Prasanta Chandra Mahalanobis Biography in Telugu | ప్రశాంత చంద్ర మహాలనోబిస్‌ | Biography in Telugu

Prasanta Chandra Mahalanobis Biography

 Prasanta Chandra Mahalanobis 

ప్రశాంత చంద్ర మహాలనోబిస్‌ 

పూర్తి పేరు: ప్రశాంత చంద్ర మహాలనోబిస్‌ (Prasanta Chandra Mahalanobis)

జననం: 1893 జూన్‌ 29, కోల్‌కతా (కలకత్తా)

➺  విద్య:

  •  స్కూలింగ్‌ : బ్రహ్మోబాయ్స్‌ స్కూల్‌
  • గ్రాడ్యుయేషన్‌ : కలకత్తా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న ప్రెసిడెన్సీ కాలేజ్‌
  •  ఉపాధ్యాయులు : జగదీశ్‌ చంద్రబోస్‌, ప్రపుల్ల చంద్రరాయ్‌
  •  1912లో భౌతికశాస్త్రంలో B.Sc. డిగ్రీ పొందారు
 గణాంకశాస్త్రంలో కృషి:
  •  భారతదేశంలో గణాంకశాస్త్ర పితామహుడుగా ప్రసిద్ధి.
  • 1931 డిసెంబర్‌ 17న Indian Statistical Institute (ISI)ను స్థాపించారు.
  • 1937–1944 మధ్య కాలంలో భారీ సర్వేలు నిర్వహణపై అధ్యయనాలు చేశారు.
  • రాండమ్‌ శాంప్లింగ్‌ పద్ధతి ద్వారా పంటల విస్తీర్ణం, దిగుబడుల గణాంకాలను విశ్లేషించారు.
  • పైలట్‌ అధ్యయనాల (Pilot Studies) భావనను ప్రవేశపెట్టారు.

 ➺ మహలనోబిస్‌ దూరం (Mahalanobis Distance):

  • గణాంకాలలో విస్తృతంగా ఉపయోగించే ఒక ముఖ్యమైన గణన పద్ధతిని అభివృద్ధి చేశారు.

➺ జాతీయ శాంపిల్‌ సర్వేలు (National Sample Surveys):

  • ఆయన రూపకల్పన చేసిన ఈ సర్వేలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి.

➺ ప్రణాళికా రంగంలో పాత్ర:

  • జవహర్‌లాల్‌ నెహ్రూ భారత ప్రణాళిక వ్యవస్థ పితామహుడు అయితే,
    ఆ ప్రణాళికలకు మార్గదర్శకుడు మహలనోబిస్‌.
  • దేశ అభివృద్ధి పారిశ్రామిక పెట్టుబడుల ద్వారానే సాధ్యమని ఆయన నమ్మకం.

➺ ప్రాజెక్టులు:
  • హిరాకుడ్‌, దామోదర్‌ వ్యాలీ ప్రాజెక్టులు మహలనోబిస్‌ సాంఖ్యక పద్ధతుల ఆధారంగా రూపొందించబడ్డాయి.

➺ గౌరవాలు:
  • ఆయన జన్మదినమైన జూన్‌ 29ను భారతదేశంలో ప్రతి సంవత్సరం “జాతీయ గణాంక దినోత్సవం”గా జరుపుకుంటారు.

➺ మరణం:
  • 1972 జూన్‌ 28న కోల్‌కతాలో మరణించారు.

  


Also Read :




Also Read :


 

Post a Comment

0 Comments