Gopal Krishna Gokhale Biography in Telugu | గోపాలకృష్ణ గోఖలే | Indian History in Telugu

Gopal Krishna Gokhale Biography in Telugu | గోపాలకృష్ణ గోఖలే

Gopal Krishna Gokhale Biography in Telugu | Indian History in Telugu  

గోపాలకృష్ణ గోఖలే భారత స్వాతంత్య్రం కొరకు పోరాడిన స్వాతంత్య్ర సమరయోధుడు. భారత జాతీయ కాంగ్రెస్‌లో  ముఖ్య పాత్ర పోషించిన నాయకుడు. గోపాలకృష్ణ గోఖలే 09 మే 1866న మహరాష్ట్ర, కోత్లుక్‌లో సాధారణ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. భారత స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్‌ పాలననుండి విముక్తి కోరుకునే భారతీయుల గొంతుకగా నిలిచాడు. ఇతని రాజకీయ గురువువైన ఎమ్‌.జి రనడే స్థాపించిన ఎడ్యూకేషన్‌ సోసైటీ లో ప్రముఖ పాత్ర పోషించాడు. గోఖలే గాంధీజీకి రాజకీయ గురువే కాకుండా ఖగోలశాస్త్రవేత్త, సంస్కృత పండితుడు. 1888-1892 మధ్య కాలంలో అగార్కర్‌ యొక్క ‘సుధాకర్‌’ అనే పత్రికకు సంపాదకుడిగా పనిచేశాడు. 1895 పూనా సార్వజనీక సభ యొక్క నాయకత్వం తిలక్‌ చేతుల్లోకి వెళ్లడంతో యం.జి రనడేతో కలిసి దక్కన్‌ సభను స్థాపించాడు. రాష్ట్ర సభ సమాచార్‌ అనే పత్రికను స్థాపించాడు. సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాటం చేసే ఉద్దేశ్యంతో 1905లో ‘‘సర్వేంట్స్‌ ఆఫ్‌ ఇండియా సోసైటీ’’ని స్థాపించాడు. 1905లో బెనారస్‌ లో జరిగిన జాతీయ కాంగ్రెస్‌ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఇతను నిర్భంద విద్య ప్రవేశపెట్టాలని కోరిన ప్రథమ వ్యక్తి. నిర్భంద ప్రాథమిక విద్యను బరోడ సంస్థానం మొదటిసారిగా ప్రవేశపెట్టింది. 

1911లో నిర్భంద ప్రాథమిక విద్యను (6 నుండి 14 సం॥లు) కల్పించాలని కేంద్ర శాసనసభలో తీర్మాణం ప్రవేశపెట్టగా అది చెల్లుబాటు కాలేదు. దీనినే గోఖలే తీర్మాణంగా పిలుస్తారు. ఇతనికి సోక్రటీస్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, ఆధునిక ప్రథమ రాజనీతిజ్ఞుడు, భారత జాతీయోద్యమ పితామహుడు, దేశభక్తులలో రారాజు అనే బిరుదులున్నాయి. దేశంలో ప్రాచీన ఆర్థిక శాస్త్ర విద్యాలయంగా పేరుగాంచిన గోఖలే ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పొలిటిక్స్‌ అండ్‌ ఎకనామిక్స్‌ మహారాష్ట్ర పుణెలోని జింఖానాలో కలదు. ఈయన తేది.19 ఫిబ్రవరి 1915న తుదిశ్వాస విడిచారు. 


పేరు గోపాల కృష్ణగోఖలే
విశిష్టత స్వాతంత్ర సమరయోధుడు
జననం 09 మే 1866
ప్రాంతం మహరాష్ట్రం
వృత్తి ప్రొఫెసర్‌, రాజకీయవేత్త
పొలిటికల్‌ పార్టీ ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌
సోసైటీ సర్వేంట్స్‌ ఆఫ్‌ ఇండియా
పత్రిక రాష్ట్రసభ సమాచార్‌
మరణం 19 ఫిబ్రవరి 1915

Post a Comment

0 Comments