Asaf jahi dynasty Gk Bits in telugu | Telangana History Gk Questions with Answers

asaf jahi dynasty Gk Bits in telugu

 Asaf jahi dynasty Gk Bits in telugu | Telangana History Gk Questions with Answers

అసఫ్‌జాహీలు

నిజాం రాజ్య పాలకులు గతంలో మొగలులు, కుతుబ్‌షాహీలు అనుసరించిన భూమి శిస్తు విధానాలను కొనసాగించారు.
అసఫ్‌జాహీలు
1)
అసఫ్‌జాహీల రాజ్యానికి చెందిన భూములను ఏమని పిలిచేవారు ?
దివానీ / ఖల్సా

2) దివానీ భూముల నుండి వచ్చే పన్నులను దేనికి ఉపయోగించేవారు ?
ప్రభుత్వం నడపడానికి

3) 1875లో దివానీ పద్దతిలో క్రమబద్దమైన సర్వే సెటిల్‌మెంట్‌ విధానం 1317 ఫసలీ చట్టం ద్వారా ఎవరు ప్రవేశపెట్టారు ?
సాలార్‌జంగ్‌ -1

4) రైత్వారీ విధానం అంటే ఏమిటీ ?
భూమి దున్నే రైతులకు యాజమాన్య హక్కులు కల్పించడం

5) హైదరాబాద్‌లో ఏ కోడ్‌ ప్రకారం రైతును అసలైన యజమానిగా గుర్తించారు ?
రెవెన్యూ కోడ్‌ 1879

6) రైత్వారీ విధానంలో పట్టాదారుకు ఏ హక్కులు కల్పించారు ?
విక్రయించడం లేదా తనఖా పెట్టడం

7) చట్టబద్దంగా సేద్య భూమిని వ్యక్తిగతంగా గాని, కూలీల ద్వారా గాని సేద్యం చేసే విధానం ఏమని పిలుస్తారు ?
పట్టాదారు విధానం

8) ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ రైతులు ఉత్పత్తి చేసిన వాటిలో భాగస్వామ్య కలిసి ఉండడాన్ని ఏమని పిలుస్తారు ?
పాత్‌పట్టాదారీ

9) ప్రభుత్వ భూములను కౌలుకు తీసుకొని శిస్తు చెల్లించే విధానాన్ని ఏమని పిలుస్తారు ?
పాన్‌మక్తా

10) వ్యవసాయ క్షేత్రాలు బ్రిటీష్‌వారికి దక్కకుండా, బీడు భూములను సాగులోకి తీసుకురావడానికి ప్రవేశపెట్టిన పద్దతి ఏది ?
ఇజారా పద్దతి

11) రాజుకు సేవ చేసినందుకు ప్రభుత్వ భూములను ఇచే విధానాన్ని ఏమని పిలుస్తారు ?
వతన్‌

12) నిజాం రాజు సొంత ఖర్చుల కోసం కేటాయించిన భూమిని ఏమని పిలుస్తారు ?
సర్ఫేఖాస్‌

13) సర్ఫేఖాస్‌ భూములను ఎవరు పర్యవేక్షిస్తాడు ?
సర్దార్‌ - ఉల్‌ - మహమ్‌ అనే అధికారి

14) సర్ఫేఖాస్‌ భూములను ఎన్ని రకాలుగా విభజించారు.
రెండు
ముఫ్‌వాజా (అప్పగించిన భూములు)
జేర్‌నిగరాని (పర్యవేక్షించే తాలూకాలు)

15) నిజాం నవాబుకు, ప్రభుత్వానికి సేవచేసిన వారికి ఇచ్చే భూములను ఏమని పిలుస్తారు ?
జాగీర్లు

16) నిజాం రాజు మొత్తం భూభాగంలో ఎంత శాతం జాగీర్దార్లకు ఇచ్చాడు ?
40 శాతం 

 

Also Read :



17) జాగీర్దారు తన జాగీరులో పన్నులు వసూలు చేసి దేనికి ఉపయోగించేవారు ?
శాంతిభద్రతలు, సైన్యం

18) పాయిగా జాగీరు / జాగిరత్‌ - ఇ - నిగదిస్తు జామతి ఏ రకం జాగీరు ?
ఇది ఒక సైనిక జాగీరు 

 
19) భూమి శిస్తులేని జాగీరుగా పేరొందిన ఆల్‌తుమ్‌గా జాగీర్‌ను ఏ విధంగా కేటాయిస్తారు ?
రాజు ముద్ర

20) జాట్‌ జాగీర్‌ / ఖాన్‌కా జాగీరులు అంటే ఏమిటీ ?
నిజాం కోసం జీవితాంతం సేవ చేసే వారికి కేటాయించే భూములు

21) ఉమ్రా - ఇ - అజమ్‌ జాగీరు / ఇలాఖాను ఎన్ని రకాలుగా విభజించారు
నాలుగు
సాలార్‌జంగ్‌
మహారాజా శ్రీ కిషన్‌ ప్రసాద్‌
నవాబ్‌ ఖానీ ఖానన్‌
నవాబ్‌ ఫఖుర్‌-ఉల్‌-ముల్క్‌

22) ఈ నాలుగు ఇలాఖాల్లో ఎన్ని గ్రామాలు ఉండేవి ?
769

23) ఈ నాలుగు ఇలాఖాల్లో పెద్ద ఇలాఖా ఏది ?
నవాబ్‌ సలార్‌జంగ్‌ (1126 చ.మైళ్లు, 359 గ్రామాలు)

24) మశ్రుతి జాగీర్లు దేనికి చెందినవి ?
రాజ్యంలో ప్రజలు, సైనికులు, మతం కోసం పనిచేసే వ్యక్తులకు ఇచ్చేవి

25) ఇనాం భూములు దేనికి చెందినవి ?
బహుమతిగా ఇచ్చిన భూమి లేదా భూమిశిస్తు

26) వెట్టి అంటే ఏమిటీ ?
బలవంతంగా, వేతనాలు లేకుండా పనిచేయించడం 


27) బగేలా / వెట్టి చాకిరి పద్దతి అంటే ఏమిటీ ?
తీసుకున్న అప్పు తీరే వరకు కుటుంబంలో ఒక వ్యక్తి దేశ్‌ముఖ్‌ లేదా దేశ్‌పాండే ఇంట్లో పనిచేయడం

28) చార్టర్‌ చట్టం ఎప్పుడు ప్రవేశపెట్టారు ?
1813

29) చార్టర్‌ చట్టం దేని కోసం ప్రవేశపెట్టడం జరిగింది ?
దేశంలో క్రిస్టియన్‌ మిషనరీల ప్రచారం, ఈస్టిండియా కంపెనీ ఏకస్వామ్య రద్దు, బ్రిటిష్‌ కంపెనీలకు వ్యాపారం సులభతరం చేయడం కోసం

30) చార్టర్‌ చట్టం ప్రవేశపెట్టినప్పుడు గవర్నర్‌ జనరల్‌గా ఎవరు పనిచేశారు ?
లార్డ్‌ మింటో

31) సతీసహగమన నిషేద చట్టం ఎప్పుడు ప్రవేశపెట్టారు ?
1829

32) సతీసహగమన నిషేద చట్టం ప్రవేశపెట్టినప్పుడు గవర్నర్‌ జనరల్‌గా ఎవరు పనిచేశారు ?
లార్డ్‌ విలియం బెంటిక్‌


Also Read :


Post a Comment

0 Comments