List of British Acts in India | Important British Acts in India | Indian History in Telugu
బ్రిటిష్ పాలనలో చేసిన భారతదేశ చట్టాలు & సంస్కరణలు
| చట్టం / సంస్కరణ | సంవత్సరం | ప్రధాన అంశాలు |
|---|---|---|
| రెగ్యులేటింగ్ చట్టం | 1773 |
• భారతదేశానికి సంబంధించిన మొదటి లిఖిత చట్టం • బెంగాల్ గవర్నర్‌ను గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్‌గా మార్చారు • వారన్ హెస్టింగ్స్ తొలి గవర్నర్ జనరల్ • కలకత్తాలో సుప్రీం కోర్టు ఏర్పాటు (1774) • ఎలిజా ఇంఫే తొలి ప్రధాన న్యాయమూర్తి |
| పిట్స్ ఇండియా చట్టం | 1784 |
• రెగ్యులేటింగ్ చట్ట లోపాల సవరణ • బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఏర్పాటు • కంపెనీ రాజకీయ వ్యవహారాలు ప్రభుత్వ ఆధీనంలోకి |
| చార్టర్ చట్టం | 1793 |
• కంపెనీ పాలనను మరో 20 ఏళ్లకు పొడిగింపు • గవర్నర్ జనరల్ అధికారాల విస్తరణ • రెవెన్యూను యుద్ధ అవసరాలకు వినియోగం |
| చార్టర్ చట్టం | 1813 |
• కంపెనీ వర్తక గుత్తాధిపత్యం రద్దు • విద్య, మతపరమైన అభివృద్ధికి లక్ష రూపాయల నిధి • అందరికీ భారత వర్తకానికి అవకాశం |
| చార్టర్ చట్టం | 1833 |
• గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా పదవి ఏర్పాటు • విలియం బెంటింగ్ తొలి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా • భారత లా కమిషన్ ఏర్పాటు – లార్డ్ మెకాలే |
| చార్టర్ చట్టం | 1853 |
• చివరి చార్టర్ చట్టం • పోటీ పరీక్షల ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు • ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏర్పాటు |
| భారత రాజ్యాంగ చట్టం | 1858 |
• కంపెనీ పాలన ముగింపు • వైస్రాయ్ పాలన ప్రారంభం • తొలి వైస్రాయ్ – లార్డ్ కానింగ్ • భారత కార్యదర్శి పదవి ఏర్పాటు |
| కౌన్సిల్ చట్టం | 1861 |
• శాసనసభల ఏర్పాటు • బడ్జెట్ పద్ధతి ప్రవేశం (1860) |
| కౌన్సిల్ చట్టం | 1892 |
• శాసనసభ అధికారాల విస్తరణ • బడ్జెట్‌పై చర్చించే హక్కు |
| మింటో – మార్లే సంస్కరణలు | 1909 |
• కేంద్ర, రాష్ట్ర శాసనసభల విస్తరణ • ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు • ప్రశ్నించే హక్కు కల్పింపు |
| మాంటెగ్ – చెమ్స్‌ఫర్డ్ సంస్కరణలు | 1919 |
• ద్వంద్వ పాలన ప్రవేశం • కేంద్రంలో ద్విసభా పద్ధతి |
| భారత ప్రభుత్వ చట్టం | 1935 |
• సమాఖ్య రాజ్యాంగానికి పునాది • రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి • ఫెడరల్ కోర్టు ఏర్పాటు • బర్మాను భారతదేశం నుండి వేరు చేయడం |

0 Comments