Thomas Alva Edison Biography in Telugu | World History in Telugu
థామస్ ఆల్వా ఎడిసన్
థామస్ ఆల్వా ఎడిసన్ తన అద్భుత ఆవిష్కరణలతో మానవ జాతిని ఎంతగానో ప్రభావితం చేశారు. ఆయన కనుగొన్న ఎలక్ట్రిక్ బల్బు, ఫోనోగ్రాఫ్, మోషన్ ఫిక్చర్ కెమెరా, టెలిఫోన్, టెలిగ్రాఫ్ పనితీరు మెరుగుపరచడం వంటివి మానవ జీవితంలో ఎన్నో అద్భుతాలు సృష్టించాయి. అమెరికాకు చెందిన థామస్ ఆల్వా ఎడిసన్ తన ఆవిష్కరణల ద్వారా ప్రజల జీవన శైలిని ఎంతగానో ప్రభావితం చేశారు.
➺ బాల్యం :
థామస్ ఆల్వా ఎడిసన్ 11 ఫిబ్రవరి 1847న అమెరికాలోని మిలన్‌లో జన్మించారు.
➺ ఆవిష్కరణలు :
- ధ్వనిని రికార్డ్, పునరుత్పత్తి చేసే ఫోనోగ్రాఫ్ (గ్రామ్‌ఫోన్)ను 1877లో కనిపెట్టారు.
- టెలీఫోన్ పరిశ్రమ మెరుగు పరిచే ఉద్దేశ్యంతో కార్బన్ ట్రాన్‌మీటర్‌ను అభివృద్ది చేశారు.
- టైప్ రైటర్, ఎలక్ట్రిక్ పెన్, అయస్కాంతీకరణ వంటి ఆవిష్కరణలు చేశారు.
- నికెల్-ఇనుము ఆల్కలీన్ బ్యాటరీని కనుగొన్నారు.
- మోషన్ పిక్చర్స్ పేమెంట్ కంపెనీని 1908లో స్థాపించారు.
➺ పురస్కారాలు :
- ఆఫీసర్ ఆఫ్ లెజియన్ ఆఫ్ ఆనర్ (1881)
- మాట్టెయిచి మెడల్ (1887)
- జాన్ స్కాట్ మెడల్ (1889)
- ఎడ్వర్డ్ లాంగ్ స్ట్రెత్ మెడల్ (1899)
- జాన్ ఫ్రిడ్జ్ మెడల్ (1908)
- ఫ్రాంక్లిన్ మెడల్ (1915)

0 Comments