Solar System : Planets and their features Gk Questions with Answers in Telugu | General Science Gk MCQ Questions with Answers in Telugu
Gk Questions and Answers in Telugu ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్ నాలెడ్జ్ కొరకు రూపొందించబడినవి. Gk Questions Banking (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Central Investigation Agencies, UPSC, Civils etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్ కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే Gk Questions in Telugu పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్ సాధించడానికి ఉపయోగపడుతుంది.
☛ Question No.1
సూర్యుడికి అత్యంత సమీపంలో ఉన్న గ్రహం ఏది?
A) శుక్రుడు
B) భూమి
C) బుధుడు
D) అంగారకుడు
Answer : C) బుధుడు
☛ Question No.2
బుధ గ్రహానికి ఎన్ని ఉపగ్రహాలు ఉన్నాయి?
A) ఒకటి
B) రెండు
C) లేవు
D) మూడు
Answer : C) లేవు
☛ Question No.3
బుధుడు తన చుట్టూ తాను భ్రమణం చేయడానికి పట్టే సమయం ఎంత?
A) 24 గంటలు
B) 58 రోజులు
C) 88 రోజులు
D) 225 రోజులు
Answer : B) 58 రోజులు
☛ Question No.4
బుధుడు సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే కాలం?
A) 225 రోజులు
B) 687 రోజులు
C) 88 రోజులు
D) 365 రోజులు
Answer : C) 88 రోజులు
☛ Question No.5
బుధ గ్రహం పగటి ఉష్ణోగ్రత ఎంత?
A) 427°C
B) 100°C
C) 300°C
D) 245°C
Answer : A) 427°C
☛ Question No.6
బుధ గ్రహం రాత్రి ఉష్ణోగ్రత ఎంత?
A) –100°C
B) –185°C
C) –50°C
D) –273°C
Answer : B) –185°C
☛ Question No.7
సౌర కుటుంబంలో అత్యంత ప్రకాశవంతమైన గ్రహం ఏది?
A) భూమి
B) బుధుడు
C) శుక్రుడు
D) అంగారకుడు
Answer : C) శుక్రుడు
☛ Question No.8
శుక్ర గ్రహం వాతావరణంలో ప్రధానంగా ఏ వాయువు ఉంటుంది?
A) నైట్రోజన్
B) ఆక్సిజన్
C) హైడ్రోజన్
D) కార్బన్ డై ఆక్సైడ్
Answer : D) కార్బన్ డై ఆక్సైడ్
☛ Question No.9
శుక్రుడి వాతావరణంలో ఉన్న సల్ఫ్యూరిక్ ఆమ్లం ఏ రూపంలో ఉంటుంది?
A) వర్షం
B) మేఘాలుగా
C) మంచుగా
D) పొగమంచుగా
Answer : B) మేఘాలుగా
☛ Question No.10
శుక్రుడు తన చుట్టూ భ్రమణం చేయడానికి పట్టే కాలం?
A) 58 రోజులు
B) 88 రోజులు
C) 243 రోజులు
D) 365 రోజులు
Answer : C) 243 రోజులు
☛ Question No.11
శుక్రుడు సూర్యుని చుట్టూ పరిభ్రమణం చేయడానికి పట్టే కాలం?
A) 88 రోజులు
B) 225 రోజులు
C) 365 రోజులు
D) 687 రోజులు
Answer : B) 225 రోజులు
☛ Question No.12
శుక్ర గ్రహం భ్రమణ దిశ ఏది?
A) వృత్తాకారంగా
B) పడమర నుండి తూర్పు
C) ఉత్తరం నుండి దక్షిణం
D) తూర్పు నుండి పడమర
Answer : D) తూర్పు నుండి పడమర
☛ Question No.13
భూమికి అత్యంత సమీపంగా ఉండే గ్రహం ఏది?
A) బుధుడు
B) శుక్రుడు
C) అంగారకుడు
D) గురుడు
Answer : B) శుక్రుడు
☛ Question No.14
శుక్ర గ్రహానికి ఎన్ని ఉపగ్రహాలు ఉన్నాయి?
A) రెండు
B) ఒకటి
C) లేవు
D) మూడు
Answer : C) లేవు
☛ Question No.15
సూర్యుని నుండి మూడవ గ్రహం ఏది?
A) బుధుడు
B) శుక్రుడు
C) భూమి
D) అంగారకుడు
Answer : C) భూమి
☛ Question No.16
భూమి సగటు ఉష్ణోగ్రత ఎంత?
A) 27°C
B) 14.5°C
C) 35°C
D) 0°C
Answer : B) 14.5°C
☛ Question No.17
భూమి యొక్క వయస్సు సుమారు ఎంత?
A) 1 బిలియన్ సంవత్సరాలు
B) 2.5 బిలియన్ సంవత్సరాలు
C) 4.5 బిలియన్ సంవత్సరాలు
D) 10 బిలియన్ సంవత్సరాలు
Answer : C) 4.5 బిలియన్ సంవత్సరాలు
☛ Question No.18
భూమధ్యరేఖ వద్ద భూమి చుట్టుకొలత ఎంత?
A) 40066 కి.మీ
B) 39992 కి.మీ
C) 12756 కి.మీ
D) 12714 కి.మీ
Answer : A) 40066 కి.మీ
☛ Question No.19
భూమి యొక్క ఉపగ్రహం ఏది?
A) ఫోబోస్
B) శుక్రుడు
C) డెమోస్
D) చంద్రుడు
Answer : D) చంద్రుడు
☛ Question No.20
భూమి సూర్యుని దగ్గరికి ఎక్కువగా వచ్చే స్థితి ఏమని అంటారు?
A) అపహేళి
B) పరిహేళి
C) అక్షవృత్తం
D) ఉపగ్రహం
Answer : B) పరిహేళి
☛ Question No.21
భూమి సూర్యుని నుండి దూరంగా ఉండే స్థితి ఏమని అంటారు?
A) పరిహేళి
B) అపహేళి
C) అక్షవృత్తం
D) భ్రమణం
Answer : B) అపహేళి
☛ Question No.22
అంగారక గ్రహాన్ని మరొక పేరుతో ఏమని అంటారు?
A) పచ్చ గ్రహం
B) నీలి గ్రహం
C) ఎర్ర గ్రహం
D) తెలుపు గ్రహం
Answer : C) ఎర్ర గ్రహం
☛ Question No.23
అంగారక గ్రహంపై ఎక్కువగా సంభవించే ప్రకృతి సంఘటన ఏది?
A) అగ్నిపర్వత విస్ఫోటనం
B) భూకంపం
C) వర్షం
D) హిమపాతం
Answer : A) అగ్నిపర్వత విస్ఫోటనం
☛ Question No.24
అంగారకుడిపై అత్యంత ఎత్తైన పర్వతం పేరు ఏమిటి?
A) మౌంట్ ఎవరెస్ట్
B) మౌంట్ ఒలంపస్
C) మౌంట్ అండీస్
D) మౌంట్ మెర్క్యురీ
Answer : B) మౌంట్ ఒలంపస్
☛ Question No.25
అంగారకుడి ఉపగ్రహాల సంఖ్య ఎంత?
A) 1
B) 2
C) 3
D) 4
Answer : B) 2 (ఫోబోస్, డెమోస్)
☛ Question No.26
గురుగ్రహం సౌర కుటుంబంలో ఏ స్థానంలో ఉంది?
A) నాలుగవది
B) ఏడవది
C) ఆరోది
D) ఐదవది
Answer : D) ఐదవది
☛ Question No.27
గురుగ్రహం వాతావరణంలో ప్రధానంగా ఉండే వాయువులు?
A) హైడ్రోజన్ మరియు హీలియం
B) నైట్రోజన్ మరియు ఆక్సిజన్
C) కార్బన్ డై ఆక్సైడ్
D) సల్ఫర్ డై ఆక్సైడ్
Answer : A) హైడ్రోజన్ మరియు హీలియం
☛ Question No.28
గురుగ్రహం మీద ఉన్న “గ్రేట్ రెడ్ స్పాట్” అంటే ఏమిటి?
A) అగ్నిపర్వతం
B) భారీ తుఫాను
C) పర్వతం
D) సముద్రం
Answer : B) భారీ తుఫాను
☛ Question No.29
సౌర కుటుంబంలో అతిపెద్ద గ్రహం ఏది?
A) భూమి
B) అంగారకుడు
C) గురుడు
D) శని
Answer : C) గురుడు
☛ Question No.30
గురుగ్రహానికి ఎన్ని ఉపగ్రహాలు ఉన్నాయి?
A) 16
B) 79
C) 27
D) 4
Answer : B) 79
Also Read :
Solar System : Planets and their features Gk Questions with Answers Part - 2

0 Comments