| అంశం |
సంక్షిప్త వివరణ |
| ఉష్ణ వహనం |
ఘన పదార్థాల్లో అణువులు స్థానం మారకుండా, ఒక అణువునుంచి మరొక అణువుకు ఉష్ణశక్తి బదిలీ కావడాన్ని ఉష్ణ వహనం అంటారు.
|
| ఉదాహరణ |
ఇనుప కడ్డీని మంటలో ఉంచితే మంటకు దూరంగా ఉన్న కొన కూడా వేడెక్కుతుంది.
|
| వివరణ (గతి శక్తి ఆధారంగా) |
అణువులు ఉష్ణశక్తిని గ్రహించి అధిక వేగంతో కంపించి, ఆ శక్తిని పక్క అణువులకు బదిలీ చేస్తాయి.
|
| ఉష్ణ వాహకాల విభజన |
ఉష్ణ వహనం ఆధారంగా పదార్థాలను ఉత్తమ వాహకాలు మరియు అథమ వాహకాలుగా విభజిస్తారు.
|
| ఉత్తమ ఉష్ణ వాహకాలు |
ఉష్ణం సులభంగా ప్రవహించే పదార్థాలు. ఉదా: వెండి, రాగి, అల్యూమినియం, గ్రాఫైట్, పాదరసం.
|
| ఉత్తమ వాహకాల అనువర్తనాలు |
ఉష్ణమాపకాల్లో పాదరసం, వంట పాత్రలు, రేడియేటర్లు, ఫ్రిజ్‌లు, ఏసిలు, సోల్డరింగ్‌లో ఉపయోగిస్తారు.
|
| అథమ ఉష్ణ వాహకాలు |
ఉష్ణం ప్రవహించనివ్వని పదార్థాలు. ఉదా: గాజు, ఉన్ని, చెక్క, రబ్బరు, ప్లాస్టిక్, వాయువులు.
|
| అథమ వాహకాల లక్షణం |
స్వేచ్ఛా ఎలక్ట్రాన్లు తక్కువగా ఉండటం వల్ల ఉష్ణ వహనం తక్కువగా జరుగుతుంది.
|
| ఉష్ణ వాహకత్వం |
ఒక పదార్థం తన ద్వారా పంపగలిగే ఉష్ణ పరిమాణాన్ని ఉష్ణ వాహకత్వం అంటారు. ఇది ప్రతి లోహానికి భిన్నంగా ఉంటుంది.
|
0 Comments