ఒక్క రూపాయితో 2 లక్షల భీమా .. ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన

Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana
 

Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana 

ఒక్క రూపాయితో 2 లక్షల భీమా .. ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన


ప్రతిరోజు ఒక్క రూపాయితో 2 లక్షల బీమా పొందవచ్చు. ప్రతి ఇంటిలో అనుకోని కారణాలతో ఇంటి పెద్ద మరణిస్తే జీవిత భీమా ఆ కుటుంబానికి భరోసాగా ఉంటుంది. ఈ విషయం చాలా మందికి తెలిసినా ప్రిమియం సొమ్ము అధికంగా ఉండడంతో చాలామంది వెనకడుగు వేస్తుంటారు. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘‘ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన’’ చక్కటి అవకాశం. 

  • 18 నుండి 50 సంవత్సరాల మధ్యలో ఉండి బ్యాంక్‌ లేదా పోస్టాఫీసులో పొదుపు ఖాతా కల్గి ఉండాలి. 
  • 50 సంవత్సరాలు నిండకముందే పథకంలో చేరిన వారు ప్రీమియం చెల్లిస్తూ ఉంటే 55 ఏళ్ల వయస్సు వరకు బీమా వర్తిస్తుంది.
  • సంవత్సరానికి రూ॥436/- ప్రిమియం చెల్లించాల్సి ఉంటుంది. ఆటో డెబిట్‌ విధానంలో కూడా చెల్లించవచ్చు.
  • 01 జూన్‌ నుండి 31 మే వరకు సంవత్సరం పాటు కవరేజీ కాలం ఉంటుంది. 
  • బీమా చేయించుకున్న వ్యక్తి ఏదేని కారణంతో మరణిస్తే సంబంధిత ధృవీకరణ పత్రాలు బ్యాంక్‌ అధికారులకు అందిస్తే నామినీకికి రూ॥2లక్షల రూపాయలు అందజేస్తారు. 
  • మొదటిసారరి ఈ పథకంలో చేరిన వారికి ప్రమాదంలో మరణిస్తే తప్ప నమోదు చేసుకున్న తేదీ నుండి  మొదటి 30 రోజులు క్లైయిమ్‌ వర్తించదు (వెయిటింగ్‌ పీరియడ్‌) 

 

 

 


Post a Comment

0 Comments