SBI Clerk Recruitment 2025
భారతదేశంలో ప్రధాన బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న జూనియర్ అసోసియేట్ (క్లరికల్ క్యాడర్) ఉద్యోగాల కోసం తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది.
దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 13,735 జూనియర్ అసోసియేట్ ( కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్) ఉద్యోగాల భర్తీకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ధరఖాస్తులను స్వీకరిస్తుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ధరఖాస్తులు చేసుకోవాలి. రెండు తెలుగు రాష్ట్రాలలో 392 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో తెలంగాణ సర్కిల్‌లో 342, ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌లో 50 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏదేని డిగ్రీ పూర్తి చేసిన / చివరి సంవత్సరం విద్యార్థులు ఆన్‌లైన్‌లో ధరఖాస్తు చేసుకోవాలి. అర్హులైన అభ్యర్థులు 07 జనవరి 2025 లోగా ధరఖాస్తులు చేసుకోవాలి. జూనియర్ అసోసియేట్ ప్రిలిమినరీ పరీక్షను ఫిబ్రవరి 2025 లో, మెయిన్ ఎగ్జామ్‌ను మార్చి/ఏప్రిల్ 2025 లో నిర్వహించనున్నారు.
➺ బ్యాంక్ పేరు :
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
➺ ఉద్యోగం పేరు :
- జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్)
Also Read :
➺ పోస్టులు :
- మొత్తం పోస్టులు 13,735 ఉన్నాయి. ఇందులో
- తెలంగాణ - 342
- ఆంధ్రప్రదేశ్ - 50
➺ అర్హత :
- ఏదేని డిగ్రీలో ఉత్తీర్ణత సాధించాలి
- డిగ్రీ ఫైనల్ / చివరి సెమిస్టర్ విద్యార్థులు కూడా ధరఖాస్తు చేసుకోవచ్చు
➺ వయస్సు :
01 ఏప్రిల్ 2024 నాటికి 20 నుండి 28 సంవత్సరాల వయస్సు ఉండాలి. (రిజర్వేషన్ ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది)
➺ ఎంపిక విధానం :
- ఆన్‌లైన్ పరీక్ష (ప్రిలిమినరీ, మెయిన్స్)
- స్థానిక భాష పరీక్ష ప్రావీణ్యం
➺ పరీక్ష విధానం :
- ఆన్‌లైన్
➺ ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
➺ ధరఖాస్తు ఫీజు :
- రూ॥750/- (జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్)
- ఫీజు లేదు (ఎస్సీ/ఎస్టీ/వికలాంగులు)
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది 07 జనవరి 2025
ప్రిలిమినరీ పరీక్ష : ఫిబ్రవరి 2025
మెయిన్స్ పరీక్ష : మార్చి / ఏప్రిల్ 2025
For Online Apply
0 Comments