
మహాసముద్రాలు
Gk in Telugu ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్ నాలెడ్జ్ కొరకు రూపొందించబడినవి. Gk Banking (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Centran Investigation Agencies etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్ కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే General Knowledge పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్ సాధించడానికి ఉపయోగపడుతుంది.
భూమిపై ఖండాలు, మహాసముద్రాలను మొదటి శ్రేణి భూ స్వరూపాలుగా పేర్కొంటారు. అతిపెద్దదైన జలభాగాలనే మహాసమద్రాలుగా పిలుస్తారు. భూమిమీద గల నీటిభాగాన్ని భూశాస్త్రజ్ఞులు 5 మహాసమద్రాలుగా 1) పసిఫిక్ మహాసముద్రం 2) అట్లాంటిక్ మహాసముద్రం 3) హిందూ మహాసముద్రం 4) దక్షిణ మహాసముద్రం (అంటార్కిటిక్) 5) ఆర్కిటిక్ మహాసముద్రాలుగా విభజించడం జరిగింది.
సాధారణంగా సముద్రం, మహాసముద్రాలను ఒకదానికొకటి పర్యాయపదాలుగా ఉపయోగిస్తుంటారు. అయితే ఖచ్చితంగా చెప్పాలంటే చుట్టూ లేదా కనీసం ఒకవైపున భూమి ఉండే ఉప్పునీటి భాగాన్ని సముద్రం అని అంటారు. వివిధ ఖండాలు, ద్వీపాల సమూహాలు, ఇతర ప్రామాణికాల ఆధారంగా మహాసముద్రాలను విభజిస్తారు.
1) పసిఫిక్ మహాసముద్రం
ఇది అమెరికా నుండి ఆసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పపువా, న్యూగినియాలను వేరుచేస్తుంది.
2) అట్లాంటిక్ మహాసముద్రం
ఈ మహాసముద్రం అమెరికా నుండి యురప్ ఆఫ్రికాలను వేరు చేస్తుంది.
3) హిందూ మహాసముద్రం
ఈ మహాసముద్రం దక్షిణ ఆసియా తీరాలను తాకుతుంది. ఆఫ్రికా, ఆస్ట్రేలియాలను వేరుచేస్తుంది.
4) అంటార్కిటిక్ మహాసముద్రం (దక్షిణ మహాసముద్రం)
అంటార్కిటికా ఖండాన్ని చుట్టి ఉంటుంది. పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రాల కొనసాగింపుగా ఒక్కొక్కసారి పేర్కొంటారు.
5) అర్కిటిక్ మహాసముద్రం
దీనిని అట్లాంటిక్ మహాసముద్రంలో భాగంగా పేర్కొనవచ్చు. అర్కిటిక్ ప్రాంతంలో అధిక భాగం విస్తరించి ఉంటుంది. ఉత్తర అమెరికా, యురేషియా తీరాలను తాకుతుంది.
0 Comments