తెలంగాణ గురుకులాలలో భారీ నోటిఫికేషన్
9231 ఉద్యోగాలు భర్తీ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త ! తెలంగాణ రాష్ట్రం గురుకులాలలో ఉన్న 9231 ఖాళీల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. నిరుద్యోగులు ఎప్పటినుంచో ఎదురుచుస్తున్న గురుకుల పాఠశాలలోని టీచింగ్ / నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ కోసం నోటీఫికేషన్ జారీ చేసింది. ఇట్టి పోస్టులకు తెలంగాణలోని స్త్రీ, పురుష అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా ధరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణ గురుకుల విద్యాసంస్థల రిక్రూట్‌మెంట్ బోర్డు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాలలో ఖాళీగా ఉన్న 9231 పోస్టులకు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ - 2023 ను విడుదల చేసింది. ఇందులో భాగంగా తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యూకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ సోసైటీ, మహాత్మా జ్యోతిభాపూలే తెలంగాణ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యూకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సోసైటీ, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్‌లలో ఖాళీగా ఉన్న 9231 టీచింగ్, నాన్‌టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ విధానంలో ధరఖాస్తులను ఆహ్వానిస్తుంది. వాటికి సంబందించిన, వివరాలు, అర్హత, పోస్టుల ఖాళీల గురించి పూర్తి సమాచారం కింద తెలియజేయడం జరిగింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన తెలంగాణ గురుకులం నోటిఫికేషన్ - 2023 లో మొత్తం 9231 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో డైరెక్టర్ / ఫిజికల్ డైరెక్టర్ డిగ్రీ కళాశాలలు మరియు జూనియర్ కళాశాలలో పోస్టుల భర్తీ కోసం ఆన్‌లైన్ ధరఖాస్తులు 17 ఏప్రిల్ 2023 నుండి ప్రారంభమవుతుంది. అలాగే టిఎస్ గురుకులం టి.జి.టి పోస్టుల భర్తీ కోసం ఆన్‌లైన్ ధరఖాస్తులను 28 ఏప్రిల్ 2023 నుండి స్వీకరిస్తుంది. ఇతర పోస్టుల భర్తీ కోసం ఆన్‌లైన్ ధరఖాస్తులను 24 ఏప్రిల్ 2023 నుండి స్వీకరిస్తుంది. విద్యార్హతలు, జిల్లాల వారీగా ఖాళీల సంఖ్య, సిలబస్, పూర్తి సమాచారంతో కూడిన అధికార నోటిఫికేషన్ కొద్దిరోజుల్లో విడుదల చేయడం జరుగుతుంది.
➠ పోస్టులు భర్తీ చేయనున్న తెలంగాణ గురుకులాలు :
- తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యూకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ సోసైటీ,
- మహాత్మా జ్యోతిభాపూలే తెలంగాణ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యూకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సోసైటీ,
- తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సోసైటీ
తెలంగాణ గురుకుల పోస్టుల జాబితా - 2023 |
పోస్టు పేరు |
ఖాళీల సంఖ్య |
లెక్చరర్స్ / ఫిజికల్ డైరెక్టర్ / లైబ్రేరియన్ ఇన్ డిగ్రీ కాలేజిలు |
868 |
జూనియర్ లెక్చరర్ / ఫిజికల్ డైరెక్టర్ / లైబ్రేరియన్ ఇన్ జూనియర్ కాలేజిలు |
2008 |
పోస్ట్ గ్రాడ్యువేట్ టీచర్స్ (పిజిటి) |
1276 |
పాఠశాలలోని లైబ్రేరియన్ |
434 |
పాఠశాలలోని ఫిజికల్ డైరెక్టర్ |
275 |
డ్రాయింగ్ టీచర్ / ఆర్ట్ టీచర్ |
134 |
క్రాప్ట్ ఇన్‌స్రక్టర్ / క్రాప్ట్ టీచర్స్ |
92 |
మ్యూజిక్ టీచర్స్ |
124 |
ట్రైన్డ్ గ్రాడ్యువేట్ టీచర్స్ |
4020 |
మొత్తం |
9231 |
తెలంగాణ గురుకులం వివిధ రకాల పోస్టుల యొక్క జీతభత్యాల వివరాలు |
పోస్టు పేరు |
జీతం |
ట్రైన్డ్ గ్రాడ్యువేట్ టీచర్స్ (టిజిటి) |
42,300 - 1,15,270 |
పోస్టు గ్రాడ్యువేట్ టీచర్ (పిటిజి) |
45,960 - 1,24,150 |
మ్యూజిక్ టీచర్ |
33,750 - 99,310 |
క్రాప్ట్ టీచర్ |
33,750 - 99,310 |
ఆర్ట్స్ టీచర్ |
33,750 - 99,310 |
ఫిజికల్ డైరెక్టర్ |
42,300 - 1,15,270 |
లైబ్రేరియన్ ఇన్ స్కూల్స్ |
38,890 - 1,12,510 |
జూనియర్ లెక్చరర్ / ఫిజికల్ డైరెక్టర్ / లైబ్రేరియన్ ఇన్
జూనియర్ కాలేజేస్ |
54,220 - 1,33,630 |
లెక్చరర్ / ఫిజికల్ డైరెక్టర్ / లైబ్రేరియన్ ఇన్
డిగ్రీ కాలేజేస్ |
58,850 - 1,37,050 |
సంస్థ / బోర్డు |
తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యూకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ రిక్రూట్‌మెంట్ బోర్డు |
పోస్టులు |
టీచింగ్, నాన్ -టీచింగ్ |
పోస్టు పేరు |
టిజిటి, పిజిటి, మ్యూజిక్, క్రాప్ట్, ఆర్ట్స్ టీచర్స్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్, లెక్చరర్స్, జూనియర్ లెక్చరర్స్ |
పోస్టుల ఖాళీలు |
9231 |
పోస్టు రకం |
ప్రభుత్వ ఉద్యోగాలు |
పోస్టుల ప్రాంతం |
తెలంగాణ |
ధరఖాస్తు విధానం |
ఆన్‌లైన్ |
ధరఖాస్తులు ప్రారంభం |
17-04-2023 |
అధికారిక వెబ్‌సైట్ |
treirb.telangana.gov.in |
0 Comments