General Science GK Questions in Telugu || జనరల్‌ సైన్స్‌ జికే క్వశ్చన్స్‌ - జవాబులు

General Science GK Questions in Telugu || జనరల్‌ సైన్స్‌ జికే క్వశ్చన్స్‌ - జవాబులు

GK Questions and Answers on Everyday Science
General science questions for competitive exams

1) విశ్వం, భూమి ఆవిర్భావానికి సంబంధించి ఎక్కువ మంది విశ్వసిస్తున్న సిద్దాంతం ఏది ?
ఎ) మహావిస్పోట సిద్దాంతం
బి) ధూళిమేఘ సిద్దాంతం
సి) నక్షత్ర సిద్దాంతం
డి) నెబ్యూలా సిద్దాంతం

జవాబు : ఎ) మహావిస్పోట సిద్దాంతం

2) భూమి పుట్టినప్పుడు వాతావరణంలో స్వేచ్ఛాస్థితిలో లేని వాయువు ఏది ?
ఎ) కార్భన్‌డైఆక్సైడ్‌
బి) హీలియం
సి) ఆక్సిజన్‌
డి) నైట్రోజన్‌

జవాబు : సి) ఆక్సిజన్‌ ‌

3) జీవుల పుట్టుకకు సంబందించి ఒపారిన్‌ ప్రతిపాదించిన ఏ సిద్దాంతం సరైందని భావిస్తున్నారు ?
ఎ) ప్రకృతి సృష్టివాదం
బి) సహజ/రసాయనిక సృష్టివాదం
సి) నిర్జీవ సృష్టివాదం
డి) ప్రత్యేక సృష్టివాదం

జవాబు : బి) సహజ/రసాయనిక సృష్టివాదం

4) జీవ ఆవిర్భావాన్ని వివరించే రసాయన సృష్టివాదాన్ని బలపరిచిన ప్రయోగం ఏది ?
ఎ) స్టాన్లిమిల్లర్‌ యూరే ప్రయోగం
బి) డార్విన్‌ ప్రయోగం
సి) లెమాయిటర్‌ ప్రయోగం
డి) బేట్సన్‌ ప్రయోగం

జవాబు : ఎ) స్టాన్లిమిల్లర్‌ యూరే ప్రయోగం

5) భూమిపై మొదట ఏ జీవి ఉద్భవించిందని భావిస్తున్నారు ?
ఎ) అమీబా
బి) వైరస్‌
సి) సయనో బ్యాక్టీరియా
డి) ఫంగస్‌

జవాబు : సి) సయనో బ్యాక్టీరియా

6) జీవ పరిమాణాన్ని వివరించేందుకు లామార్క్‌ ప్రతిపాదించిన సిద్దాంతం ఏది. ?
ఎ) పరిసర ప్రభావ సూత్రం
బి) ఉపయుక్త నిరుపయుక్త సూత్రం
సి) ఆర్జిత గుణాల అనువంశిక సూత్రం
డి) పైవన్నీ

జవాబు : డి) పైవన్నీ

7) లామార్క్‌ తన జీవ పరిణామ సిద్దాంతాలను వివరించడానికి ఏ జంతువును ఉదాహరణగా తీసుకున్నారు. ?
ఎ) ఏనుగు
బి) జిరాఫి
సి) గుర్రం
డి) ఒంటె

జవాబు : బి) జిరాఫి

8) జీవ పరిణామ శాస్త్ర పితామహుడిగా ఎవరిని పిలుస్తారు ?
ఎ) అరిస్టాటిల్‌
బి) డార్విన్‌
సి) మెండల్‌
డి) లామార్క్‌

జవాబు : బి) డార్విన్‌

9) డార్విన్‌ ప్రతిపాదించిన జీవపరిణామ సిద్దాంతాలు :
ఎ) అత్యుత్పత్తి
బి) మనుగడ కోసం పోరాటం
సి) వైవిధ్యం, ప్రకృతి ఎన్నిక
డి) పైవన్నీ

జవాబు : డి) పైవన్నీ


General Science GK Questions in Telugu :

10) జీవ పరిమాణాన్ని వివరించడానికి విజ్‌మన్‌ ప్రతిపాదించిన సిద్దాంతం ఏది ?
ఎ) బీజ ద్రవ్య సిద్దాంతం
బి) ప్రకృతి ఎన్నిక సిద్దాంతం
సి) జీవుల ఉత్పత్తి సిద్దాంతం
డి) ఉత్పరివర్తన సిద్దాంతం

జవాబు : ఎ) బీజ ద్రవ్య సిద్దాంతం

11) జీవ పరిమాణాన్ని వివరించడానికి శాస్త్రవేత్తలు వేటిని ఉదాహరణగా తీసుకున్నారు ?
ఎ) అవశేష అవయవాలు
బి) పిండోత్పత్తి శాస్త్ర నిదర్శనాలు
సి) సంధానకర్తలు
డి) పైవన్నీ

జవాబు : డి) పైవన్నీ

12) జీవుల్లో శ్వాసక్రియ ఆవశ్యకత ఏమిటి ?
ఎ) శక్తి విడుదలకు
బి) పెరుగుదలకు
సి) కణవిభజనకు
డి) ప్రత్యుత్పత్తి కోసం

జవాబు : ఎ) శక్తి విడుదలకు )

13) శ్వాసక్రియలో నేరుగా ఉపయోగపడే ఆహార పదార్థం ఏది ?
ఎ) పిండి పదార్థం
బి) గ్లూకోజ్‌
సి) ప్రొటీన్‌
డి) కొవ్వులు

జవాబు : బి) గ్లూకోజ్‌

14) జీవక్రియలకు శక్తి వనరుగా ఉపయోగపడే ఏ రసాయనాన్ని ఎనర్జీ కరెన్సీ అంటారు ?
ఎ) ఎడినోసైన్‌ డై ఫాస్పేట్‌
బి) ఎడినోసైన్‌ ట్రై పాస్పేట్‌
సి) ఎసిటైల్‌ కో ఎంజైమ్‌ - ఎ
డి) లైపోలిక్‌ ఆమ్లం

జవాబు : బి) ఎడినోసైన్‌ ట్రై పాస్పేట్‌

15) శ్వాసక్రియ అనేది ఏ రకమైన చర్యకు ఉదాహరణగా చెప్పవచ్చు ?
ఎ) ఉష్ణమోచక చర్య
బి) ఆక్సీకరణ చర్య
సి) విచ్ఛిన్నకర చర్య
డి) పైవన్నీ

జవాబు : డి) పైవన్నీ

16) శ్వాసక్రియ చర్యలు జరిగే ఏ కణాంగాన్ని కణ కొలిమిలు అంటారు ?
ఎ) రైటోజోమ్‌
బి) కేంద్రకం
సి) మైటోకాండ్రియా
డి) హరితరేణువు

జవాబు : సి) మైటోకాండ్రియా

17) కణంలో జరిగే శ్వాసక్రియలో ఏ దశలు ఉంటాయి ?
ఎ) ఎలక్ట్రాన్‌ రవాణా
బి) క్రెబ్స్‌ వలయం
సి) గ్లైకాలిసిస్‌
డి) పైవన్నీ

జవాబు : డి) పైవన్నీ

18) శ్వాసక్రియకు సంబంధించి కిందివాటిలో సరైంది ఏది ?
ఎ) శ్వాసక్రియలో ఆక్సిజన్‌ ఉపయోగపడుతుంది.
బి) శ్వాసక్రీయలో కార్భన్‌ డై ఆక్సైడ్‌
సి) శ్వాసక్రియలో శక్తి వెలువడుతుంది
డి) పైవన్నీ

జవాబు : డి) పైవన్నీ

19) అవాయు శ్వాసక్రియ జరిగే జీవికి ఉదాహరణ ఏది ?
ఎ) బ్యాక్టీరియా
బి) వైరస్‌
సి) ఈస్ట్‌
డి) పైవన్నీ

జవాబు : సి) ఈస్ట్‌

General Science GK Questions in Telugu :

20) కిణ్వ ప్రక్రియ ద్వారా ఏర్పడే పదార్థాలకు ఉదాహరణ ?
ఎ) బ్రెడ్‌
బి) ఇథైల్‌ ఆల్కహాల్‌
సి) పెరుగు
డి) పైవన్నీ

జవాబు : డి) పైవన్నీ


Also Read :

21) అవాయి, వాయు శ్వాసక్రియల్లో జరిగే చర్య ఏది ?
ఎ) ఎలక్ట్రాన్‌ రవాణా
బి) క్రెబ్స్‌ వలయం
సి) గైకాలిసిస్‌
డి) కిణ్వ ప్రక్రియ

జవాబు : సి) గైకాలిసిస్‌

22) వ్యాయామం ఎక్కువగా చేసినప్పుడు అవాయి శ్వాసక్రియ జరిగి ఏ ఆమ్లం ఏర్పడటం వల్ల కండరాల్లో నొప్పి కలుగుతుంది ?
ఎ) పైరూవిక్‌ ఆమ్లం
బి) లాక్టికామ్లం
సి) కార్భోనిక్‌ ఆమ్లం
డి) ఎసిటిక్‌ ఆమ్లం

జవాబు : బి) లాక్టికామ్లం

23) బేకరీ పరిశ్రమలో కిణ్వ ప్రక్రియ ద్వారా పదార్థాల తయారీకి ఉపయోగపడేది ?
ఎ) అమీబా
బి) బ్యాక్టీరియా
సి) ఈస్ట్‌
డి) శిలీంద్రం

జవాబు : సి) ఈస్ట్‌

24) అవాయు శ్వాసక్రియకు సంబంధించి కిందివాటిలో సరైంది ?
ఎ) ఇది ముఖ్యంగా కొన్ని సూక్ష్మజీవుల్లో జరుగుతుంది.
బి) దీనిలో కిణ్వప్రక్రియ ఉత్పాదితాలు ఏర్పడతాయి
సి) పదార్థం అసంపూర్తిగా విచ్ఛిన్నమవుతుంది.
డి) పైవన్నీ

జవాబు : డి) పైవన్నీ

25) ఉచ్ఛాసం, నిశ్వాసం అనేవి ఏ శ్వాసక్రియలో భాగంగా ఉంటాయి ?
ఎ) అణు శ్వాసక్రియ
బి) కణ శ్వాసక్రియ
సి) అంతర శ్వాసక్రియ
డి) బాహ్య శ్వాసక్రియ

జవాబు : డి) బాహ్య శ్వాసక్రియ

26) మన శరీరంలో శ్వాస వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ రెండిరటికి సంబందించిన భాగం ఏది ?
ఎ) స్వరపేటిక
బి) ఆహార నాళం
సి) గ్రసని
డి) వాయునాళం

జవాబు : సి) గ్రసని

27) ఊపిరితిత్తుల నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణాలు ?
ఎ) రక్తనాళాలు
బి) శ్వాస నాణాలు
సి) శ్వాస నాళికలు
డి) వాయుగోణులు

జవాబు : డి) వాయుగోణులు

28) ఊపిరితిత్తులను ఆవరించి రక్షించే పొర ఏది ?
ఎ) మెనెంజస్‌
బి) ప్లూరా
సి) పెరికారియాన్‌
డి) సైనస్‌

జవాబు : బి) ప్లూరా

29) శ్వాసక్రియలో భాగంగా కణజాలాల నుండి కార్భన్‌ డై ఆక్సైడ్‌ ఏ రూపాల్లో ఊపిరితిత్తులకు రవాణా అవుతుంది ?
ఎ) కార్భోనిక్‌ ఆమ్లం
బి) సోడియం, పోటాషియం బై కార్భోనేట్స్‌
సి) కార్భమినోహిమోగ్లోబిన్‌
డి) పైవన్నీ

జవాబు : డి) పైవన్నీ

General Science GK Questions in Telugu :

30) కీటకాల్లో పదార్థాల రవాణాకు ఉపయోగపడే వర్ణరహిత రక్తాన్ని ఏమంటారు ?
ఎ) క్లోరోక్లూరిన్‌
బి) హిమోగ్లోబిన్‌
సి) హీమోలింప్‌
డి) హీమోసయనిన్‌

జవాబు : సి) హీమోలింప్‌

31) మానవుడిలో ఊపిరితిత్తులకు సంబందించి కిందివాటిలో సరైంది ?
ఎ) ఊపిరితిత్తుల్లో వాయువుల వినిమయం జరుగుతుంది.
బి) కుడి ఊపిరితిత్తి ఎడమ దానికంటే పెద్దది
సి) ఊపిరితిత్తులను ఆవరించి ఉండే పొర ప్లూరా
డి) పైవన్నీ

జవాబు : డి) పైవన్నీ

32) వివిధ జీవుల్లో శ్వాసక్రియ అవయవాలకు సంబంధించి కింది జతల్లో సరికానిది ?
ఎ) పక్షులు - చర్మం
బి) క్షీరదాలు - ఊపిరితిత్తులు
సి) చేపలు - మొప్పలు
డి) కీటకాలు - వాయునాళాలు

జవాబు : ఎ) పక్షులు - చర్మం

33) జంతువుల్లో శ్వాసక్రియ అవయవాలు ఏ విధంగా ఉపయోగపడతాయి ?
ఎ) వాయువుల వినిమయానికి
బి) శక్తి విడుదలకు
సి) శ్వాసక్రియ రసాయన చర్యలకు
డి) వ్యర్థ పదార్థాల రవాణాకు

జవాబు : ఎ) వాయువుల వినిమయానికి

34) ఈ క్రింది ఏ జంతువుల్లో పుస్తకాకార ఊపిరితిత్తులు శ్వాస అవయవాలుగా ఉపయోగపడతాయి ?
ఎ) వానపాము, పాము
బి) జలగ, కప్ప
సి) తేలు, సాలీడు
డి) చేప, పీత

జవాబు : సి) తేలు, సాలీడు

35) కిందివాటిలో శ్వాస వ్యవస్థకు ప్రభావితం చేసే వ్యాధులకు ఉదాహరణ ఏది ?
ఎ) ఎంపైసీమా
బి) సిస్టిక్‌ పైబ్రోసిస్‌
సి) న్యూమోకోనియాసిస్‌
డి) పైవన్నీ

జవాబు : డి) పైవన్నీ

36) కొన్ని మొలస్కా జీవుల్లో ఉండే హీమోసయనిస్‌ శ్వాస వర్నకంలోని మూలకం ఏది ?
ఎ) కోబాల్డ్‌
బి) రాగి
సి) మాంగనీస్‌
డి) ఇనుము

జవాబు : బి) రాగి

37) గుండెలోని కణజాలం నుండి విడుదలయ్యే ఏ హార్మోన్‌ రక్త పరిమాణం, పీడనాన్ని నియంత్రిస్తుంది ?
ఎ) రెనిన్‌
బి) ఎట్రియల్‌ నేట్రియూరిటిక్‌ ఫ్యాక్టర్‌
సి) ఎరిథ్రోపాయిటిన్‌
డి) డ్యూరోక్రైనిన్‌

జవాబు : బి) ఎట్రియల్‌ నేట్రియూరిటిక్‌ ఫ్యాక్టర్‌

38) మెదడులోని హైపోథలామస్‌ నుండి విడుదలయ్యే న్యూరో హర్మోన్‌లు ఏ గ్రంథిని ప్రభావితం చేస్తాయి ?
ఎ) కాలేయం
బి) ఆధివృక్క గ్రంథి
సి) పీనియల్‌ గ్రంథి
డి) పిట్యూటరీ గ్రంథి

జవాబు : డి) పిట్యూటరీ గ్రంథి

39) గొనాడోట్రోపిక్‌ హార్మోన్‌ రిలీజింగ్‌ ఫ్యాక్టర్‌ ఏ హార్మోన్‌ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది ?
ఎ) పాలిక్యులార్‌ స్టిమ్యూలేటింగ్‌ హార్మోన్‌
బి) ల్యుటినైజింగ్‌ హార్మోన్‌
సి) ఇంటర్నేషనల్‌ సెల్‌ స్టిమ్యులేటింగ్‌ హార్మోన్‌
డి) పైవన్నీ

జవాబు : డి) పైవన్నీ

40) జంతువుల ప్రోటీన్‌లలో ఉండే అవశ్యక అమైనో ఆమ్లాల గురించి కిందివాటిలో సరైంది ?
1) ఆవశ్యక అమైనో ఆమ్లాలు మన శరీరంలో తయారుకావు
2) వీటిని ఆహారం ద్వారా తీసుకోవాలి
3) ల్యూసిన్‌, లైసిన్‌, మిథియోనైన్‌ అనేవి వీటికి ఉదాహరణ
4) వీటిలోపం వల్ల వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది
ఎ) 1, 2 మరియు 3 మాత్రమే
బి) 1, 2, 3 మరియు డి మాత్రమే
సి) 2, 3 మరియు డి మాత్రమే
డి) 3 మరియు డి మాత్రమే

జవాబు : బి) 1, 2, 3 మరియు డి మాత్రమే

Post a Comment

0 Comments