
దేవుని ప్రార్థనల శక్తి
Telugu Moral Stories
Telugu Stories || Moral Stories in Telugu || Telugu Kathalu || Telugu Stories for Kids
అనగనగా ఒక కోకిల కుటుంబం అడవిలోని చెట్టుపై జీవించసాగాయి. ఒకసారి తల్లి కోకిల చాలా గుడ్లను పెట్టింది. ఆ గుడ్లన్ని పొదిగి చిన్న కోకికలు బయటకువచ్చాయి. ఆ చిన్నకోకిల పిల్లలలో ఒక కోకిల అంగవైకల్యంతో బయటకు వచ్చింది. తల్లి కోకిల, తండ్రి కోకిల అంగవైకల్యం గల ఆ కోకిల పిల్లను చాలా ప్రేమగా, జాగ్రత్తగా చూడసాగాయి. దానికి కావాల్సిన ఆహారాన్ని కూడా వాళ్లే దగ్గర ఉండి తినిపించేవాళ్లు. ఒక రోజు అనుకోకుండా అడవికి నిప్పు అంటుకున్నది. ఆ నిప్పు త్వరత్వరగా అడవంతా వ్యాప్తి చెందుతుంది. అడవిలోని జంతువులు, పక్షులు ప్రాణభయంతో తమ నివాస స్థానాలను వదలివెళ్లసాగాయి. ఆ విషయం తెలుసుకున్న తండ్రి కోకిల తన సంతానంతో ఈ విధంగా అన్నాడు. ‘‘ పిల్లల్లారా ! ఎగిరిపోండి. మీ ప్రాణాలను రక్షించుకోండి ’’ ఆ మాటలు విన్న తల్లి కోకిల బాధ నిండిన స్వరంతో ఈ విధంగా ఉన్నది. ‘‘ మనం ఈ అంగవైకల్యం గల కోకిల పిల్లను వదిలి ఎలా వెళ్లగలము. కనీసం దానికి నడవడానికి కూడా సాధ్యం కాదు. ’’ తండ్రి కోకిల, తల్లి కోకిల తమ బిడ్డ కోసం అలాగే చిన్న కోకిలతో పాటు ఉండిపోవాలని నిర్ణయించుకున్నాయి. తన తల్లిదండ్రులను చూసిన ఆ చిన్నకోకిల మనస్పూర్తిగా దేవున్ని ఈ విధంగా ప్రార్థించింది. ‘‘ ఓ భగవంతుడా ! దయచేసి అడవిలో రాజుకుంటున్న నిప్పును చల్లార్చి అన్ని జంతువులను, పక్షులను రక్షించు. చూడు నా తల్లి దండ్రులు నా కోసం తమ ప్రాణాలను వదులుకోవడానికి సిద్దపడి నా కోసం ఉన్నారు. మరి నీవు ఈ ప్రపంచానికే తండ్రివి. నా తల్లిదండ్రులు నాపై చూపిస్తున్నంత ప్రేమ, నీకు నీ పిల్లలపై లేదా ?’’ ఆ చిన్న కోకిల ఇలా ప్రార్థించిన కొద్దిసేపటికి ఆకస్మాత్తుగా అడవిని ముంచేసే విధంగా వర్షం ప్రారంభమైంది. ఆ వర్షానికి అడవిలో రాజుకున్న నిప్పు చల్లారిపోయింది.
నీతి - దేవునిపై నమ్మకం కోల్పొవద్దు
0 Comments