Drafting Committee of the Indian Constitution in Telugu || భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ || Indian Polity in Telugu || Gk in Telugu

భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ

భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ సభ్యులు  

     Gk in Telugu ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్‌ నాలెడ్జ్‌ కొరకు రూపొందించబడినవి. Gk  Banking (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Centran Investigation Agencies etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే  అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్  కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే General Knowledge పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్‌ సాధించడానికి ఉపయోగపడుతుంది. 

రాజ్యాంగం యొక్క ముసాయిదాను అధ్యయనం చేసి తుది ప్రతిని రూపొందించేందుకు ముసాయిదా కమిటీని ఏర్పాటు చేశారు. ఈ ముసాయిదా కమిటీని 29 అగస్టు 1947న నియమింపబడినది. ఈ కమిటీలో అధ్యక్షునితో పాటు ఆరుగురు సభ్యులున్నారు. వీరితో పాటు ఒక రాజ్యాంగ సలహాదారున్ని కూడా నియమించారు. 

➺ ముసాయిదా కమిటీ సభ్యులు :

  • డా॥బి.ఆర్‌ అంబేడ్కర్‌ (అధ్యక్షులు) 
  • కె.యం మున్షీ (మాజీ గృహశాఖ మంత్రి, బాంబే)
  • అల్లాడి కృష్ణస్వామి (మాజీ అడ్వకేట్‌ జనరల్‌, మద్రాస్‌ రాష్ట్రం)
  • ఎన్‌.గోపాలస్వామి అయ్యంగార్‌ (జమ్మూ, కాశ్మీర్‌ మాజీ ప్రధానమంత్రి, నెహ్రూ మంత్రిమండలిలో సభ్యులు)
  • బి.యల్‌.మిట్టర్‌ (భారతదేశ మాజీ అడ్వకేట్‌ జనరల్‌)
  • మహమ్మద్‌ సాదుల్లా (అస్సాం మాజీ ముఖ్యమంత్రి, ముస్లీంలీగ్‌ సభ్యులు)
  • డి.పి ఖైతాన్‌ (న్యాయవాది)


Also Read :


రాజ్యాంగ సలహాదారునిగా శ్రీ బెనగల్‌ నర్సింగ్‌రావు గారు నియమింపబడ్డారు. తర్వాత కాలంలో 1950వ సంవత్సరంలో వీరు అంతర్జాతీయ న్యాయస్థానంలో భారతదేశం నుండి మొట్టమొదటి న్యాయమూర్తిగా నియమించబడ్డారు. 

➺ ఇతర కమిటీ సభ్యులు 

బి.యల్‌ మిట్టల్‌ కమిటీ నుండి రాజీనామా చేశారు. వీరి స్థానంలో మాధవరావు (వడోదరా మహారాజు యొక్క న్యాయసలహదారులు) నియమించబడ్డారు. 

డి.పి.ఖైతాన్‌ గారి మరణం వల్ల ఆయన స్థానంలో టి.టి.కృష్ణమాచారి గారు నియమించబడ్డారు. 


Post a Comment

0 Comments