Kaloji Narayana Rao | Telangana History in Telugu
ప్రజాకవి కాళోజీ నారాయణరావు తెలంగాణ గర్వించదగిన మహానుభావుల్లో ఒకరు. ప్రముఖ కవి, స్వాతంత్ర్య సమరయోధుడు, సామాజిక సంస్కర్త మరియు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిదాత. కాళోజీ నారాయణరావుఆయన 1914 సెప్టెంబర్ 9న జన్మించారు. కర్ణాటకలోని బీజాపూర్ నుండి వలస వచ్చి వరంగల్ జిల్లా మడికొండ గ్రామంలో నివసించిన కుటుంబానికి చెందినవారు.తల్లిదండ్రులు – రంగారావు, రమాబాయమ్మ.
విద్యాభ్యాసం :
- చౌమొహల్లా పాఠశాల – హైదరాబాద్
- సిటీ కాలేజ్ – హైదరాబాద్
- 1939లో న్యాయశాస్త్రంలో పట్టా – హైదరాబాద్ హైకోర్టు అనుబంధ న్యాయ కళాశాల
తెలుగు, ఉర్దూ, మరాఠీ భాషల్లో కాళోజీ ప్రావీణ్యం సంపాదించారు.
ప్రజా పోరాటం :
- క్విట్ ఇండియా ఉద్యమం – 2½ సంవత్సరాలు జైలు శిక్ష
- వందేమాతరం ఉద్యమం (ఉస్మానియా యూనివర్సిటీ)
- 1948 భారత విలీన ఉద్యమం – వరంగల్, గుల్బర్గా జైళ్లలో శిక్ష
- నిజాం పాలనకు వ్యతిరేకంగా గేయాల ద్వారా ప్రజలను చైతన్యపరిచారు
ప్రసిద్ధ కవితా పంక్తులు :
“అన్యభాషలు నేర్చి ఆంధ్రమ్ము రాదంచు…”
“అతిథివోలె ఉండి అవని విడిచి వెళ్లుతాను”
“ఎన్నాళ్ల నుండియో…”
ఈ కవితలు తెలంగాణ ప్రజల్లో స్వాతంత్ర్య చైతన్యాన్ని నింపాయి.
రచనలు (Kalojirao Books) :
| 1941 | అణా కథలు |
| 1946 | కాళోజీ కథలు |
| 1953 | నా గొడవ |
| 1969–70 | తెలంగాణ ఉద్యమ కవితలు |
| 1995 | ఇది నా గొడవ (ఆత్మకథ) |
ప్రసిద్ధ కథలు:
- మనమే నయం
- తెలియన ప్రేమ
- తెలిసి ద్వేషం
- విభూతి లేక ఫేస్ పౌడర్
అవార్డులు :
- పద్మ విభూషణ్ – 1992 (భారత ప్రభుత్వం)
- ప్రజాకవి బిరుదు – ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
- గౌరవ డాక్టరేట్ – కాకతీయ విశ్వవిద్యాలయం
మరణం - స్మృతి :
- మరణం: 13 నవంబర్ 2002
- తన శరీరాన్ని కాకతీయ మెడికల్ కాలేజీకి దానం చేశారు
- ప్రస్తుతం అది కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మారింది
- సెప్టెంబర్ 9 – తెలంగాణ భాషా దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది

0 Comments