North America Continent | World Geography | North America Continent Countries
ఉత్తర అమెరికా ఖండం
ఉత్తర అమెరికా ఖండాలన్నింటిలో మూడవ అతిపెద్ద ఖండం. ఈ ఖండం భూమి యొక్క ఉత్తర, పశ్చిమార్ధ గోళాల్లో విస్తరించి ఉంది. ఉత్తర అమెరికా దాదాపు 2,47,09,000 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది. భారత భూభాగంతో పోలిస్తే ఉత్తర అమెరికా ఖండం 8 రెట్లు పెద్దదిగా ఉంటుంది. ప్రపంచ జనాభాతో పోలిస్తే నాలుగవ అతిపెద్ద ఖండం ఉత్తర అమెరికా.
ఉత్తర అమెరికా ఖండంలో న్యూయార్క్, లాస్ ఏంజెల్స్, వాషింగ్టన్ డీసీ, టోరంటో, మెక్సికో సిటీ వంటి ముఖ్యమైన నగరాలు ఉన్నాయి. ఉత్తర అమెరికా ఖండం 7 డిగ్రీల నుండి 83 డిగ్రీ ఉత్తర అక్షాంశాల మధ్య, 12 డిగ్రీల నుండి 172 డిగ్రీల రేశాంశాల మధ్య విస్తరించి ఉంది. ఉత్తర అమెరికా ఖండానికి ఉత్తరాన ఆర్కిటిక్ మహాసముద్రం, తూర్పున అట్లాంటిక్ మహాసముద్రం, పడమరన పసిఫిక్ మహాసముద్రం, దక్షిణాన మెక్సికోలు కలవు. మెక్సికో, సెంట్రల్ అమెరికా, వెస్టిండీస్ దీవులు, దక్షిణ అమెరికాలను కలిపి ‘‘లాటిన్ అమెరికా’’ దేశాలు అంటారు.
ఉత్తర అమెరికా ఖండానికి సంబంధించి ముఖ్యాంశాలు :
- ప్రపంచంలో పొడవైన తీర రేఖ కల్గిన దేశం కెనడా.
- ప్రపంచ ‘‘సిలికాన్ వ్యాలి’’ ‘‘గోల్డెన్ సిటీ’’ అని శాన్‌ఫ్రాన్సిస్కోని పిలుస్తారు.
- హాలీవుడ్ సినీపరిశ్రమ లాస్ ఏంజెల్స్‌లో కలదు.
- ప్రపంచంలో అత్యంత రద్దీ విమానాశ్రయం చికాగో.
- ‘‘ఆక్రాన్’’ లో ప్రపంచ అతిపెద్ద సింథటిక్ రబ్బర్, టైర్ల తయారీ కేంద్రం కలదు.
- రాఖీ పర్వతాలు కెనడా, యు.ఎస్.ఏ, మెక్సికోల్లో విస్తరించి ఉన్నాయి.
దేశాలు :
- యు.ఎస్.ఏ
- కెనడా
- మెక్సికో
- అంటిగ్వా
- బార్బడోస్
- బెలిజ్
- కోస్టారికా
- క్యూబా
- డొమినికా
- సాల్వేడార్
- గ్వాటిమాల
- హైతి
- హోండరూస్
- జమైకా
- నిగరాగ్వా
- పనామా
- సెయింట్ లుసియా
- ట్రినినాడ్ అండ్ టొబాగో
- సెయింట్ విన్సెంట్
0 Comments