| ఉష్ణ సంవహనం నిర్వచనం |
ప్రవాహిల్లో (ద్రవాలు, వాయువులు) అణువుల కదలిక ద్వారా ఒక ప్రదేశం నుండి
మరో ప్రదేశానికి ఉష్ణం ప్రసారమవడాన్ని ఉష్ణ సంవహనం అంటారు.
|
| సాధ్యపడే పదార్థాలు |
ఉష్ణ సంవహనం కేవలం ద్రవాలు మరియు వాయువుల్లో మాత్రమే జరుగుతుంది.
ఘనపదార్థాల్లో అణువులు స్థిరంగా ఉండటం వల్ల ఇది సాధ్యం కాదు.
|
| కారణం |
ఉష్ణం అందినప్పుడు అణువులు శక్తిని శోషించుకొని దూరంగా కదలుతాయి.
చల్లని అణువులు ఆ స్థానాన్ని భర్తీ చేస్తాయి.
|
| ద్రవాల్లో అనువర్తనాలు |
కార్లు, వాహనాల్లోని రేడియేటర్లు ఉష్ణ సంవహనం ఆధారంగా పనిచేస్తాయి.
అలాగే సముద్ర జలప్రవాహాలు వాతావరణ సమతౌల్యతను కాపాడుతాయి.
|
| వాయువుల్లో అనువర్తనాలు |
భూమధ్య రేఖ వద్ద వేడి గాలి పైకి ఎగసి, ధ్రువ ప్రాంతాల నుండి చల్లని గాలి
వచ్చి పవనాలను ఏర్పరుస్తుంది.
|
| ప్రాముఖ్యత |
ఉష్ణ సంవహనం వాతావరణ నియంత్రణ, సముద్ర ప్రవాహాలు, గాలుల ఏర్పాటులో
కీలక పాత్ర పోషిస్తుంది.
|
0 Comments