
తెలివైన నక్క
Telugu stories with moral || Telugu stories || Telugu Stories in Telugu
అనగనగా ఒక అడవిలో ఒక గుంట నక్క ఉండేది. అది ఏ పని చేయకుండా సోమరి పోతుగా ఉండేది. అదే అడవిలో ఒక చిరుతపులి నివసిస్తుండేది. ఆ చిరుతపులి గర్వం చాలా ఎక్కువ. అడవిలో అన్ని జంతువులు తాను చెప్పినట్లు వినాలని, తాను ఏమి చెబితే అదే నిజమని నమ్మాలని గర్వంతో విర్రవిగేది. చిరుతపులి చర్మం అందంగా ఉంటుందని, పెద్దపులి చర్మం హీనంగా ఉంటుందని అన్ని జంతువులకు చెప్పేది. అడవిలోని జంతువులు కూడా చిరుతపులి చెప్పే మాటలు నిజమేనని చెప్పేవి. ఒక రోజు చిరుతపులి అడవిగుండా నడుచుకుంటూ వెళుతుంది. దారిలో చెట్టుకింద నిద్రిస్తున్న గుంట నక్క కనిపిస్తుంది. గుంట నక్కను నిద్రలేపి ‘‘ నా ఈ చర్మం అందగా ఉంది కదా ? ’’ అని అడిగింది. అవును అంది గుంటనక్క. చిరుత తన గురించి గొప్పలు చెప్పుకుంటూ పోతుంది. చివరికి నక్క విసిగిపోయి ఇలా అంది ‘‘ మానవుడు మన కాన్న బలహీనుడు అయినా అతను ఉన్నతంగా ఎలా జీవిస్తున్నాడు ?’’ అంది. చిరుతపులి ఆమోమయంతో ఆలోచిస్తుంది. ఈ ప్రశ్నకు చిరుతపులి సమాధానం చెప్పలేకపోయింది. చివరికి ఎందుకు అని అడిగింది నక్కను ‘‘ ఎందుకంటే అందమైన చర్మం ఉండి కాదు. చురుకైన బుర్ర ఉండడం వల్ల ’’ అని అంది గుంటనక్క. ఆ మాటలు విన్న చిరుతపులికి గుంటనక్కను చంపేయాలన్నంత కోపం వచ్చింది. చిరుత కోపాన్ని గమనించిన నక్క వెంటనే తేరుకొని ‘‘ చిరుతా .. నీ చర్మం అద్భుతంగా ఉంది. నేను కాదనలేదు. అయితే ఇంతటి అందమైన చర్మం ఉంటే మానువుడు నిన్ను చంపక విడిచిపెట్టడు. తెలుసా ? ’’ అంది నక్క. చిరుత మరోసారి ఆలోచనలో పడింది. అంతలోనే ‘‘ అదిగో మానవుడు .. నిన్ను విడిచిపెట్టడు ’’ అంటూనే నక్కను విడిచిపెట్టి చిరుత కారడవిలోకి పరుగులు పెట్టింది. అలా నక్క తనను తాను చిరుతనుండి కాపాడుకుంది.
Moral : ఆపద సమయంలో సమస్పూర్తిగా మెలగాలి.
0 Comments