
చెడు మాటలు - చెలిమికి చేటు
Telugu stories with moral || Telugu stories || Telugu Stories in Telugu
రాము, సోము చిన్ననాటి మిత్రులు. వారు చేసే చిన్న చిన్న కూలీ పనుల వల్ల వచ్చే డబ్బులు కుటుంబ పోషణకు సరిపోవడం లేదు. దీంతో వారికి స్థిరమైన ఆదాయం వచ్చేవిధంగా ఏదైన పని కల్పించాలని వారు గ్రామసర్పంచ్ వద్దకు వెళ్తారు. దాంతో గ్రామసర్పంచ్ ఇలా అంటారు ‘‘ మీరు ఇద్దరు మంచి స్నేహితులు కదా మీరు ఇద్దరు కలిసి ఏదైన వ్యాపారం చేసుకోండి దానికి కావాల్సిన పెట్టుబడికి నేను సాయం చేస్తా ’’ అని అంటాడు. దానికి సమ్మంతిచిన రాము, సోము గ్రామ సర్పంచ్ వద్ద కొంత డబ్బును అప్పుగా తీసుకొని బట్టలషాపు పెడతారు. డబ్బులు తీసుకునే కౌంటర్ వద్ద రాము కూర్చుంటే, వచ్చిపోయే వినియోగదారులకు బట్టలు చూపించే బాద్యతను సోము తీసుకొని పనిచేస్తుంటారు. వ్యాపారం బాగా నడిచి కొంతకాలంలోనే గ్రామసర్పంచ్ వద్ద తీసుకున్న అప్పును తిరిగి చెల్లిస్తారు రాము, సోము ఇద్దరు. ఇలా ఇద్దరి స్నేహితుల వ్యాపారం అనతికాలంలో బాగా అభివృద్ది చెందడంతో వారి బట్టలషాపు ఎదురుగా ఉన్న మరో బట్టల షాపు యజమాని అయిన వీరయ్యకు అసూయ కల్గుతుంది. రాము, సోముల వ్యాపారం చెడగొట్టాలనే దురుద్దేశ్యంతో ఇద్దరి మద్యన గొడవలు పెట్టి వ్యాపారాన్ని నష్టం చేయాలని పన్నాగం పన్నుతాడు
ఒకనాటి సాయంత్రం రాము షాపులో లేని సమయంలో వీరయ్య సోము దగ్గరికి వచ్చి ఇలా అంటాడు ‘‘ సోమూ నువ్వేమో రోజంతా నిలబడి వినియోగదారులకు బట్టలు చూపించాలి, కానీ నీ స్నేహితుడు రాము మాత్రం దర్జాగా కౌంటర్ వద్ద కూర్చుని డబ్బులు తీసుకుంటాడు ’’ అని సోము మనసులో చెడు ఆలోచనలు కలిగేలా లేనిపోని మాటలు చెబుతాడు. తర్వాతి రోజు సోము రాముతో గొడవపడి కౌంటర్ వద్ద కూర్చుంటాడు. అయితే రాముకు బట్టలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియక అమోమయానికి గురవుతాడు. అలాగే సోము డబ్బులు లెక్కించే సమయంలో తప్పులు దొర్లుతాయి. ఇలా చేసేసరికి కొనాళ్లకు వినియోగదారుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయి వ్యాపారం దెబ్బతింటుంది. దీంతో గ్రామసర్పంచ్ ఇద్దరు స్నేహితులను పిలిచి ఇలా అంటాడు ‘‘ మీ ఇద్దరి మద్య గొడవ రావడానికి గల కారణం ఏమిటి మీరిద్దరు ఎందుకు గొడవపడుతున్నారు. ’’ అని అడిగాడు. దీంతో సోము వీరయ్య చెప్పిన మాటలను గ్రామసర్పంచ్‌కు చెబుతాడు. ‘‘ చెడు ఆలోచనలతో వీరయ్య చెప్పిన మాటలను విని మీ వ్యాపారాన్ని చెడగొట్టుకున్నారు’’ అలా కాకుండా ఎప్పటిలాగే ఎవరి పని వారు నిజాయితీ చేసుకోండని గ్రామసర్పంచ్ చెబుతాడు. ఇలా ఇద్దరు స్నేహితులు తమ తప్పును తెలుసుకొని ఎవరి పనులు వారు చేసుకొని వ్యాపారాన్ని అభివృద్ది చేసుకొని లాభాల్ని ఆర్జిస్తారు.
0 Comments