A. P. J. Abdul Kalam Biography in Telugu
ఏపీజే అబ్దుల్ కలాం
భారతదేశానికి చెందిన ప్రముఖ శాస్త్రవేత్తల్లో అబ్దుల్ కలాం ఒకరు. ఈయన భారత శాస్త్ర సాంకేతికత, విజ్ఞాన శాస్త్ర రంగాల పురోగతికి ఎంతగానో కృషిచేశారు. అంతరిక్ష, రక్షణ రంగాల్లో వివిధ పరిశోధనలు చేసి క్షిపణి, అణ్వాయుధ అభివృద్దిలో ముఖ్యపాత్ర పోషించారు. భారతదేశ మొదటి స్వదేశీ లాంచ్ వెహికల్ అయిన ఎస్‌ఎల్‌వీ`3, బాలిస్టిక్ మిస్సైల్స్ ను రూపకల్పన చేయడంలో కీలకపాత్ర పోషించారు. ఇస్రో, డిఆర్‌డివో అభివృద్దికి తనవంతు కృషి చేశారు. ఆయన్ను ‘‘మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా పిలుస్తారు. శాస్త్రవేత్తగానే కాక రాష్ట్రపతిగానూ పనిచేసి ‘పీపుల్స్ ప్రెసిడెంట్’ అనే కీర్తిని సాధించారు.
అబ్దుల్ కలాం 15 అక్టోబర్ 1931 తమిళనాడులోని రామేశ్వరంలో జన్మించారు. ఈయన పూర్తి పేరు అవుల్ పకీర్ జైనలుద్దీన్ అబ్దుల్ కలాం. ప్రాథమిక విద్యను రామేశ్వరంలో అభ్యసించారు. 1954లో తిరుచిరాపల్లిలోని సెయింట్ జోసెఫ్ కళాశాల నుండి భౌతికశాస్త్రంలో ఉత్తీర్ణులయ్యారు. 1955లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ మద్రాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పూర్తి చేశారు.
రాష్ట్రపతి అయిన మొదటి శాస్త్రవేత్తగా, ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండా ఆ పదవి చేపినట్టిన తొలి వ్యక్తిగా, సుఖోయ్ యుద్ధవిమానంలో ప్రయాణించిన తొలి రాష్ట్రపతిగా పేరుగాంచారు. భారతదేశ ప్రతిష్టాత్మక అవార్డు అయిన భారతరత్న పురస్కారం పొందారు. ఈయన 27 జులై 2015న మరణించినారు.

0 Comments