
పెద్దమనుషుల ఒప్పందం Gentlemen’s Agreement
Gk in Telugu ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్ నాలెడ్జ్ కొరకు రూపొందించబడినవి. Gk Banking (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Centran Investigation Agencies etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్ కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే General Knowledge పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్ సాధించడానికి ఉపయోగపడుతుంది.
భారతదేశంలో నిజాం సంస్థానం విలీనం అయిన తర్వాత 1952 సంవత్సరంలో హైదరాబాద్ రాష్ట్రం ఏర్పాటు అయ్యింది. హైదరాబాద్ రాష్ట్రానికి ఎన్నిక అయిన మొదటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు. మద్రాసు ప్రెసిడెన్సీ నుండి 1953లో ఆంధ్ర ప్రాంతం వేరుపడడంతో, టంగుటూరి ప్రకాశం ముఖ్యమంత్రి అయ్యారు. అయితే తెలుగు మాట్లాడే ప్రాంతాలను ఏకం చేయ్యాలని ఉద్యమం మొదలైంది. విలీనానికి అనుకూలంగా ఆంధ్ర శాసనసభ ఏకగ్రీవ తీర్మాణం చేయగా, హైదరాబాద్ రాష్ట్ర శాసనసభలో అధిక శాతం సభ్యులు విలీనానికి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కోస్తా ఆంధ్రలోని సంపన్న, అభివృద్ది చెందిన వర్గం కొత్తగా ఏర్పడబోయే రాష్ట్రంలో ఆధిపత్యం సాధిస్తారని వాళ్లు ఆందోళన పడ్డారు. ఎటువంటి ప్రయోజనాలు లేకుండానే తెలంగాణ ప్రజలు తమ వనరులపై నియంత్రణ కోల్పోతారని భయపడ్డారు. కోస్తా ప్రాంతాల నాయకులు ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేసి సుదీర్ఘ చర్చల తర్వాత 20 ఫిబ్రవరి 1956 రోజున ‘‘పెద్ద మనుషుల ఒప్పందం (Gentlemen’s Agreement)’’ కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందంలో సభ్యులు కింది విధంగా ఉన్నారు.
ఆంధ్రాప్రాంతం నుండి
- బెజవాడ గోపాలరెడ్డి
- నీలం సంజీవరెడ్డి
- గౌతు లచ్చన్న
- అల్లూరి సత్యనారాయణ రాజు
తెలంగాణ ప్రాంతం నుండి
- బూర్గుల రామకృష్ణారావు
- మర్రి చెన్నారెడ్డి
- జె.వి నర్సింగరావు
- కె.వి రంగారెడ్డి
ఒప్పందంపై సంతకాలు చేశారు. వీరు మౌలికంగా 14 కీలక అంశాలపై ఒప్పందం చేసుకున్నారు. దీంతో తెలంగాణ సంతృప్తికి లోబడి రెండు రాష్ట్రాల విలీనానికి మార్గం సుగమం అయింది. ఈ విధంగా హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ నూతన రాష్ట్రంగా ఏర్పాటు చేయబడింది.
Also Read :
➺ పెద్దమనుషుల ఒప్పందం (Gentlemen’s Agreement) లోని 14 అంశాలు :
1) పరిపాలనపై ఖర్చును రెండు ప్రాంతాలు ఆయా నిష్పత్తిలో భరించాలి. తెలంగాణలోని రెవెన్యూ మిగులుని తెలంగాణ అభివృద్దికి మాత్రమే ఖర్చు పెట్టాలి
2) తెలంగాణ మద్యపాన నిషేదాన్ని తెలంగాణ ప్రాంత విధాన సభ సభ్యులు నిర్ణయించిన ప్రకారం కొనసాగిస్తారు.
3) తెలంగాణలో అప్పటికి ఉన్న విద్యా సౌకర్యాలను తెలంగాణ విద్యార్థులకు మాత్రమే కేటాయించాలి
4) రెండు రాష్ట్రాల విలీనం వల్ల మిగులు ఉద్యోగులను తొలగించాల్సి వస్తే ఇరు ప్రాంతాల నిష్పత్తిలో మాత్రమే తొలగించాల్సి ఉంటుంది.
5) భవిష్యత్తులో ఉద్యోగుల నియామకం ఇరు ప్రాంతాల ప్రజల నిష్పత్తిలో కొనసాగాలి.
6) తెలంగాణలోని సాధారణ పరిపాలన న్యాయ విభాగాలలో ఉర్దూ భాషకు ప్రస్తుతం ఉన్న స్థానాన్ని మరో 5 సంవత్సరాలు కొనసాగించాలి.
7) ప్రభుత్వ సర్వీసు నియామకానికి సంబంధించి ఉద్యోగుల్లో తెలంగాణ వారికి తెలుగు నిర్భంధం చేయరాదు.
8) 12 సంవత్సరాల పాటు తెలంగాణలో నివసిస్తే తెలంగాణ ప్రాంతంలో ఉద్యోగాలకు, విద్యాసంస్థలలో ప్రవేశాలకు అర్హతనిచ్చే ముల్కీ నియమాలను కొనసాగించడానికి అంగీకరించారు.
9) తెలంగాణలోని వ్యవసాయ భూమి అమ్మకాన్ని ఈ ప్రాంతీయ సంఘం నియంత్రిస్తుంది.
10) తెలంగాణ అభివృద్ది, అవసరాలను పర్యవేక్షించడానికి శాసనసభ నుండి 20 మంది సభ్యులతో చట్టబద్దమైన ప్రాంతీయ సంఘాన్ని ఏర్పాటు చేయడానికి అంగీకరించారు.
11) ప్రాంతీయ మండలిలో 20 మంది సభ్యులుంటారు. వీరిలో 9 మంది శాసనసభ్యులు. వీరిని జిల్లాకు ఒకరు చొప్పున ఆ జిల్లాలోని శాసనసభ్యులు ఎన్నుకుంటారు. మరో ఆరుగురిని రాష్ట్ర శాసనసభలోని తెలంగాణ ప్రాంత సభ్యులు ఎన్నుకుంటారు. వీరు శాసనసభ సభ్యులుగా పార్లమెంటు సభ్యులు గాని కావాలి మిగిలిన ఐదుగురు శాసనసభ్యులు కారు. కానీ వీరిని కూడా తెలంగాణ ప్రాంత శాసన సభ్యులు ఎన్నుకుంటారు.
12) ప్రాంతీయ మండలిని చట్టబద్ధ సంస్థగా ఏర్పాటు చేయాలి.
13) ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందంలో 40 శాతం సభ్యులు తెలంగాణ నుండి, 60 శాతం ఆంధ్ర నుండి ఉంటారు.
14) ముఖ్యమంత్రి ఆంధ్ర ప్రాంతం నుండి ఉంటే ఉపముఖ్యమంత్రి తెలంగాణ నుండి, ముఖ్యమంత్రి తెలంగాణ నుండి ఉంటే ఉపముఖ్యమంత్రి ఆంధ్ర నుండి ఉండాలి.
0 Comments