
తెలంగాణ BSC / BFSC/ BVSC / AH అడ్మిషన్స్ - 2023
తెలంగాణ రాష్ట్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ (పిజేటిఎస్‌ఎయూ), పి.వి నర్సింహరావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ (పివిఎన్‌ఆర్‌టివియు), శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హర్టికల్చర్ యూనివర్సిటీ (ఎస్‌కెఎల్‌టిఎస్‌హెచ్‌యూ) పరిధిలోని వ్యవసాయ, వెటర్నరీ, ఫిషరీష్, హార్టికల్చర్ వంటి వివిధ కోర్సులలో ప్రవేశం పొందేందుకు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇట్టి కోర్సులలో ప్రవేశం పొందడానికి అభ్యర్థి ఇంటర్మిడియట్ బైపీసీ ఉత్తీర్ణత సాధించి, ఎంసెట్-2023లో సాధించిన ర్యాంకు ఆధారంగా షార్ట్‌లిస్టు చేసి ప్రవేశం కల్పించడం జరుగుతుంది. ఇందులో వెటర్నరీ కోర్సు 5 సంవత్సరాలు ఉండగా వ్యవసాయ, ఫిషరీష్, హార్టికల్చర్ 4 సంవత్సరాల కోర్సు ఉంటుంది.
తెలంగాణ వ్యవసాయ, వెటర్నరీ, ఫిషరీస్, హర్టికల్చర్ కోర్సులలో ప్రవేశం పొందడానికి తేది జూలై 15, 2023 లోగా 1800/-(ఓసి, ఓబిసి), 900/-(ఎస్సీ/ఎస్టీ) ఫీజు చెల్లించి ఆన్‌లైన్ విధానంలో ధరఖాస్తు చేసుకోవాలి. 17 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వయస్సు గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి.
తెలంగాణ BSC/BFSC/BVSC/AH - 2023 అడ్మిషన్స్ కొరకు అర్హులైన అభ్యర్థులు ఎలా ధరఖాస్తు చేసుకోవాలి, ఆన్‌లైన్ విధానం, కాలేజి వివరాలు, ముఖ్యమైన తేదిలు తదితర వివరాలు కింద వివరించడం జరిగింది.
➠ బిఎస్సీ అగ్రికల్చర్ కళాశాలలు కల్గిన ప్రాంతాలు :
- రాజేంద్రనగర్ (హైద్రాబాద్)
- పొలాస (జగిత్యాల)
- అశ్వరావుపేట (భద్రాద్రి కొత్తగూడెం)
- పాలెం (నాగర్ కర్నూల్)
- వరంగల్ అర్భన్
- రాజన్నసిరిసిల్ల
- ఆదిలాబాద్
ఈ 7 వ్యవసాయ కళాశాలలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 520 సీట్లు ఉన్నాయి. వీటికి అదనంగా 200 సెల్ఫ్ ఫైనాన్స్ (ఫేమెంట్) సీట్లు అందుబాటులో ఉన్నాయి.
➠ వెటర్నరీ (బీఎస్సీ) కళాశాలలు :
- రాజేంద్రనగర్ (హైద్రాబాద్)
- కోరుట్ల (జగిత్యాల)
- మామునూరు (వరంగల్ అర్భన్)
➠ బీఎఫ్‌ఎస్సీ (ఫీషరీస్) కళాశాలల వివరాలు :
- పెబ్రేరు (వనపర్తి) - 28 సీట్లు ఉన్నాయి.
➠ బీఎస్సీ (హార్టికల్చర్) కళాశాలల వివరాలు :
- రాజేంద్రనగర్ (హైద్రాబాద్)
- మోజర్ల (వనపర్తి)
➠ బీఎస్సీ (కమ్యూనిటీ సైన్స్) కళాశాలల వివరాలు :
➠ తెలంగాణ BSC/BFSC/BVSC/AH - 2023 వయస్సు :
- 17 సంవత్సరాలు నుండి 25 సంవత్సరాలుండాలి - జనరల్ అభ్యర్థులు
- 17 సంవత్సరాలు నుండి 30 సంవత్సరాలుండాలి - బీసీ, ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల అభ్యర్థులు
- 17 సంవత్సరాలు నుండి 22 సంవత్సరాలుండాలి - జనరల్ అభ్యర్థులు
- 17 సంవత్సరాలు నుండి 25 సంవత్సరాలుండాలి - ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు
- 17 సంవత్సరాలు నుండి 27 సంవత్సరాలుండాలి - వికలాంగుల అభ్యర్థులు
➠ తెలంగాణ BSC / BFSC/ BVSC / AH - 2023 అర్హతలు :
- ఇంటర్మిడియట్ నాన్-మున్సిపల్ ఏరియా(గ్రామీణ ప్రాంతాలు) లో కనీసం 4 సంవత్సరాలు చదివి ఉండాలి.
- ఇంటర్మిడియట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- ఇంటర్మిడియట్‌లో తప్పనిసరిగా బయోలాజికల్ సైన్సెస్ మరియు ఫిజికల్ సైన్సెస్ కోర్సు చదివి ఉండాలి.
➠ తెలంగాణ BSC / BFSC/ BVSC / AH - 2023 ఎంపిక విధానం :
➠ తెలంగాణ BSC / BFSC/ BVSC / AH - 2023 ఫీజు వివరాలు :
- 1800/- (ఓసీ / బీసీ)
- 900/- (ఎస్సీ/ఎస్టీ)
➠ తెలంగాణ BSC / BFSC/ BVSC / AH - 2023 ముఖ్యమైన తేదీలు :
- ఆన్‌లైన్ ఫీజు చెల్లించేందుకు చివరి తేది.15-07-2023
- ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది.17-07-2023
➠ తెలంగాణ BSC / BFSC/ BVSC / AH - 2023 ధరఖాస్తు విధానం ః
కెటగిరీ | అడ్మిషన్స్ |
రాష్ట్రం | తెలంగాణ |
అర్హత | ఇంటర్మిడియట్ |
కోర్సు | వ్యవసాయ, ఫిషరీస్, హర్టికల్చర్, వెటర్నరీ |
వెటర్నరీ | 5 సంవత్సరాలు |
వ్యవసాయ, ఫిషరీస్, హర్టికల్చర్ | 4 సంవత్సరాలు |
ధరఖాస్తు విధానం | ఆన్‌లైన్ |
చివరి తేది | 17-07-2023 |
పూర్తి వివరాలు | Click here |
ఆన్‌లైన్ అప్లై | Click here |
0 Comments