AISSEE 2025 Sainik School Admissions, Online Apply, Eligibility, Age Limit, Fee || 6వ, 9వ తరగతి సైనిక్‌స్కూల్‌ అడ్మిషన్స్‌

 

AISSEE 2025 Sainik School Admissions,

AISSEE 2025 Sainik School Admissions, Online Apply, Eligibility, Age Limit, Fee 

6వ, 9వ తరగతి సైనిక్‌స్కూల్‌ అడ్మిషన్స్‌

నేషనల్‌ టెస్టింగ్‌ ఏజన్సీ ఆధ్వర్యంలో నిర్వహించే ఆలిండియా సైనిక్స్‌ స్కూల్‌ ఎంట్రన్స్‌ టెస్టు - 2025 నోటిఫికేషన్‌ విడుదల చేయడం జరిగింది. భారతదేశ వ్యాప్తంగా ఉన్న  పాఠశాలలో 6వ మరియు 9వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లకు ప్రవేశాల కోసం ధరఖాస్తులను ఆహ్వానిస్తుంది.

దేశవ్యాప్తంగా ఉన్న  సైనిక్స్‌ స్కూల్‌లలో భోదన పూర్తిగా ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది. ఇందులో చదువు పూర్తి చేసిన విద్యార్థులు నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ, ఇండియన్‌ నేవల్‌ అకాడమీ వంటి వాటిల్లో చేరేందుకు ప్రాధాన్యత ఉంటుంది.

➺ స్కూల్‌ పేరు :

  • ఆలిండియా సైనిక్‌ స్కూల్స్‌

తరగతులు :

  • 6వ
  • 9వ

➺ అర్హతలు :

6వ తరగతి ఎంట్రన్స్‌ టెస్టు

  • 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు
  • 31 మార్చి 2025 నాటికి 10 సంవత్సరాల నుండి 12 సంవత్సరాల వయస్సు ఉండాలి.

9వ తరగతి ఎంట్రన్స్‌ టెస్టు 

  • 8వ తరగతి చదువుతుండాలి 
  • 31 మార్చి 2025 నాటికి 13 నుండి 15 సంవత్సరాలు వయస్సు ఉండాలి 

ఏ విధంగా సీట్లు కేటాయిస్తారు ?

మొత్తం సీట్లలో 67 శాతం ఆ సైనిక్‌ స్కూల్‌ ఉన్న రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన విద్యార్థులకు కేటాయిస్తారు. మిగిలిన సీట్లను ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వారికి కేటాయిస్తారు.

➺ తెలుగు రాష్ట్రాల్లో ఏ స్కూల్లో ఎన్ని సీట్లు ఉన్నాయి ?

6వ తరగతిలో

  • కోరుకొండ - 93
  • కలికిరి - 105
  • అదానీ వరల్డ్‌ స్కూల్‌ - 80
9వ తరగతిలో
  • కోరుకొండ - 22
  • కలికిరి - 16
  • అదానీ వరల్డ్‌ స్కూల్‌ - 66

ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ ఎలా ఉంటుంది ?

6వ తరగతి

  • మొత్తం 300 మార్కులకు గాను 125 ప్రశ్నలకు 2.5 గంటల్లో సమాధానం ఇవ్వాలి.
  • మ్యాథ్స్‌ నుండి 50 ప్రశ్నలు, ఒక్కొ ప్రశ్నకు 3 మార్కులుంటాయి.
  • జీకే (సైన్స్‌, సోషల్‌) నుండి 25, లాంగ్వేజ్‌ నుండి 25, ఇంటెలిజెన్స్‌ నుండి 25 ప్రశ్నలకు సమాధానాలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు 2 మార్కులుంటాయి.

9వ తరగతి

  • మొత్తం 400 మార్కులకు గాను 150 ప్రశ్నలకు 3 గంటల్లో సమాధానం ఇవ్వాలి.
  • మ్యాథ్స్‌ నుండి 50 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు 4 మార్కులుంటాయి.
  • ఇంగ్లీష్‌, ఇంటెలిజెన్స్‌, జనరల్‌ సైన్స్‌, సోషల్‌ సైన్స్‌ ఒక్కో విభాగం నుండి 25 చొప్పున ప్రశ్నలుంటాయి. ఒక్కొ ప్రశ్నకు 2 మార్కులుంటాయి.
  • రెండు తరగతులకు నెగెటివ్‌ మార్కింగ్‌ ఉండదు.


Also Read :



➺ పరీక్షా ఫీజు :

  • రూ॥800/- (జనరల్‌ / డిఫెన్స్‌ ఉద్యోగుల, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ పిల్లలకు / ఓబీసీ )
  • రూ॥650/- (ఎస్సీ / ఎస్టీ)

➺ పరీక్షా  కేంద్రాలు :

తెలంగాణలో 

  • హైదరాబాద్‌ 
  • కరీంనగర్‌ 

ఆంధ్రప్రదేశ్‌లో 

  • అనంతపురం 
  • గుంటూర్‌ 
  • కడప
  • కర్నూలు 
  • నెల్లూర్‌ 
  • ఒంగోలు 
  • రాజమహేంద్రవరం 
  • శ్రీకాకుళం 
  • తిరుపతి 
  • విజయవాడ 
  • విశాఖపట్నం 
  • విజయనగరం 

➺ ముఖ్యమైన తేదీలు :

  • ఆన్‌లైన్‌ ధరఖాస్తులు ముగింపు - 23 జనవరి 2025

 

Post a Comment

0 Comments