Telangana History in Telugu | Kakatiya Period Poets of Telangana

Telangana History in Telugu

Telangana Poets During Kakatiya Rule  | Telangana History in Telugu 

కాకతీయుల కాలం – తెలంగాణ కవులు

కాకతీయుల పాలనా కాలం తెలంగాణ సాహిత్యానికి స్వర్ణయుగం. ఈ కాలంలో శైవ, వైష్ణవ, జైన సంప్రదాయాల ప్రభావంతో అనేకమంది పండితులు, కవులు, వ్యాఖ్యాతలు అనేక గ్రంథాలను రచించి తెలుగు భాషను, సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. 

విశ్వేశ్వర దేశికుడు (శివదేవుడు) :

విశ్వేశ్వర దేశికుడు లేదా శివదేవుడు శివతత్వ రసాయనం అనే ప్రసిద్ధ గ్రంథాన్ని రచించాడు. కేరళకు చెందిన కీర్తి శంభుని శిష్యుడైన ఇతడు తెలంగాణకు వచ్చి స్థిరపడ్డాడు. కాళేశ్వరం, ఏలేశ్వరం వంటి మఠాలు; మంథెన, వెల్లాల, గోళగి ప్రాంతాల్లో దేవాలయాలు నిర్మించాడు. కాకతీయ గణపతిదేవుడి దీక్షా గురువుగా ఉన్న ఇతడు, రుద్రమదేవి పాలనను మరియు ప్రతాపరుద్రుడి యువరాజత్వాన్ని ప్రశంసించాడు. గణపతిదేవుడి నుండి మందిర గ్రామం, రుద్రమదేవి నుండి వెలగపుడి గ్రామాన్ని పొంది రెండింటిని కలిపి గోళగి అగ్రహారంగా అభివృద్ధి చేసి శివాలయం, ప్రసూతి వైద్యశాలను నిర్మించాడు.

గోన బుద్ధారెడ్డి :

తెలుగులో తొలి రామాయణంగా పేరొందిన రంగనాథ రామాయణం రచయిత గోన బుద్ధారెడ్డి. ద్విపద కావ్యరూపంలో రచించిన ఈ గ్రంథంలో ఇంద్రుడు కోడై కూయడం, లక్ష్మణుడు ఏడుగీతలు గీయడం, ఊర్మిళ నిద్ర, లక్ష్మణదేవుడి నవ్వు వంటి వినూత్న ఘట్టాలు ఉన్నాయి.

శివదేవయ్య : 

పురుషార్థసారం గ్రంథాన్ని రచించిన శివదేవయ్య గణపతిదేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడి కాలంలో మంత్రిగా సేవలందించాడు. సంస్కృత ఆంధ్ర కవిత్వానికి పితామహుడిగా కీర్తి పొందాడు

ఈశ్వర భట్టోపాధ్యాయుడు :

మయూరసూరి కుమారుడైన ఇతడు తన తల్లి, భార్యల పేర్లతో బూదపురంలో రెండు చెరువులు తవ్వించి దేవాలయాలు నిర్మించాడు. మహబూబ్‌నగర్ జిల్లా బూదపురం శాసనం ఇతని కృషికి సాక్ష్యం.

కుప్పాంబిక :

తెలంగాణ/తెలుగు సాహిత్యంలో తొలి రచయిత్రిగా గుర్తింపు పొందిన కుప్పాంబిక, మొల్లకంటే ముందే అనేక కవిత్వాలు రచించింది.

చక్రపాణి రంగనాథుడు :

శివభక్తి దీపిక, గిరిజాది నాయక శతకం, చంద్రాభరణ శతకం, శ్రీగిరినాథ విక్రయం వంటి గ్రంథాలతో పాటు సంస్కృతంలో వీరభద్ర విజయం రచించాడు. ఈ గ్రంథాన్ని తెలుగులో పోతర రచించాడు.

కపర్ణి :

అపస్తంభ శ్రౌత సూత్ర భాష్యం, భరద్వాజ గృహ్యసూత్ర భాష్యం, అపస్తంభ గృహ్య పరిసిష్ట భాష్యం, శ్రౌత కల్పకావృత్తి, దివ్య పూర్ణభాష్యం వంటి ప్రసిద్ధ వ్యాఖ్యాన గ్రంథాల రచయిత. ప్రఖ్యాత వ్యాఖ్యాత మల్లినాథసూరి తండ్రి మెదక్ జిల్లా కొలిచె లిమివాసి.

గంగాధర కవి :

మహాభారతాన్ని నాటక రూపంలో రచించి ప్రత్యేక గుర్తింపు పొందాడు.

అప్పయార్యుడు :

జైన సంప్రదాయానికి చెందిన జినేంద్రకళ్యాణాభ్యుదయం రచయిత.

మంచన :

కేయూరి బహుచరిత్ర గ్రంథాన్ని రచించాడు.

శేషాద్రి రమణ :

సంస్కృతంలో యాయాతి చరిత్ర, ఉషా రాగోదయం (నాటకం) రచించాడు. యాయాతి చరిత్రను తరువాత కాలంలో తెలుగులో అనువదించారు.

మారన : 

తెలుగులో తొలి పురాణంగా మార్కండేయ పురాణం, తొలి వ్యాకరణ గ్రంథంగా ఆంధ్రభాషాభూషణం రచించాడు.

కేతన : 

విజ్ఞానేశ్వరీయం రచయిత. ఇది యజ్ఞవల్క్య స్మృతికి తెలుగు అనువాదంగా, తెలుగులో తొలి శిక్షాస్మృతిగా గుర్తింపు పొందింది.

విద్యానాథుడు :

ప్రతాపరుద్రయశోభూషణం, ప్రతాపరుద్ర కళ్యాణం గ్రంథాలలో ప్రతాపరుద్రుడి యశస్సును కీర్తించాడు.

కుమారస్వామి :

సోమిపథి రత్నాపణ గ్రంథాన్ని రచించాడు.

చిలకమర్రి తిరుమలాచార్యులు :

రత్నశాణ రచయిత. భట్టుమూర్తి రచించిన నరసభూపాతియం దీనికి అనువాదం.

అగస్త్యుడు :

బాల భారతం, కృష్ణ చరిత్ర, నలకీర్తి కౌముది, మణిపరీక్ష, లలిత సహస్రనామం, శివ సంహిత, శివస్తవం మొదలైన 74 గ్రంథాలను రచించిన మహానుభావుడు. గంగాదేవి ఇతని శిష్యురాలు; ఆమె మధుర విజయం గ్రంథంలో భర్త విజయాలను వర్ణించింది.

తిక్కన :

తెలుగు మహాభారత అనువాదకుడిగా ప్రసిద్ధి. నన్నయ్య–తిక్కన–ఎర్రనలను కవిత్రయంగా వ్యవహరిస్తారు. మల్లిఖార్జునుడు, హుళక్కి భాస్కరుడు, రుద్రదేవుడు కలిసి భాస్కర రామాయణం రచించారు.

 


Also Read :




Also Read :


 

Post a Comment

0 Comments