పై క్లిక్ చేయాలి. (స్టార్ట్ అప్లికేషన్ నొక్కే ముందు స్కాలర్‌షిక్‌కు సంబందించిన వివరాలు పూర్తిగా చదువుకోవాలి)
4) ఆన్‌లైన్ స్కాలర్‌షిప్ అప్లికేషన్ ఫారంలో అడిగిన సమాచారంను పూర్తి చేయాలి.
5) కావాల్సిన ధృవీకరణ పత్రాలను అఫ్‌లోడ్ చేయాలి.
6) నియమనిబంధనలను అంగీకరించిన తర్వాత ప్రివ్యూ బటన్‌పై క్లిక్ చేయాలి.
7) ప్రివ్యూలో మీరు నింపిన వివరాలు మరోకసారి సరిచూసుకొని చివరగా సబ్‌మిట్ బటన్ నొక్కిన తర్వాత మీ ధరఖాస్తు పూర్తి అవడం జరుగుతుంది.
0 Comments