
సౌర కుటుంబం (ఇండియా జీయోగ్రఫీ) జీకే ప్రశ్నలు - జవాబులు
Solar System Gk Questions in Telugu
☛ Question No.1
సూర్యునికి అత్యంత దగ్గరగా ఉన్న గ్రహం ఏది ?
ఎ) శుక్రుడు
బి) బుధుడు
సి) భూమి
డి) అంగారకుడు
జవాబు : బి) బుధుడు
☛ Question No.2
‘రెడ్ ప్లానెట్’ అని ఏ గ్రహాన్ని పిలుస్తారు ?
ఎ) బృహస్పతి
బి) శని
సి) అంగారకుడు
డి) బుధుడు
జవాబు : సి) అంగారకుడు
☛ Question No.3
బుధగ్రహంపై భ్రమణ కాలం ఎన్ని రోజులు ఉంటుంది ?
ఎ) 56.8
బి) 48.7
సి) 33.7
డి) 42.9
జవాబు : ఎ) 56.8
☛ Question No.4
ఏ గ్రహంపై జీవపరిశోధర కొరకు అమెరికా ‘‘క్యూరియాసిటీ’ అనే వాహక నౌకను పంపింది ?
ఎ) బృహస్పతి
బి) శని
సి) అంగారకుడు
డి) బుధుడు
జవాబు : సి) అంగారకుడు
☛ Question No.5
సౌర కుటుంబంలో అత్యధిక ఉపగ్రహాలు కల్గిన గ్రహంగా శని గ్రహం గుర్తింపు పొందింది. శనిగ్రహానికి ఎన్ని ఉప గ్రహాలున్నాయి ?
ఎ) 75
బి) 65
సి) 55
డి) 82
జవాబు : డి) 82
☛ Question No.6
ఈ క్రిందివాటిలో తోక చుక్కల గురించి సరైన వాక్యాలు గుర్తించండి ?
1) హేలీ తోకచుక్క 76 సంవత్సరాలకొకసారి భూమిని సమీపిస్తుంది
2) చివరిసారిగా 1986లో భూమికి దగ్గరగా వచ్చింది
3) ఇవి సూర్యుడి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో పరిభ్రమిస్తాయి
ఎ) 1, 2, 3
బి) 2 మరియు 3
సి) 1 మరియు 3
డి) 1 మరియు 2
జవాబు : ఎ) 1, 2, 3
Also Read :
☛ Question No.7
ఈ క్రిందివాటిలో ఉల్కల గురించి సరైన వాక్యాలు గుర్తించండి ?
1) ఇవి ప్రధానంగా ఇనుము, నికెల్ వంటి మూలకాలతో నిండి ఉంటాయి
2) భూమిని చేరే చిన్న పరిమాణంలో ఉండే ధూళి కణాలు / ఉల్క భాగాలను ఉల్కా ధూళి అంటారు
ఎ) 1 మాత్రమే
బి) 2 మాత్రమే
సి) 1 మరియు 2
డి) రెండూ కాదు
జవాబు : సి) 1 మరియు 2
☛ Question No.8
బుధ గ్రహంపై పగటి ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది ?
ఎ) 427 డిగ్రీల సెల్సియస్
బి) 327 డిగ్రీల సెల్సియస్
సి) 227 డిగ్రీల సెల్సియస్
డి) 127 డిగ్రీల సెల్సియస్
జవాబు : ఎ) 427 డిగ్రీల సెల్సియస్
☛ Question No.9
ఈ క్రిందివాటిలో యురేనస్ (వరుణ) గ్రహానికి సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి ?
1) ఈ గ్రహం మీథేన్ వాయువుతో నిండి ఉండడం వల్ల దీనిని ‘గ్రీన్ నెట్’, ‘గాడ్ ఆఫ్ ది స్కై’ అని పిలుస్తారు
2) దీని యొక్క పరిభ్రమణ కాలం 84 సంవత్సరాలు
3) దీనికి 27 ఉపగ్రహాలున్నాయి
ఎ) 1, 2, 3
బి) 2 మరియు 3
సి) 1 మరియు 3
డి) 1 మరియు 2
జవాబు : ఎ) 1, 2, 3
☛ Question No.10
నెప్ల్యూన్ గ్రహానికి సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి ?
1) ఇది 165 సంవత్సరాలలో సూర్యుడి చుట్టూ ఒకసారి పరిభ్రమిస్తుంది
2) ఇది సూర్యుడికి అత్యంత దూరంలో ఉండే అతిశీతల గ్రహం
3) దీని యొక్క వాతావరణం నీలిరంగులో ఉంటుంది
ఎ) 1 మరియు 2
బి) 2 మరియు 3
సి) 1 మరియు 3
డి) 1, 2, 3
జవాబు : డి) 1, 2, 3
☛ Question No.11
ధృవాల వద్ద భూమి యొక్క చుట్టు కొలత ఎంత ?
ఎ) 35486 కి.మీ
బి) 30256 కి.మీ
సి) 40,066 కి.మీ
డి) 50,116 కి.మీ
జవాబు : సి) 40,066 కి.మీ
☛ Question No.12
ఈ క్రిందివాటిలో ఏ గ్రహానికి ఉప గ్రహాలు లేవు ?
ఎ) అంగారకుడు
బి) శుక్రుడు
సి) శని
డి) యురేనస్
జవాబు : బి) శుక్రుడు
0 Comments