శకుంతలా దేవి - హ్యూమన్ కంప్యూటర్
Human Computer Shakuntala Devi MCQs in Telugu
శకుంతలా దేవి ప్రపంచ గొప్ప గణిత, ఖగోళ, జ్యోతిష శాస్త్రవేత్త. కంప్యూటర్ కంటే వేగంగా, ఖచ్చితంగా అంకెలు గుణించి ‘‘గిన్నిస్ బుక్’’ లో చోటు సంపాదించడంతో పాటు హ్యూమన్ కంప్యూటర్‌గా గుర్తింపు సాధించింది. ఈమె ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రదర్శనలు నిర్వహించి కంప్యూటర్ కంటే వేగంగా గణన చేసి నిరూపించింది.
శకుంతలా దేవి 04 నవంబర్ 1929 కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూర్‌లో జన్మించారు. శకుంతల తండ్రి సర్కస్‌లో పనిచేసేవాడు. శకుంతల దేవి అసాధారణ ప్రతిభను తన తండ్రి 3వ యేటనే గుర్తించాడు. ఎంతో క్లిష్టమైన గణిత సమస్యలను సులభంగా పరిష్కరించడం చూసి ఆశ్యర్యపోయాడు. దీంతో ఆయన సర్కస్ వృత్తిని మానేసి కూతురుతో కలిసి గణిత ప్రదర్శనలు ఇచ్చాడు. శకుంతల దేవి తన మొదటి గణిత ప్రదర్శనను యూనివర్సిటీ ఆఫ్ మైసూర్‌లో ఇచ్చింది. ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు లేకుండా కనీసం పెన్ను, పేపర్ కూడా లేకుండా కిష్టమైన గణిత ప్రశ్నలను ఎంతో సులభంగా పరిష్కరించడంతో శకుంతల దేవి పేరు భారతదేశ వ్యాప్తంగా అందరికి తెలిసింది. తన చిన్నతనంలో సాధారణ విద్య అభ్యసించకుండానే తన గణిత ప్రదర్శనను దేశవిదేశాల్లో చాటారు. శకుంతల 21 ఏప్రిల్ 2013న మరణించారు.
రచనలు :
మోర్ ఫజిల్స్ టు పజిల్ యు (1976)
ఆస్ట్రాలజీ ఫర్ యు (1984)
ఇన్ ది వండర్ లాండ్ ఆఫ్ నంబర్స్ (2006)
సూపర్ మెమోరీ ఇన్‌కెన్ బీ యువర్స్ (2011)

0 Comments