Digestive System in Different Animals | General Science
జంతువులలో జీర్ణవ్యవస్థ నిర్మాణం సరళం నుండి సంక్లిష్టత వరకు పరిణామక్రమంలో మారుతూ వస్తుంది. ప్రోటోజోవా, పొరిఫెరా వంటి ప్రాథమిక జీవుల్లో కణాంతర జీర్ణక్రియ (ఇంట్రాసెల్యులర్ డైజెషన్) జరుగుతుంది. నిడేరియా, ప్లాటిహెల్మింతిస్ వంటి జీవుల్లో గాస్ట్రోవాస్క్యూలర్ కేవిటీ ద్వారా ఎక్స్‌ట్రాసెల్యులర్ మరియు ఇంట్రాసెల్యులర్ రెండు రకాల జీర్ణక్రియలు జరుగుతాయి. నెమటోడా, అనెలిడా జీవుల్లో పూర్తిస్థాయి ట్యూబులర్ జీర్ణవ్యవస్థ ఉండి, ఆహారం ఒకే దిశలో కదులుతూ ప్రత్యేక అవయవాల ద్వారా జీర్ణం అవుతుంది. ఎఖైనోడర్మేటా జీవుల్లో సరళ గొట్టంలా ఉన్న జీర్ణనాళం ఎక్స్‌ట్రాసెల్యులర్ జీర్ణక్రియను నిర్వహిస్తుంది.
మొలస్కా, ఆర్థ్రోపోడా వంటి జీవుల్లో ట్యూబులర్ జీర్ణవ్యవస్థ అధిక అనుకూలతలను ప్రదర్శిస్తుంది, వీటిలో జీర్ణక్రియ కణాంతర, కణబాహ్య రెండు విధాలుగా జరుగుతుంది. కార్డేటా లేదా వర్టిబ్రేట్లలో జీర్ణవ్యవస్థ అత్యంత సంక్లిష్టంగా ఉంటుంది. చేపలలో సరళ ట్యూబులర్ జీర్ణవ్యవస్థ ఉండగా, ఉభయచరాలు, సర్పాలు, పక్షులు, క్షీరదాలలో జీర్ణక్రియకు ప్రత్యేక అవయవాలు అభివృద్ధి చెందాయి — పక్షుల్లో క్రాప్, గిజ్జార్డ్ వంటి భాగాలు వేగవంతమైన జీర్ణక్రియకు సహకరిస్తాయి. ఈ విధంగా, జీవుల్లో జీర్ణవ్యవస్థలు పరిణామక్రమంలో క్రమంగా సంక్లిష్టమై, జీవుల ఆహారపు అలవాట్లకు అనుగుణంగా అభివృద్ధి చెందాయి.
జంతువులలో జీర్ణవ్యవస్థ
| జంతు సమూహం | జీర్ణవ్యవస్థ రకం / నిర్మాణం | జీర్ణక్రియ రకం | ఉదాహరణలు | ఉదాహరణలు |
|---|---|---|---|---|
| పొరిఫెరా (స్పాంజెస్) | నిజమైన జీర్ణవ్యవస్థ లేదు; చానల్ నెట్‌వర్క్ ద్వారా జీర్ణక్రియ |
కణాంతర (ఇంట్రాసెల్యులర్) |
నీటి ఛానల్స్, ప్లాజెల్లా కణాలు, పిల్టర్ ఫీడింగ్ |
స్పాంజ్ |
| ప్రోటోజోవా | ఏకకణ జీర్ణవ్యవస్థ; కణాంతర జీర్ణక్రియ |
ఇంట్రాసెల్యులర్ | ఆహార రిక్తికలు, లైసోజోమ్స్, ఫాగోసైటోసిస్ |
అమీబా, ప్యారమీషియం |
| నిడేరియా, టీనోఫోరా | గాస్ట్రోవాస్క్యూలర్ కేవిటీ |
ఎక్స్‌ట్రాసెల్యులర్ + ఫాగోసైటోసిస్ |
గాస్ట్రోడెర్మల్ కణాలు, ఒకే తెరుచుకొనే రంధ్రం |
హైడ్రా, జెల్లీఫిష్, కోరల్ |
| ప్లాటిహెల్మింథిస్ (ప్లాట్ వార్మ్స్) |
శాఖలాకార గాస్ట్రోవాస్క్యూలర్ కేవిటీ |
ఇంట్రా + ఎక్స్‌ట్రాసెల్యులర్ |
నోరు, గ్రసని, శాఖీభవనం ద్వారా పోషక విస్తరణ |
ప్లనేరియా |
| నెమటోడా (రౌండ్ వార్మ్స్) |
సరళ ట్యూబులర్ సిస్టమ్ |
ఎక్స్‌ట్రాసెల్యులర్ | నోరు నుండి పాయువు వరకు ఒకే దిశలో జీర్ణక్రియ |
ఆస్కారిస్ |
| అనెలిడా (సెగ్మెంటెడ్ వార్మ్స్) |
సంపూర్ణ ట్యూబులర్ అలిమెంటరీ కెనాల్ |
ఎక్స్‌ట్రాసెల్యులర్ | నోరు, ఫారింక్స్, ఈసోఫాగస్, క్రాప్, గిజ్జార్డ్, ఇంటెస్లైన్, పాయువు |
ఎర్త్‌వార్మ్ |
| మొలస్కా | ట్యూబులర్ జీర్ణవ్యవస్థ |
ఇంట్రా + ఎక్స్‌ట్రాసెల్యులర్ |
రాడ్యులా, జీర్ణాశయం, ఇంటెస్లైన్, గిల్స్ |
స్నైల్, స్క్విడ్ |
| ఆర్థ్రోపోడా | సంక్లిష్ట ట్యూబులర్ సిస్టమ్ | ప్రధానంగా ఎక్స్‌ట్రాసెల్యులర్ |
మౌత్‌పార్ట్స్, జీర్ణాశయం, మాల్పీజియన్ ట్యూబ్స్ |
రొయ్య, సాలీడు |
| ఎఖైనోడర్మేటా | గొట్టం లేదా శాఖాయుత జీర్ణవ్యవస్థ |
ఎక్స్‌ట్రాసెల్యులర్ | నోరు, ఉదరం, పేగు, పాయువు |
స్టార్ ఫిష్ |
| కార్డేటా (వర్టిబ్రేట్స్) | అత్యంత పరిణితి చెందిన ట్యూబులర్ వ్యవస్థ |
ఎక్స్‌ట్రాసెల్యులర్ | నోరు, జీర్ణశయం, చిన్నపేగు, పాయువు/క్లోయాకా; పక్షుల్లో క్రాప్, గిజ్జార్డ్ |
చేపలు, పాములు, పక్షులు, క్షీరదాలు |

0 Comments