Subrahmanyan Chandrasekhar Biography in Telugu | సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ | Biography in Telugu
20వ శతాబ్దపు ఖగోళ శాస్త్రవేత్తలో ముఖ్యులలో సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ ఒకరు. ఈయన ఇండో-అమెరికన్. నక్షత్ర భౌతిక శాస్త్ర పరిశోధకులు, మరియు గణిత శాస్త్రవేత్త. ఈయన కృష్ణబిలాల పై వివిధ పరిశోధనలు చేశారు. అంతేకాకుండా నక్షత్రాల నుండి వచ్చే రేడియేషన్ శక్తి, నక్షత్ర శకలాలపై అనేక పరిశోధనలు చేశారు. ఖగోళ వస్తువుల మధ్యగల దూరాన్ని కొలవడానికి ప్రమాణాలను కనిపెట్టారు. ‘‘కృష్ణబిలాల గణిత సిద్దాంతాన్ని’’ ఆవిష్కరించినందుకు గాను 1983లో భౌతికశాస్త్రంలో ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి పొందారు.
చంద్రశేఖర్ 19 అక్టోబర్ 1910న లాహోర్‌లో జన్మించారు. చంద్రశేఖర్ 12 సంవత్సరాలు వచ్చే వరకు ఇంట్లోనే విద్యాభ్యాసం చేశారు. తర్వాత మద్రాస్‌లోని ఉన్నత విద్యను అభ్యసించారు. తర్వాత మద్రాస్‌లోని ప్రెసిడెన్సీ కాలేజ్‌లో విద్యనభ్యసించారు. 1930లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చదివేందుకు ప్రభుత్వ స్కాలర్‌షిప్ సాధించి డిగ్రీ పూర్తి చేశారు. డిగ్రీ చివరి సంవత్సరంలో పరిశోధనల నిమిత్తం కోపెన్‌హగస్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఫర్ థియరిటికల్ ఫిజిక్స్‌కి వెళ్లారు. అక్కడే చంద్రశేఖర్ ప్రముఖ శాస్త్రవేత్త అయిన నీల్స్‌బోర్‌ను కలిసారు. నక్షత్రాల జననం, మరణాలపై అధ్యయనం చేశారు. ప్రముఖ బ్రిటిష్ ఫిజిసిస్ట్ ప్రొఫెసర్ రాల్ఫ్ పౌలర్ మెంటార్‌షిప్‌తో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుండి పీహెచ్‌డీ పట్టా పొందారు. 1935లో హర్వర్డ్ యూనివర్సిటీలో విజిటింగ్ లెక్చరర్‌గా పనిచేశారు. ఖగోళ భౌతికశాస్త్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు.
ఆవిష్కరణలు :
- నక్షత్రం భరించే భారస్థితిని 1940లో ‘చంద్రశేఖర్ ద్రవ్యరాశి’ గా వివరించారు.
- 1950లో నక్షత్రాలు, అక్కడి వాతావరణం నుండి కాంతి ఎలా ప్రయాణిస్తుందనే విషయంపై పరిశోధనలు చేసి అభివృద్ది పరిచారు.
- చంద్రశేఖర్`ఫెర్మి మెథడ్ రూపొందించారు.
- 1986లో చంద్రశేఖర్ వేవ్స్‌ను ఆవిష్కరించారు.
అవార్డులు - గౌరవాలు :
- రాయల్ సోసైటీ ఫెలోగా 1944లో ఎన్నికయ్యారు.
- రాయల్ ఆస్ట్రో సోసైటీ నుండి 1953లో బంగారు పతకం పొందారు.
- నేషనల్ మెడల్ ఆఫ్ సైన్‌ను అవార్డును 1966లో అమెరికా ప్రధాన చేసింది.
- రాయల్ సోసైటీ కోప్లి పతకాన్ని 1984లో పొందారు.
- నాసా నెలకొల్పిన ఆస్ట్రోఫిజికల్ అబ్జర్వేటరీలో కీలక బాద్యతలు నిర్వహించారు.
- 1953లో అమెరికా పౌరసత్వం తీసుకున్నారు.
Also Read :
Also Read :

0 Comments