AISSEE All India Sainik School Admissions, Online Apply, Eligibility, Age Limit, Fee
6వ, 9వ తరగతి సైనిక్‌స్కూల్ అడ్మిషన్స్
త్రివిధ
దళాలలో పనిచేయాలనే ఆసక్తి ఉన్న విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచే
సిద్ధంచేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సైనిక పాఠశాలల్లో
2026-2027 విద్యా సంవత్సరానికి సంబంధించి 6వ, 9వ తరగతుల్లో అడ్మిషన్లకు
ఆలిండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నోటిఫికేషన్ విడుదలైంది.
అడ్మిషన్ టెస్టు ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఈ పరీక్షను
ఎన్‌టీఏ నిర్వహిస్తుంది.
దేశవ్యాప్తంగా ఉన్న సైనిక్స్ స్కూల్‌లలో భోదన పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. ఇందులో చదువు పూర్తి చేసిన విద్యార్థులు నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఇండియన్ నేవల్ అకాడమీ వంటి వాటిల్లో చేరేందుకు ప్రాధాన్యత ఇస్తారు.
దేశవ్యాప్తంగా ఉన్న సైనిక్స్ స్కూల్‌లలో భోదన పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. ఇందులో చదువు పూర్తి చేసిన విద్యార్థులు నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఇండియన్ నేవల్ అకాడమీ వంటి వాటిల్లో చేరేందుకు ప్రాధాన్యత ఇస్తారు.
➺ స్కూల్ పేరు :
- ఆలిండియా సైనిక్ స్కూల్స్
➺ తరగతులు :
- 6వ
- 9వ
➺ అర్హతలు :
6వ తరగతి ఎంట్రన్స్ టెస్టు
- 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు
- 31 మార్చి 2026 నాటికి 10 సంవత్సరాల నుండి 12 సంవత్సరాల వయస్సు ఉండాలి.
9వ తరగతి ఎంట్రన్స్ టెస్టు
- 8వ తరగతి చదువుతుండాలి
- 31 మార్చి 2026 నాటికి 13 నుండి 15 సంవత్సరాలు వయస్సు ఉండాలి
➺ ఏ విధంగా సీట్లు కేటాయిస్తారు ?
మొత్తం సీట్లలో 67 శాతం ఆ సైనిక్ స్కూల్ ఉన్న రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన విద్యార్థులకు కేటాయిస్తారు. మిగిలిన సీట్లను ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వారికి కేటాయిస్తారు.➺ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది ?
6వ తరగతి
- మొత్తం 300 మార్కులకు గాను 125 ప్రశ్నలకు 2.5 గంటల్లో సమాధానం ఇవ్వాలి.
- మ్యాథ్స్ నుండి 50 ప్రశ్నలు, ఒక్కొ ప్రశ్నకు 3 మార్కులుంటాయి.
- జీకే (సైన్స్, సోషల్) నుండి 25, లాంగ్వేజ్ నుండి 25, ఇంటెలిజెన్స్ నుండి 25 ప్రశ్నలకు సమాధానాలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు 2 మార్కులుంటాయి.
9వ తరగతి
- మొత్తం 400 మార్కులకు గాను 150 ప్రశ్నలకు 3 గంటల్లో సమాధానం ఇవ్వాలి.
- మ్యాథ్స్ నుండి 50 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు 4 మార్కులుంటాయి.
- ఇంగ్లీష్, ఇంటెలిజెన్స్, జనరల్ సైన్స్, సోషల్ సైన్స్ ఒక్కో విభాగం నుండి 25 చొప్పున ప్రశ్నలుంటాయి. ఒక్కొ ప్రశ్నకు 2 మార్కులుంటాయి.
- రెండు తరగతులకు నెగెటివ్ మార్కింగ్ ఉండదు.
Also Read :
➺ పరీక్షా ఫీజు :
- రూ॥850/- (జనరల్ / డిఫెన్స్ ఉద్యోగుల, ఎక్స్ సర్వీస్‌మెన్ పిల్లలకు / ఓబీసీ )
- రూ॥700/- (ఎస్సీ / ఎస్టీ)
➺ పరీక్షా కేంద్రాలు :
తెలంగాణలో
- హైదరాబాద్
- కరీంనగర్
ఆంధ్రప్రదేశ్‌లో
- అనంతపురం
- గుంటూర్
- కడప
- కర్నూలు
- నెల్లూర్
- ఒంగోలు
- రాజమహేంద్రవరం
- శ్రీకాకుళం
- తిరుపతి
- విజయవాడ
- విశాఖపట్నం
- విజయనగరం
➺ ముఖ్యమైన తేదీలు :
- ఆన్‌లైన్ ధరఖాస్తులు ముగింపు - 30 అక్టోబర్ 2025
- పరీక్షా తేదీ : జనవరి 2026
For Online Apply

0 Comments