
Rani Rudrama Devi || రాణిరుద్రమదేవి || Telangana History in Telugu
రాణిరుద్రమదేవి (1262 - 1289)
Gk in Telugu ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్ నాలెడ్జ్ కొరకు రూపొందించబడినవి. Gk Banking (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Centran Investigation Agencies etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్ కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే General Knowledge పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్ సాధించడానికి ఉపయోగపడుతుంది.
రాణిరుద్రమదేవి కాకతీయ వంశమునకు గొప్ప పేరు ప్రఖ్యాతలను తెచ్చిపెట్టిన వీరవనిత. భారతదేశ చరిత్రలో రాజ్యాలను ఏలిన మహారాణులలో రుద్రమదేవి ఒకరు.
రాణిరుద్రమ దేవి తండ్రి గణపతిదేవునికి ముగ్గురు భార్యలు సోమలదేవి, నారంబ, పేరాంబ లు ఉన్నారు. పేరాంబ యొక్క కుమార్తెనే రుద్రాంబ (రాణిరుద్రమదేవి). గణపతిదేవుని తర్వాత కాకతీయ సామ్రాజ్య సింహసనాన్ని అధిష్టించి దక్షిణ భారతదేశంలో సింహాసనాన్ని అధిష్టించిన మొట్టమొదటి మహిళా పాలకురాలిగా కీర్తి సాధించింది.(భారతదేశంలో సింహాసనాన్ని అధిష్టించిన మొట్టమొదటి మహిళ రజియా సుల్తానా) రాణిరుద్రమదేవి ప్రవేశపెట్టిన ప్రసూతి సౌకర్యాల కల్పన గురించి "మల్కాపురం" (ప్రకాశం) శిలాశాసనంలో చర్చించడం జరిగింది. రాణిరుద్రమదేవి అధికారంకు సంబందించిన విషయాలు "మోటుపల్లి" శిలాశాసనంలో ఉన్నాయి. కాయస్థ జన్నిగదేవుడు వేసిన "దుర్గి" శిలాశాసనంలో పటోదృతి (ఎన్నిక ద్వారా పరిపాలనలోకి రావడం) ద్వారా రుద్రమదేవి అధికారంలో వచ్చిన విషయాన్ని తెలియజేస్తుంది. బీదర్‌కోట శిలాశాసనంలో ఈమెకు ‘‘రాయగజకేసరి’’ అనే బిరుదు ఉన్నదని తెలుస్తుంది. పువ్వుల గుమ్మడి వేసిన చందుపట్ల (నల్గొండ) శిలాశాసనం రాణిరుద్రమదేవి మరణం గురించి తెలియజేస్తుంది. ఈ శాసనం ద్వారా ఈమె 1289 సంవత్సరంలో అంబదేవుడితో జరిగిన ‘‘త్రిపురాంతక’’ యుద్దంలో మరణించినట్లు తెలుస్తుంది.
➙ వ్యక్తిగత సమాచారం
రాణిరుద్రమదేవి యుద్దవిద్యలు, రాజనీతి, గుర్రపు స్వారీ శివదేవయ్య వద్ద, నృత్యరీతులు జయపసేనాని (మేనమామ) వద్ద, సంగీతంను కొంకనభట్టు వద్ద నేర్చుకోవడం జరిగింది. ఈమె శైవమతగురువు విశ్వేశ్వర శంభువుకు మందడం అనే గ్రామాన్ని ఇచ్చింది. రుద్రమదేవి నిడదవోలు రాజు అయిన చాళుక్య వీరభద్రుడిని వివాహం చేసుకోవడం జరిగింది.
రాణిరుద్రమదేవి సంతానంలో భిన్నాభిప్రాయాలున్నాయి. చారిత్రక సమాచారం ప్రకారం రుద్రమదేవికి రుయ్యమ్మ, రుద్రమ్మ, మమ్ముడమ్మలు కుమార్తెలు ఉన్నట్లు తెలుస్తుంది. ఈమె మరణాంతరం మమ్ముడమ్మ - మహదేవుడు కుమారుడైన రెండో ప్రతాపరుద్రుడు (మనుమడు) సింహసనాన్ని అధిష్టించాడు.
ఈమె రాజ్యానికి సైనిక నాయకులు రాచర్ల ప్రసాదిత్యుడు, కాయస్త జన్నిగదేవుడు, గోనాగన్నారెడ్డిలు ఉన్నారు. ఇందులో రేచర్ల ప్రసాదిత్యుడికి ‘‘కాకతీయ రాజ్య స్థాపనాచార్య’’ ‘‘రాయపితామహంత’’ అనే బిరుదులు కలవు. గోనగన్నారెడ్డి కుమారుడు గోనబుద్దారెడ్డి రంగనాథ రామాయణం తెలుగులో రచించాడు. గోనగన్నారెడ్డి అనే నవలను అడవిబాపిరాజు రచించడం జరిగింది. ఈమె కాలంలో కాకతీయ రాజ్యాన్ని సందర్శించిన విదేశీయాత్రికుడు మార్కోపోలో. ఈమె నాయంకర వ్యవస్థను ఏర్పాటు చేసింది. తదనంతర కాలంలో ఈ నాయంకర వ్యవస్థ వల్లే కాకతీయ సామ్రాజ్యం అంతమైందని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.
ఈమెకు రుద్రదేవ మహరాజు, రాయగజకేసరి, పటోదృత్తి అనే బిరుదులున్నాయి.
0 Comments