కొత్త పంచాయితీ రాజ్ చట్టం – సర్పంచ్ విధులు, అధికారాలు
తెలంగాణ ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిన కొత్త పంచాయితీ రాజ్ చట్టం – 2018 గ్రామ పాలనను మరింత పారదర్శకంగా, బాధ్యతాయుతంగా మార్చింది. ఈ చట్టం ప్రకారం గ్రామ సర్పంచ్‌లు మరియు పంచాయితీ పాలకమండలికి స్పష్టమైన అధికారాలు, విధులు, బాధ్యతలు నిర్ధేశించబడ్డాయి.ఈ చట్టం యొక్క ముఖ్య లక్ష్యం గ్రామాభివృద్ధిని వేగవంతం చేయడం, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడం మరియు నిధుల దుర్వినియోగాన్ని అరికట్టడం.
సర్పంచ్ ఎవరు? (Who is Sarpanch)
సర్పంచ్ గ్రామానికి ప్రథమ పౌరుడు (First Citizen of the Village).గ్రామ పంచాయితీ పాలకమండలికి నాయకత్వం వహిస్తూ, అన్ని ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలవుతున్నాయా లేదా అన్నదానిపై పర్యవేక్షణ చేయడం సర్పంచ్ ప్రధాన బాధ్యత.
అధికారాలు - విధులు :
- పంచాయితీ కార్యదర్శిపై సర్పంచ్‌కు పరిపాలనాపరమైన పూర్తి అధికారం ఉంటుంది
- పంచాయితీ తీర్మానాల అమలుపై కార్యదర్శి పనితీరును పర్యవేక్షించాలి
- రోజువారీ కార్యాలయ ఖర్చుల కోసం ప్రభుత్వ అనుమతితో ఖర్చు చేసే అధికారం
- గ్రామ పరిశుభ్రతను కాపాడడం
- పారిశుద్ధ్య కార్మికుల హాజరు, పనితీరుపై పర్యవేక్షణ
- ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉండేలా చర్యలు
- పాడుబడిన బావులు, నీటి గుంటలు పూడ్చివేయడం
- పిచ్చిచెట్లు, శిథిలాల తొలగింపు
- ప్రతి నెల ఒకసారి గ్రామపంచాయితీ సమావేశం
- రెండు నెలలకు ఒకసారి గ్రామసభ నిర్వహణ
- వందశాతం పన్నుల వసూలు
- జనన–మరణ రిజిస్టర్ నిర్వహణ
- వీధి దీపాల సంరక్షణ
- పంచాయితీ రికార్డుల భద్రత
- సర్పంచ్ మరియు ఉపసర్పంచ్‌కు Joint Cheque Power ఉంటుంది
- గ్రామాభివృద్ధి కోసం వచ్చే నిధులను పారదర్శకంగా వినియోగించాలి
- గ్రామ అభివృద్ధికి సంబంధించి 5 సంవత్సరాల Action Plan రూపొందించాలి
- సర్పంచ్ తప్పనిసరిగా గ్రామంలో నివాసం ఉండాలి
- పంచాయితీ కార్యాలయానికి హాజరు తప్పనిసరి
- ప్రభుత్వం లేదా కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలు అమలు చేయకపోతే పదవి నుండి తొలగింపు
- త్రాగునీరు, రోడ్లు, పారిశుద్ధ్యం, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం

0 Comments