Telangana Prachina Kavulu Gk Questions with Answers | Telangana History in Telugu

Telangana Prachina Kavulu Gk Questions with Answers | Telangana History in Telugu

తెలంగాణ ప్రాచీన కవులు  జీకే ప్రశ్నలు - జవాబులు Part -2

Telangana Prachina Kavulu Gk Questions with Answers

☛ Question No.1
పాల్కురికి సోమనాథుడు ఏ కాలానికి చెందిన వారు ?
ఎ) 1170 - 1230
బి) 1160 - 1240
సి) 1240 - 1320
డి) 1340 - 1420

జవాబు : బి) 1160 - 1240

☛ Question No.2
పాల్కురికి సోమనాథునికి ఏయే బిరుదులు  కలవు ?
ఎ) ప్రథమాంధ్ర విప్లవ కవి
బి) దేశీ కవిత్వోద్యమ పితామహుడు
సి) ఎ మరియు బి
డి) ఏవీకావు

జవాబు : సి) ఎ మరియు బి

☛ Question No.3
‘తెలంగాణ ఆదికవి’ గా ఎవరు గుర్తింపు సాధించారు ?
ఎ) పాల్కురికి సోమనాథుడు
బి) గోన బుద్ధారెడ్డి
సి) పోతన
డి) మారన

జవాబు : ఎ) పాల్కురికి సోమనాథుడు

☛ Question No.4
తొలి దేశీ స్వతంత్ర పురాణం మరియు తొలి తెలుగు సాంఘిక కావ్యంగా ఏ రచన గుర్తింపు సాధించింది ?
ఎ) పండితారాధ్య చరిత్ర
బి) రంగనాథ రామాయణం
సి) వీరభద్ర విజయం
డి) బసవ పురాణం

జవాబు : డి) బసవ పురాణం

☛ Question No.5
తొలి తెలుగు విజ్ఞాన సర్వస్వంగా ఏ రచనను విమర్శకులు ప్రశంసించారు ?
ఎ) రంగనాథ రామాయణం
బి) మల్లమదేవి పురాణం
సి) మార్కండేయ పురాణం
డి) పండితారాధ్య చరిత్ర

జవాబు : డి) పండితారాధ్య చరిత్ర

☛ Question No.6
బద్దెన కవి ఏ శతాబ్దానికి చెందిన కవి ?
ఎ) 12వ శతాబ్దం
బి) 11వ శతాబ్దం
సి) 13వ శతాబ్దం
డి) 15వ శతాబ్దం

జవాబు : సి) 13వ శతాబ్దం



☛ Question No.7
బద్దెన కవి ఎవరికి సామంతరాజుగా పనిచేశాడు ?
ఎ) శాతవాహనులు
బి) కాకతీయులు
సి) రాష్ట్రకుటులు
డి) విష్ణుకుండినిలు

జవాబు : బి) కాకతీయులు

☛ Question No.8
గొప్ప రాజనీతి గ్రంథంగా ప్రసిద్ది చెందిన గ్రంథం ఏది ?
ఎ) పండితారాధ్య చరిత్ర
బి) రంగనాథ రామాయణం
సి) నీతి శాస్త్ర ముక్తావళి
డి) బసవ పురాణం

జవాబు : సి) నీతి శాస్త్ర ముక్తావళి

☛ Question No.9
ఈ క్రిందివాటిలో గోన బుద్ధారెడ్డి బిరుదులు  ఏవి ?
ఎ) కవి కల్పతరువు
బి) కవిలోక భోజుడు
సి) ఎ మరియు బి
డి) ఏవీకావు

జవాబు : సి) ఎ మరియు బి

☛ Question No.10
ఈ క్రిందివాటిలో గోన బుద్ధారెడ్డి రచించిన గ్రంథం ఏది ?
ఎ) బసవ పురాణం
బి) రంగనాథ రామాయణం
సి) వీరభద్ర విజయం
డి) మహాభాగవతం ‌

జవాబు : బి) రంగనాథ రామాయణం

☛ Question No.11
 తెలుగులో వచ్చిన రామాయణ కావ్యాల్లో మొదటిది ఏది ?
ఎ) పండితారాధ్య చరిత్ర
బి) బసవ పురాణం
సి) నీతి శాస్త్ర ముక్తావళి
డి) రంగనాథ రామాయణం

జవాబు : డి) రంగనాథ రామాయణం

☛ Question No.12
ఈ క్రిందివాటిలో మారన రచన ఏది ?
ఎ) మార్కండేయ పురాణం
బి) భోగినీ దండకం
సి) శృంగార శాకుంతలం
డి) బసవ పురాణం

జవాబు : ఎ) మార్కండేయ పురాణం ‌


Also Read :


☛ Question No.13
ఈ క్రిందివాటిలో పోతన బిరుదులు ఏవి ?
ఎ) సహాజ పండితుడు
బి) నిగర్వ చూడామణి
సి) ఎ మరియు బి
డి) ఏవీకావు

జవాబు : సి) ఎ మరియు బి ‌

☛ Question No.14
ఈ క్రిందివాటిలో పోతన రచన కానిది ఏది ?
ఎ) వీరభద్ర విజయం
బి) నారాయణ శతకం
సి) మహాభాగవతం
డి) జైమినీ భారతం

జవాబు :డి) జైమినీ భారతం ‌

☛ Question No.15
పోతన భాగవతాన్ని ఎవరికి అంకితమిచ్చాడు ?
ఎ) తల్లిదండ్రులు
బి) శ్రీరామచంద్రుడు
సి) గురువు
డి) కృష్ణుడు

జవాబు : బి) శ్రీరామచంద్రుడు ‌

☛ Question No.16
శ్రీకృష్ణుని బాల్య క్రీడలు భాగవతంలోని ఏ స్కంధంలో ఉన్నాయి ?
ఎ) ఏకాదశ
బి) ద్వాదశ
సి) షష్ఠమ
డి) దశమ ‌

జవాబు : డి) దశమ ‌

☛ Question No.17
ఈ క్రిందివాటిలో పిల్లలమర్రి పిన  వీరభద్రుడు రచనలు ఏవి ?
ఎ) శృంగార శాకుంతలం
బి) జైమినీ భారతం
సి) ఎ మరియు బి
డి) ఏవీకావు

జవాబు : సి) ఎ మరియు బి ‌

☛ Question No.18
ఈ క్రిందివాటిలో చరిగొండ ధర్మన్న రచన ఏది ?
ఎ) చిత్ర భారతం
బి) రాఘవ యాదవ పాండవీయం
సి) దాశరథీ కీర్తనలు
డి) యయాతి చరిత్ర

జవాబు : ఎ) చిత్ర భారతం ‌

☛ Question No.19
ఈ క్రిందివాటిలో అద్దంకి గంగాధరడు రచన ఏది ?
ఎ) శ్రీరంగ శతకం
బి) బసవ పురాణం
సి) నీతి శాస్త్ర ముక్తావళి
డి) రంగనాథ రామాయణం

జవాబు : డి) రంగనాథ రామాయణం ‌

☛ Question No.20
తెలుగు కావ్యాలను అంకితమిచ్చిన ప్రథమ కవి ఎవరు ?
ఎ) పిల్లలమర్రి పినవీరభద్రుడు
బి) అద్దంకి గంగాధరుడు
సి) చరిగొండ ధర్మన్న
డి) పొన్నికంటి తెలగన

జవాబు : బి) అద్దంకి గంగాధరుడు ‌

☛ Question No.21
ఈ క్రింది వాటిలో పొన్నికంటి తెలగన రచన ఏది ?
ఎ) శృంగార శాకుంతలం
బి) జైమినీ భారతం
సి) యయాతి చరిత్ర
డి) ఏవీకావు

జవాబు : సి) యయాతి చరిత్ర ‌

☛ Question No.22
ఈ క్రిందవాటిలో సరైన దానికి గుర్తించండి ?
1) పొన్నికంటి తెలగన రచించిన యయాతి చరిత్ర తొలి అచ్చ తెలుగు కావ్యంగా గుర్తింపు లభించింది
2) అద్దంకి గంగాధరుడు రచించిన తపతీ సంవరణోపాఖ్యానం ఇబ్రహీం కుతుబ్‌షాకు అంకితమించ్చాడు.
3) మహమ్మదీయ ప్రభువులకు తెలుగు కావ్యాలను అంకితమిచ్చిన తొలి కవి అద్దంకి గంగాధరుడు

ఎ) 1 మరియు 2
బి) 1, 2 మరియు 3
సి) 1 మాత్రమే
డి) 2 మరియు 3

జవాబు : బి) 1, 2 మరియు 3 ‌

☛ Question No.23
ఈ క్రిందవాటిలో సరైన దానికి గుర్తించండి ?
1) కురుక్షేత్రం తర్వాత ధర్మరాజు చేసిన అశ్వమేథ యాగం గురించి జైమిని మహర్షి జనమేయుడికి చెప్పిన కథ  ‘‘జైమిని భారతం’’
2) క్రీ.శ 1848లో పురాణం హయగ్రీవ శాస్త్రులు తొలిసారిగా భాగవతాన్ని ముద్రించారు.
3) గోన బుద్ధారెడ్డి నిజాం రాష్ట్రంలోని రాయచూరు ప్రాంతాన్ని పాలించినట్లు ‘బూదపూరు, రాయచూరు’ శాసనాలు తెలుపుతున్నాయి.

ఎ) 1 మరియు 2
బి) 2 మాత్రమే
సి) 1 మాత్రమే
డి) 1, 2 మరియు 3

జవాబు : డి) 1, 2 మరియు 3 ‌

☛ Question No.24
ఈ క్రింది వాటిని జతపరచండి ?
1) పాల్కురికి సోమనాథుడు
2) గోన బుధ్దారెడ్డి
3) బద్దెన
4) పిల్లలమర్రి పినవీరభుద్రుడు

ఎ) శృంగార శాకుంతలం
బి) రంగనాథ రామాయణం
సి) బసవరగడ
డి) సుమతీ శతకం

ఎ) 1-డి, 2-ఎ, 3-సి, 4-బి
బి) 1-ఎ, 2-డి, 3-బి, 4-సి
సి) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ
డి) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి

జవాబు : సి) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ ‌

☛ Question No.25
24) ఈ క్రింది వాటిని జతపరచండి ?
1) పోతన
2) చరిగొండ ధర్మన్న
3) అద్దంకి గంగాధరుడు
4) పొన్నికంటి తెలగన

ఎ) 1525 - 1585
బి) 1420 - 1480
సి) 1480 -1530
డి) 1520 - 1580

ఎ) 1-డి, 2-ఎ, 3-సి, 4-బి
బి) 1-ఎ, 2-డి, 3-బి, 4-సి
సి) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ
డి) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి

జవాబు : డి) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి ‌


Also Read :



Post a Comment

0 Comments