
Mera Bill Mera Adhikar Scheme in Telugu || India Schemes in Telugu || Gk in Telugu || General Knowledge in Telugu
- బిల్లు అప్‌లోడ్ చేయండి కోటి గెలుపొందండి
- కేంద్ర ప్రభుత్వం నిర్వహించే లక్కీ డ్రాలో కోటి రూపాయలు గెలుపొందే అవకాశం
- మేరా బిల్ మేరా అధికార్ లక్కీ డ్రా పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వం
- వినియోగదారుల్లో బిల్లు తీసుకునేందుకు ప్రోత్సాహకం అందజేస్తున్న ప్రభుత్వం
అరవింద్ నగరంలోని పేరు పొందిన రెస్టారెంట్‌లో ఫ్యామిలితో కలిసి భోజనం చేసాడు. భోజనం పూర్తి చేసిన తర్వాత అరవింద్ బిల్ ఎంత అయింది అని అడిగాడు. దానికి రెస్టారెంట్ వాళ్లు మొత్తం జిఎస్‌టితో కలిపి మొత్తం 1500 అయ్యిందని తెలపడంతో అరవింద్ రశీదు తీసుకోకుండా తన పర్సులోంచి 1500 తీసి వెయిటర్ ఇచ్చి వెళ్లిపోయాడు. ఇలా చాలామంది వివిధ సందర్భాలలో బిల్స్ తీసుకోకుండా డబ్బులు చెల్లిస్తుంటారు. ఇలా చేయడం వల్ల మనం చెల్లించిన పన్ను ప్రభుత్వానికి చేరకుండా నేరుగా షాప్‌యజమాని జేబులోకి వెళుతుంది. ఇదే కాకుండా ఒకవేళ మనం కొనుగోలు చేసిన వస్తువు పాడైన, రిటర్న్ ఇవ్వాలన్నా మన దగ్గర రశీదు ఉంటే పని సులభతరం అవుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని వినియోగదారులలో రశీదును తీసుకునే పద్దతిపై అవగాహన కల్పించడం కోసం వినూత్నంగా లక్కీడ్రా కార్యక్రమం ప్రవేశపెట్టింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం జిఎస్‌టీ ఎగవేత దారులను అడ్డుకట్ట వేయడం.
వినియోగదారులలో రశీదు అడిగే సంస్కృతిని పెంచే ఉద్ధేశ్యంతో కేంద్ర ప్రభుత్వం ‘‘ మేరా బిల్ మేరా అధికార్ ’’ అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. దీనివల్ల వినియోగదారులు తాము జరిపే కొనుగోళ్లన్నింటికి విక్రయదారుల నుండి రశీదు అడిగే అలవాటు పెరుగుతుందని కేంద్రం ఆశిస్తుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి రూ॥ 1 కోటి రూపాయల చొప్పున రెండు బంపర్ బహుతులను అందిస్తుంది. సెప్టెంబర్ 1 నుండి 12 నెలల పాటు పైలట్ ప్రాజేక్టు (ప్రయోగాత్మక పద్దతి) లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
ఈ లక్కీడ్రాలో 800 జీఎస్‌టీ రశీదులను ఎంపిక చేసి రూ॥10,000 చొప్పున ప్రైజ్ మనీ అందిస్తారు. లక్కీ డ్రాలో ఎంపిక చేసిన మరో 10 రశీదులకు రూ॥10 లక్షల చొప్పున కోటి రూపాయలు అందిస్తారు. ఇది కాకుండా ప్రతి 3 నెలలకు ఒకసారి బంపర్ డ్రా తీస్తారు. బంపర్ డ్రాలో గెలుపొందిన రశీదుకు 1 కోటి రూపాయలు ప్రైజ్ మనీ అందజేస్తారు. మేరా బిల్ మేరా అధికార్ కార్యక్రమంలో పాల్గొనదలచిన వారు తాము తీసుకున్న బిల్లులను అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తే సరిపోతుంది.
➺ లక్కీ డ్రాలో విజేతలు కావాలంటే ఏం చేయాలి ?
ముందు నెలలో ఇచ్చిన రశీదులన్నింటిని తర్వాతి నెల 5వ తేది లోగా web.merabill.gst.gov.in వెబ్సైటులో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. దీంతో వారు నెలవారీ లక్కీ డ్రాకు అర్హత సాధిస్తారు. ఇలా ఒక నెల వ్యవధిలో గరిష్టంగా ఒక వ్యక్తి 25 రశీదులను అప్‌లోడ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. లక్కీ డ్రాలో అర్హత సాధించాలంటే అప్‌లోడ్ చేసే బిల్లు కనీసం రూ॥200 ఉండాలి. జీఎస్‌టీ నమోదు చేసుకున్న వారు ఇచ్చే బిల్లులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. రశీదులను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసే సమయంలో విక్రయదారు జిఎస్‌టీ గుర్తింపు సంఖ్య, రశీదు నెంబర్, రశీదు తేది, రశీదు విలువ, రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం వంటి వివరాలు పొందుపర్చబడి ఉండాలి. నెలవారీ లక్కీ డ్రాను ప్రతి నెల 15 తేదిన తీస్తారు.
ఒకవేళ మీరు లక్కీ డ్రాలో ఎంపికైనట్లయితే ఎంపికైనట్లుగా సమాచారం వచ్చిన తేది నుండి నెల రోజుల లోగా యాప్/వెబ్‌సైట్ ద్వారా తమ పాన్, ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా వంటి వివరాలు అందజేయాలి. ఈ వివరాలను బట్టి విజేతలకు బహుమతులను అందజేస్తారు.
➺ లక్కీ డ్రా ఎవరు పాల్గొనవచ్చు ?
కేంద్రం ప్రస్తుతం పైలట్ ప్రాజేక్టుగా ఈ కార్యక్రమాన్ని అస్సాం, గుజరాత్, హర్యానా, పుదుచ్చేరి, దాద్రా నగర్ హవేలి, డామన్ డయ్యూలలో మాత్రమే అమలు చేస్తుంది. త్వరలో దేశంలో అన్ని రాష్ట్రాలలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
0 Comments