TS PECET 2024: Online Apply, Exam Date, Eligibility టీఎస్ పీఈసెట్ - 2024
తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (టీఎస్‌సీహెచ్‌ఈ) ‘తెలంగాణ స్టేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీఎస్ పీఈసెట్) 2024 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనిని కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీ నిర్వహిస్తుంది. ఈ టెస్టు ద్వారా రెండేళ్ల వ్యవధి గల బీపీఈడి, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ / ప్రైవేటు / అనుబంధ కళాశాలల్లో అడ్మిషన్స్ ఇస్తారు.
➺ విద్యార్హత :
- బీపీఈడీ కోర్సులో ప్రవేశానికి ఏదేని డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి
- అభ్యర్థుల వయస్సు 01 జూలై 2024 నాటికి 19 నిండి ఉండాలి
- డీపీఈడీ కోర్సులో ప్రవేశానికి ఏదేని గ్రూప్‌తో ఇంటర్ ఉత్తీర్ణత సాధించాలి.
- 01 జూలై 2024 నాటికి 16 సంవత్సరాలు నిండి ఉండాలి
➺ టిఎస్ పీఈసెట్ వివరాలు :
ఇందులో రెండు పార్ట్‌లుంటాయి.
పార్ట్ - 1
- ఫిజికల్ ఎఫిషియేన్స్ టెస్టు ఉంటుంది. దీనికి 400 మార్కులు ఉంటాయి. పురుషులకు 100 మీటర్ల పరుగు, 800 మీటర్ల పరుగు, 6 కేజీల పుట్టింగ్ ద షాట్, లాంగ్ జంప్ / హైజంప్ ఉంటుంది.
- మహిళలకు 100 మీటర్ల పరుగు, 400 మీటర్ల పరుగు, 4 కేజీల పుట్టింగ్ ద షాట్, లాంగ్ జంప్ / హైజంప్ ఉంటాయి. ఒక్కో ఈవెంట్‌కు 100 మార్కులుంటాయి.
Also Read :
పార్ట్ - 2
స్కిల్ టెస్టు ఉంటుంది. బాల్ బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, క్రికెట్, ఫుట్‌బాల్, హ్యాండ్‌బాల్, హాకీ, కబడ్డి, ఖోఖక్ష, షటీల్ బ్యాడ్మింటన్, టెన్నిస్, వాలీబాల్ క్రీడల్లో ఒకదానిలో అభ్యర్థి క్రీడా నైపుణ్యాన్ని పరీక్షిస్తారు. దీనికి 100 మార్కులుంటాయి. హర్ట్ సంబందిత సమస్యలు ఉన్నవారు, గర్భినిలు ఈ టెస్టులలో పాల్గొనడానికి అనర్హులు
➺ ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
ధరఖాస్తు ఫీజు :
- రూ॥900 /- (జనరల్)
- రూ॥500/- (ఎస్సీ/ఎస్టీ)
➺ ముఖ్యమైన తేదీలు :
- ధరఖాస్తులు ప్రారంభ తేది : 14 మార్చి 2024
- ధరఖాస్తులకు చివరి తేది : 15 మే 2024
- ఫిజికల్ ఎఫిషియేన్స్, స్కిల్ టెస్టులు : 10 నుండి 13 జూన్ 2024 వరకు
0 Comments