ఉష్ణ వికిరణం (Heat Radiation in Telugu) | General Science Gk in Telugu
| అంశం | వివరణ |
|---|---|
| ఉష్ణ వికిరణం అర్థం | వేడి వస్తువు నుండి చల్లని వస్తువుకు ఉష్ణం తరంగాల రూపంలో ప్రసారమయ్యే ప్రక్రియను ఉష్ణ వికిరణం అంటారు. |
| యానక అవసరం | యానకం ఉన్నా లేకపోయినా (శూన్యంలో కూడా) ఉష్ణ వికిరణం జరుగుతుంది. |
| వికిరణాల స్వభావం | ఉష్ణ వికిరణాలు విద్యుదయస్కాంత కిరణాలు; ఇవి పరారుణ కిరణాలుగా పిలుస్తారు. |
| పౌన:పున్యం | కాంతి కంటే తక్కువ పౌన:పున్యం కలిగి ఉంటాయి; ఉష్ణోగ్రత పెరిగేకొద్దీ పౌన:పున్యం పెరుగుతుంది. |
| వికిరణాల విడుదల | 0 కెల్విన్ తప్ప అన్ని ఉష్ణోగ్రతలలోని వస్తువులు పరారుణ వికిరణాలను విడుదల చేస్తాయి. |
| వేగం | విద్యుదయస్కాంత వికిరణాల మాదిరిగానే సుమారు 3 × 108 మీ/సె వేగంతో ప్రయాణిస్తాయి. |
| ప్రయాణ విధానం | సరళరేఖ వెంట ప్రయాణిస్తాయి; వంగి ప్రయాణించవు. |
| ఆప్టికల్ లక్షణాలు | పరావర్తనం, వక్రీభవనం వంటి ప్రక్రియలకు లోబడతాయి. |
| యానకంపై ప్రభావం | వీటి ప్రయాణంలో ఉన్న యానకాన్ని వేడి చేయవు. |
| ఉదాహరణ | సూర్యుని నుండి భూమికి చేరే ఉష్ణం ఉష్ణ వికిరణం ద్వారానే వస్తుంది. |
| అనువర్తనాలు |
• శీతాకాలంలో ముదురు బట్టలు, వేసవిలో తెల్ల బట్టలు ధరించడం • కర్మాగారాలపై తెలుపు పెయింట్ వేయడం • వంట పాత్రల అడుగు నలుపు రంగులో ఉంచడం |

0 Comments