ఐక్యరాజ్యసమితిలో విటో అధికారం గల దేశాలు ఎన్ని ?
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ప్రారంభంలో 11 దేశాలు సభ్యదేశాలుగా ఉండేవి. వీటిని 1965 సంవత్సరంలో 15కు పెంచారు. ప్రస్తుతం ఇందులో 15 సభ్యదేశాలుగా ఉన్నాయి. ఇందులో విటో అధికారంతో శాశ్వత సభ్యదేశాలుగా 5 ఉన్నాయి. అవి.
- చైనా
- ఫ్రాన్స్
- రష్యా
- బ్రిటన్
- అమెరికా లు ఉన్నాయి.
తాత్కాలిక సభ్యులుగా 10 దేశాలున్నాయి.ఇవి సాధారణ సభచే 2 సంవత్సరాలకు ఒకసారి 2/3 వంతు మెజారీటితో ఎన్నికవుతాయి. భద్రతామండలికి భారత్ ఇప్పటివరకు 7సార్లు తాత్కాలిక సభ్యదేశంగా ఏర్పడినది. భత్రామండలి అధ్యక్ష పదవిని సభ్యదేశాలు ఆంగ్ల వర్ణమాల ప్రకారం రోటేషన్ పద్దతిలో నెలకొకసారి నిర్వహిస్తాయి
0 Comments