
TSNPDCL జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ జాబ్స్
నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (TSNPDCL) ఖాళీగా ఉన్న 100 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ భర్తీలో భాగంగా టిస్‌ఎన్‌పిడిసిఎల్‌లోని 100 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. బిఏ/బికామ్/బిఎస్సీ పూర్తి చేసిన 18 నుండి 44 సంవత్సరాల లోపు ఉన్న నిరుద్యోగ అర్హులైన అభ్యర్థులు 29 ఏప్రిల్ 2023 సాయంత్రం 5.00 గంటల లోగా ఆన్‌లైన్ విధానంలో ధరఖాస్తు చేసుకోవాలి. వ్రాత పరీక్ష 28-05-2023 రోజున నిర్వహించడం జరుగుతుంది. జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ నోటిఫికేషన్, అర్హత ప్రమాణాలు, ఎంపిక విధానం, ఇతర విధివిధానాలు కింద ఇవ్వబడ్డాయి.
నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణా లిమిటెడ్ (TSNPDCL)యొక్క ప్రధాన కార్యాలయం వరంగల్‌లో కలదు. నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణా లిమిటెడ్ తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్, హనుమకొండ, జనగాం, మహబూబాబాద్, జయశంకర్-భూపాలపల్లి, ములుగు (జయశంకర్-భూపాలపల్లి స్థానికంగా) కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల (కరీంనగర్ నుండి స్థానికం), ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్ మరియు ఆసిఫాబాద్ జిల్లాలలో సేవలందిస్తుంది.
➠ ధరఖాస్తు విధానం :
TSNPDCL జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాల కోసం ఆన్‌లైన్ విధానంలో ధరఖాస్తు చేసుకోవాలి.
➠ పరీక్షా పద్దతి :
TSNPDCL జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాల ఎంపిక వ్రాతపరీక్ష ద్వారా జరుగుతుంది.
➠ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాల కోసం అర్హతలు :
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బిఏ / బికామ్ / బిఎస్సీ పూర్తి చేసి ఉండాలి
- కంప్యూటర్‌లో అప్లికేషన్ / ఆఫిస్ ఆటోమేషన్ (ఎంఎస్ ఆఫీస్) సర్టిఫికేట్ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.
➠ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాల కోసం కావాల్సిన వయస్సు :
- అభ్యర్థులు 18 సంవత్సరాల నుండి 44 సంవత్సరాల లోపు వారై ఉండాలి. (రిజర్వేషన్ల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.)
➠ ఆన్‌లైన్ ధరఖాస్తు రుసుము :
- 200 రూపాయలు (ఎస్సీ / ఎస్టీ / బిసి / ఈడబ్ల్యూఎస్ / వికలాంగులు) ఆన్‌లైన్ లో చెల్లించాలి
- ఇతరులు 120 రూపాయలు ఆన్‌లైన్ ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి
➠ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ మొత్తం పోస్టులు :
మొత్తం 100 పోస్టులు
➠ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పరీక్షా సిలబస్ :
- పరీక్ష మొత్తం 80 మార్కులతో కూడి ఉంటుంది.
- 80 ప్రశ్నలు బహుళైచ్చిక పద్దతిలో ఉంటాయి
- ప్రతి ప్రశ్నకు 1 మార్కు చొప్పున ఉంటుంది.
- పరీక్ష సమయం 2 గంటలు (120 నిమిషాలు) ఉంటుంది.
మొత్తం మూడు సబ్జెక్టులలో ప్రశ్నలు అడుగుతారు.
- న్యూమరికల్ ఎబిలిటి మరియు లాజికల్ రిజనింగ్
- కంప్యూటర్ అవేర్‌నెస్
- ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిసియెన్సీ అండ్ జనరల్ నాలెడ్జ్
సెక్షన్ | సబ్జెక్టు | మొత్తం ప్రశ్నలు |
సెక్షన్ - ఎ | న్యూమరికల్ ఎబిలిటి మరియు లాజికల్ రిజనింగ్ | 40 ప్రశ్నలు |
సెక్షన్ - బి | కంప్యూటర్ అవేర్‌నెస్ | 20 ప్రశ్నలు |
సెక్షన్ - సి | ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిసియెన్సీ అండ్ జనరల్ నాలెడ్జ్ | 20 ప్రశ్నలు |
సంస్థ పేరు | నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణా లిమిటెడ్ (TSNPDCL) |
పోస్టు పేరు | జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ |
పోస్టుల సంఖ్య | 100 |
ధరఖాస్తు విధానం | ఆన్‌లైన్ |
ఎంపిక విధానం | వ్రాత పరీక్ష |
ధరఖాస్తులు ప్రారంభం | 10-04-2023 |
రాష్ట్రం | తెలంగాణ |
విద్యార్హత | బిఏ / బికామ్ / బిఎస్సీ |
కెటగిరీ | ప్రభుత్వ ఉద్యోగాలు |
అధికారిక వెబ్‌సైట్ | http://tsnpdcl.cgg.gov.in |
ధరఖాస్తు ప్రక్రియ ప్రారంభం | 10-04-2023 |
ధరఖాస్తుకు ఆఖరు తేది | 29-04-2023 (సాయంత్రం 5.00 గంటల వరకు) |
హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ | 22-05-2023 |
పరీక్ష తేది | 28-05-2023 |
0 Comments